ప్రభాస్‌కి అల్లు అర్జున్‌ ఊహించని గిఫ్ట్.. ఒక్క మాటలో డార్లింగ్‌ గురించి బన్నీ ఏం చెప్పాడంటే?

First Published | Nov 25, 2024, 7:56 PM IST

ప్రభాస్, అల్లు అర్జున్‌ మధ్య మంచి స్నేహం ఉంది. వీరి మధ్య స్నేహాన్ని తెలియజేసే మరో సంఘటన చోటు చేసుకుంది. దాన్ని బయటపెట్టారు ఐకాన్ స్టార్‌. 
 

Prabhas-Allu Arjun

ప్రభాస్‌, అల్లు అర్జున్‌ ఇండస్ట్రీలో మంచి స్నేహితులు. బేసిక్‌గా డార్లింగ్ కి ఎవరైనా ఫ్రెండ్‌ అవుతారు. ఫ్రెండ్‌గా ఉండిపోతారు. అయితే అల్లు అర్జున్‌తో ప్రభాస్‌ స్నేహం ప్రత్యేకమైనది. హీరోలుగా కాకముందు నుంచే ఆ స్నేహం ఉందని సమాచారం. ఇప్పటికీ ఆ స్నేహం కొనసాగుతుంది. అల్లు అర్జున్‌ ఫస్ట్ సినిమాకి ప్రభాస్‌ చాలా సపోర్ట్ చేశారు. పలు ఈవెంట్లకి కూడా డార్లింగ్‌ వచ్చారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

ప్రభాస్‌కి గిఫ్ట్ ఇవ్వడం అలవాటు. తనకు నచ్చిన వారికి ఏదో రకమైన గిఫ్ట్ లు పంపిస్తూ సర్‌ప్రైజ్‌ చేస్తుంటారు. అలాగే తన స్నేహితుడు బన్నీకి కూడా గిఫ్ట్ ఇస్తుంటారు. ఆ మధ్య వారి పిల్లలకు గిఫ్ట్ లు పంపించాడట. బన్నీ మ్యారేజ్‌కి కూడా కారు గిఫ్ట్ గా ఇచ్చాడనే ప్రచారం జరుగుతుంది.

ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అంతేకాదు ఓ సందర్భంలో క్రిస్మస్‌ ట్రీ పంపించాడట. బన్నీనే ఈ విషయాన్ని తెలిపారు. అల్లు అర్జున్‌ క్రిస్మస్‌కి స్వయంగా క్రిస్మస్‌ ట్రీని డెకరేట్‌ చేస్తుంటారట. ఆ విషయం ప్రభాస్‌కి తెలిసింది.  
 


ఓ సారి ఆయన ఏకంగా క్రిస్మస్‌ ట్రీనే గిఫ్ట్ గా ఇచ్చాడట. యూరప్‌ లో ఆ ట్రీని చూసిన ప్రభాస్‌ దాన్ని కొనుకుని ఇండియాకి తీసుకొచ్చి బన్నీకి పంపించాడట. అది చూసి తాను చాలా సర్‌ప్రైజ్‌ అయినట్టు తెలిపారు బన్నీ. అది తనకు స్వీట్‌ మెమొరీగా ఉండిపోయిందన్నారు. దీంతో తాను కూడా డార్లింగ్‌కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారట.

ప్రభాస్‌కి చెట్లు అంటే ఇష్టం. బన్నీకి కూడా చెట్లు అంటే ఇష్టమట. ఓ స్పెషల్‌ ట్రీని ప్రభాస్‌కి గిఫ్ట్ గా ఇచ్చాడట బన్నీ. ప్రభాస్‌ ఫామ్‌ హౌజ్‌లో పెద్దగా పెరిగేలా ఓ చెట్టుని నాటించినట్టు తెలిపారు బన్నీ. ఇప్పుడు అది చాలా పెద్ద చెట్టుగా ఎదిగిందట. ఇటీవల అన్‌స్టాపబుల్‌ టాక్‌ షోలో ఈ విషయం చెప్పారు అల్లు అర్జున్‌. డార్లింగ్‌ గురించి ఒక్క మాటలో చెబుతూ `బంగారం` అని తెలిపారు. ఈ విషయాన్నిగతంలోనే చెప్పాను, ఇప్పుడూ అదే చెబుతున్నాను అన్నారు ఐకాన్‌ స్టార్‌. 
 

ఇక అల్లు అర్జున్‌ ప్రస్తుతం.. `పుష్ప 2` సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. `పుష్ప` సినిమాకి రెండో పార్ట్ గా ఈ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన `పుష్ప 2` ట్రైలర్ విశేష ఆదరణ దక్కింది.

అన్ని భాషల్లో రికార్డు వ్యూస్‌ సాధించింది. అంతేకాదు ఆదివారం సాయంత్రం చెన్నైలో `కిస్సిక్‌` సాంగ్‌ని కూడా విడుదల చేశారు. దీనికి విశేష ఆదరణ లభిస్తుంది. ఇక వరుసగా పలు నగరాల్లో ఈవెంట్లు నిర్వహిస్తూ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది టీమ్‌. నెక్ట్స్ కేరళాలో ఈవెంట్‌కి ప్లాన్‌ చేస్తుంది. 

మరోవైపు ప్రభాస్ భారీ సినిమాల లైనప్‌తో బిజీగా ఉన్నారు. ఆయన `ది రాజా సాబ్‌`లో నటిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రానుంది. దీంతోపాటు హను రాఘవపూడితో సినిమాలో నటిస్తున్నారు. `స్పిరిట్‌`, `సలార్‌ 2`, `కల్కి 2` చిత్రాల్లో నటించాల్సి ఉంది. ఇవే కాకుండా లోకేష్‌ కనగరాజ్‌, ప్రశాంత్‌ వర్మలతోనూ ఆయన సినిమాలు చేయనున్నారని సమాచారం. 

Read more:సెట్‌లో బాలకృష్ణ నిజ స్వరూపం బయటపెట్టిన రోజా, వైసీపీ నాయకులకు మండడం ఖాయం

also read: ఏఎన్నార్‌కేమో వీరాభిమాని, అఖిల్‌ని పట్టుకుని బండ బూతులు తిట్టిన టీచర్.. అక్కినేని హీరోకి అవమానం

Latest Videos

click me!