ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు

First Published | Nov 26, 2024, 10:12 AM IST

న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులట. జీవితంలో వారు కోరుకున్నవన్నీ వారికి లభిస్తాయట. మరి, లక్కీ గర్ల్స్ ఎవరో చూద్దాం..

జోతిష్యశాస్త్రం లాగానే న్యూమరాలజీ కూడా. మన జీవితాలు ఎలా ఉంటాయో చెప్పేస్తుంది. మనం పుట్టిన తేదీ వలన మనకు మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా అనే విషయాలను కూడా తెలియజేస్తుంది. న్యూమరాలజీ ప్రకారం 2, 11, 20 తేదీల్లో పుట్టిన అమ్మాయిల జీవితం చాలా అందంగా ఉంటుందట. వారిని అదృష్ట దేవతలు అని చెప్పొచ్చు.  ఎందుకంటే వీరు కోరుకున్న జీవితం లభిస్తుంది. ఐశ్వర్యవంతులు అవుతారు. ఎలాంటి సమస్యను అయినా పరిష్కరించగల సత్తా వారిలో ఉంటుంది.

2, 11, 20 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మంచి భార్యలు అవుతారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకునే అబ్బాయిలు అదృష్టవంతులు. పెళ్లి తర్వాత వాళ్ళ జీవితం మారుతుంది. చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటారు.


ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఏ ఇంట్లో కోడలుగా వెళ్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని పండితులు చెబుతారు. వీళ్ళు ఎవరి బాధను చూడలేరు. డబ్బున్నవాళ్ళు అయితే ఇతరులకు సహాయం చేస్తారు.

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ఆకర్షణీయంగా ఉంటారు, మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారని పండితులు చెబుతారు. ఐశ్వర్యవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. వీళ్ళు భావోద్వేగపూరితులైన వ్యక్తులు.

జ్యోతిష్య శాస్త్రంలోని సమాచారం జ్యోతిష్యులు, పంచాంగం, ధార్మిక గ్రంథాలు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఈ సమాచారాన్ని మీకు అందించడమే మా ఉద్దేశ్యం. దీన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించాలని మేము కోరుతున్నాము.

Latest Videos

click me!