సెక్స్ సమయంలో సరైన అంగస్తంభన లేకపోవడం సమస్యను ప్రస్తుతం చాలా మంది పురుషులు ఫేస్ చేస్తున్నారు. ఒక్కోసారి ఇలా జరగడం చాలా సహజం. కానీ ప్రతిసారీ పురుషాంగం నిటారుగా ఉండలేకపోవడం ఆరోగ్య సమస్యేనంటున్నారు నిపుణులు. మెడికల్ న్యూస్ టుడే ప్రకారం.. 40 సంవత్సరాల వయస్సు తర్వాత సుమారు 20 శాతం మంది పురుషులకు ఇలాంటి సమస్య ఉంది. ఇది పురుషుల మనోధైర్యాన్ని తగ్గించడమే కాకుండా సంబంధంలో నిరాశకు కూడా దారితీస్తుంది. దీనివల్ల చాలా మంది మానసికంగా బలహీనపడతారు.అయితే కొన్ని చిట్కాలు ఈ సమస్యను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి.
erectile dysfunction
అంగస్తంభన లోపం అంటే ఏమిటి?
అంగస్తంభనలు లైంగిక ఉద్రేకం వల్ల సంభవిస్తాయి. లైంగిక ఆలోచనలు లేదా కోరికలు మీ మనస్సులోకి వచ్చినప్పుడు ఉద్దీపన సంభవిస్తుంది. అప్పుడు మీ గుండెకు సంకేతం అందుతుంది. దీంతో గుండె రక్తాన్ని పంప్ చేసి పురుషాంగానికి పంపుతుంది. అంగస్తంభన కోసం లైంగిక ప్రేరేపణ అవసరం. ఈ రక్తప్రసరణ వల్ల పురుషాంగం నిటారుగా మారుతుంది.
సరిగ్గా తినడం
వేయించిన, జంక్ ఫుడ్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర బరువు పెరగడంతో పాటుగా శరీరంలో ఎన్నో వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. మీ భాగస్వామికి అంగస్తంభన సమస్య ఉంటే.. విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, ప్రోటీన్ ను ఎక్కువ మొత్తంలో తీసుకోమని చెప్పండి. ఒక పరిశోధన ప్రకారం.. ఈ సమస్యతో బాధపడే పురుషుల శరీరంలో ఫ్లేవనాయిడ్ల పరిమాణం తక్కువగా ఉంటుంది. ఇది పండ్లు, కూరగాయల నుంచి లభిస్తుంది. ఇది అంగస్తంభన పనితీరును బలోపేతం చేస్తుంది. మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఫ్లేవనాయిడ్లను చేర్చితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
ఆల్కహాల్ ను మానుకోండి
క్రమం తప్పకుండా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మీ భాగస్వామి శరీరంలో ఎన్నో రోగాల ప్రమాదం పెరుగుతుంది. ఇది అధిక రక్తపోటు, ఒత్తిడి, లైంగిక ప్రమాద ప్రవర్తన, గుండె ఆరోగ్యం ప్రమాదాన్ని పెంచుతుంది. ఎన్సీబీఐ పరిశోధన ప్రకారం.. 84 మంది పురుషులు క్రమం తప్పకుండా మద్యం సేవించారు. వీరిలో 37 శాతం మంది పురుషుల్లో అంగస్తంభన లోపం ఉన్నట్టు తేలింది. అందుకే మందును తక్కువగా తాగండి. నెమ్మది నెమ్మదిగా ఈ అలవాటును పూర్తిగా మానేయండి.
యోగా
మీ భాగస్వామి ఈ సమస్యతో బాధపడుతుంటే రెగ్యులర్ గా యోగా చేయమని చెప్పండి. నిజానికి రక్తప్రసరణ సక్రమంగా జరగకపోవడం, హార్మోన్ల అసమతుల్యతతో పాటుగా ఎన్నో ఇతర కారణాలు ఈ సమస్యకు దారితీస్తాయి. ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం కూడా అంగస్తంభనకు ప్రధాన కారణం అవుతాయి. అయితే మీరు రెగ్యులర్ గా యోగా చేస్తే ఈ సమస్యను అధిగమించొచ్చు. ఇది శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. కటి కండరాలను సడలిస్తుంది. దీంతో అంగస్తంభన సమస్య తగ్గిపోతుంది. దీని కోసం క్రమం తప్పకుండా పశ్చిమోత్తనసనం, బంధకోనసనం, ధనురాసనం చేయండి.
వైద్య పరీక్ష ముఖ్యం
మీ భాగస్వామి ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే వైద్య పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈ వ్యాధికి సంబంధించిన అన్ని పరీక్షలు చేయించుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. అంతేకాకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు సైకాలజిస్టులు, సెక్స్ థెరపిస్టుల సలహాలు కూడా తీసుకోవచ్చు.