Relationship: భర్తలో శృంగార సామర్థ్యం తక్కువగా ఉందా.. అయితే ఇలా చేసి చూడండి?

First Published | Jul 14, 2023, 2:35 PM IST

Relationship: నేటి యువతకి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ. తమశృంగార సామర్థ్యం పై అపోహలు పెంచుకుని ఆత్మ న్యూనతకి గురవుతున్నారు నేటి యువకులు. అప్పుడు భార్యలు ఎలా ప్రవర్తించాలో ఒకసారి చూద్దాం.
 

 నిజంగానే నేటి యువతకి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ. ఏ మాత్రం అవగాహన లేకుండా తమ శృంగార సామర్థ్యం పై ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఆఖరికి పదిమందికి తెలిస్తే పరువు పోతుందని ఆత్మహత్యలకు సైతం వెనకాడటం లేదు. శృంగార సామర్థ్యం భయం, ఆందోళన వలన కూడా తగ్గుతుంది. అది గమనించకుండా తొందరపడుతున్నారు నేటి యువకులు.
 

ఎన్నో ఆశలతో కొత్తగా పెళ్లి చేసుకున్న వారి జీవితాలని ఈ సమస్య పట్టి పీడిస్తుంది. అయినా ఈ సమస్య నేటి రోజులలో పెద్ద సమస్య కాదని చెప్పాలి. ఎందుకంటే ఆధునిక వైద్య విధానంలో సంతాన సాఫల్యతను అవకాశాలు చాలా ఉన్నాయి. మీ శృంగార సామర్థ్యం పై మీకు ఎలాంటి అనుమానం వచ్చిన ముందుగా వైద్యుడిని సంప్రదించండి. భయం, ఆందోళన వలన వచ్చినట్లయితే దాని గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదు.
 

Latest Videos


లేదంటే మాత్రం డాక్టర్ సలహాతో  చికిత్స విధానాన్ని  ప్రారంభించండి. అయితే ఈ విషయంలో ఆ భర్తలకి పూర్తి సపోర్టు వారి భార్యలు ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా భర్తలో అలాంటి సమస్య ఉందని తెలిసినప్పుడు ఆందోళన పడి తీవ్ర నిర్ణయాలు తీసుకోకండి. నిజాన్ని అంగీకరించడానికి వాళ్ళకి కాస్త సమయం పడుతుంది.
 

 కాబట్టి ఆ సమయంలో వారు డిప్రెషన్ లో ఉంటారు. అప్పుడు మీరే ఒక భార్యగా సహనంగా ఉంటూ అతనిని డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావాల్సి ఉంటుంది. తర్వాత బిడ్డని కనాలి అనుకోవటం ఒక స్త్రీకి సహజ కోరిక కానీ మీ భర్త యొక్క పరిస్థితిని అర్థం చేసుకోండి.
 

 కొన్ని రోజుల వరకు ఆందోళన పడకండి. అతనిలోని లోపాన్ని ఎత్తిచూపుతూ అతని వెంట పడకండి. మీ ఈ ప్రవర్తన అతనిని మానసికంగా కృంగదీస్తుంది. అలాగే ఇలాంటి సమస్యలను మూడో వ్యక్తితో  షేర్ చేసుకోకండి.
 

 అసలు సమస్య కన్నా ఒక మగవాడు దీనినే ఎక్కువ అవమానంగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు బిడ్డలని ఐవీఎఫ్ ద్వారా కూడా పొందవచ్చును ఈ విషయాన్ని కూడా మీ భర్తతో చాలా సున్నితంగా చర్చించండి. సమస్యని సున్నితంగా పరిష్కరించుకోండి.

click me!