సెట్‌లో బాలకృష్ణ నిజ స్వరూపం బయటపెట్టిన రోజా, వైసీపీ నాయకులకు మండడం ఖాయం

Published : Nov 25, 2024, 06:27 PM IST

బాలకృష్ణ, రోజా రాజకీయంగా ఇద్దరికి పడదు. కానీ సినిమాల్లో మాత్రం ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. సినిమా సెట్‌లో బాలకృష్ణ ఎలా ఉంటారో బయటపెట్టింది రోజా.   

PREV
15
సెట్‌లో బాలకృష్ణ నిజ స్వరూపం బయటపెట్టిన రోజా, వైసీపీ నాయకులకు మండడం ఖాయం

ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ, మాజీ మంత్రి, నటి రోజా రాజకీయాల్లో బద్ద శత్రువులు. మొన్నటి వరకు నువ్వా నేనా అని అసెంబ్లీలో రెచ్చిపోయారు. కానీ రాజకీయాలకు అతీతంగా వీరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరు కలిసి పలు సినిమాల్లో కూడా నటించారు. దీంతో రాజకీయాలకు ముందు మంచి రిలేషన్‌ ఉంది. అంతేకాదు రోజా గురించి బాలయ్య అనేకసార్లు ప్రశంసించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

25

అయితే బాలయ్య గురించి పలు పచ్చి నిజాలు బయటపెట్టింది రోజా. `భైరవద్వీపం`, `బొబ్బిలి సింహం`, `గాంఢీవం`, `మాతో పెట్టుకోకు`, `శ్రీ కృష్ణా విజయము`, `పెద్దన్నయ్య`, `సుల్తాన్‌` చిత్రాల్లో కలిసి నటించారు. `పరమ వీర చక్ర`, `శ్రీరామ రాజ్యం` చిత్రాల్లో జోడీగా కాకుండా నటించారు.

ఇలా దాదాపు పది సినిమాల్లో ఈ ఇద్దరు భాగమయ్యారు. దీంతో వీరి మధ్య మంచి అనుబంధం ఉందని చెప్పొచ్చు. అయితే రాజకీయాల్లోకి వచ్చాక కొంత గ్యాప్‌ వచ్చింది. బాలకృష్ణ టీడీపీలో ఉన్నారు, రోజా వైసీపీలో ఉన్నారు. 
 

35

అయితే సినిమాల షూటింగ్‌లో బాలయ్య ఎలా ఉంటారో, సెట్‌లో ఏం జరుగుతుందో బయటపెట్టింది రోజా. బేసిక్‌గా బాలకృష్ణ చాలా సీరియస్‌గా ఉంటారని అంటారు. కానీ సెట్‌లో బాలయ్య చాలా జోవియల్‌గా ఉంటారట. ఖాళీ టైమ్‌ దొరికితే అందరిని పిలిచి మాట్లాడుతుంటాడట. తనే గోల గోలగా ఉంటాడట. సరదాగా జోకులు వేస్తుంటాడట.

అంతేకాదు పాత విషయాలు చెబుతాడట. పద్యాలు, పాటలు పాడుతూ ఆద్యంతం అలరిస్తారట. బాలకృష్ణ ఇలా కూడా ఉంటాడా? అని ఆశ్చర్యపోయేలా ఆయన ఫ్రీగా ఉంటాడని తెలిపింది రోజా. అంతేకాదు తన కలర్‌ గురించి ప్రశంసిస్తుంటాడని, తన నోస్‌, మౌత్‌, కళ్లు రాణి పాత్రలకు బాగా సెట్‌ అవుతాయని అంటుండేవారని, చాలా తక్కువ మందికి ఇలాంటి ఫీచర్స్ ఉంటాయని తరచూ చెప్పేవారని తెలిపింది రోజా. 
 

45

తమ పార్టీలు వేరైనా, అసెంబ్లీలో కూడా హాయ్‌ రోజా అంటూ ఆయనే మందలిస్తాడట. గట్టిగా పిలిచి విష్‌ చేస్తాడని తెలిపింది రోజా. ఇది విని ఇతర ఎమ్మెల్యేలు షాక్‌ అవుతుంటారని, వీరేంటి ఇలా ఉన్నారని, రాజకీయంగా బద్ద శత్రువులు, ఇంత క్లోజ్‌గా మాట్లాడుకుంటున్నారని ఆశ్చర్యపోతుంటారని వెల్లడించింది రోజా.

ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. బాలయ్యపై ఆమె ప్రశంసలు కురిపించడం ఆశ్చర్యంగా మారింది. ఇది వైసీపీ నాయకులకు మంట రేపేలా ఉండటం గమనార్హం. అయితే రాజకీయాలకు అతీతంగా చూస్తే వీరంతా సినిమా ఆర్టిస్టులు కాబట్టి ఆ ర్యాపో ఉండటంలో తప్పులేదు. 
 

55
Ex Minister Roja

ఇక నగరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా మొన్నటి వరకు మంత్రిగా చేసిన రోజా మొన్న 2014 ఎన్నికల్లో ఓడిపోయింది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఇటీవలే ఈ విషయాన్ని వెల్లడించింది. మళ్లీ తాను సినిమాల్లోకి రావాలనుకుంటున్నట్టు చెప్పింది. పవర్‌ఫుల్‌ రోల్స్ తో మెప్పించాలనుకుంటుంది. రమ్యకృష్ణ, విజయశాంతి, నదియాలా బలమైన పాత్రలు చేయాలని ఉందని చెప్పింది. 

read more: సినిమాల్లోకి రోజా రీఎంట్రీ.. ఎలాంటి రోల్స్ చేయాలని ఉందో మనసులో మాట బయటపెట్టిన ఫైర్‌ బ్రాండ్

also read: ఏఎన్నార్‌కేమో వీరాభిమాని, అఖిల్‌ని పట్టుకుని బండ బూతులు తిట్టిన టీచర్.. అక్కినేని హీరోకి అవమానం

 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories