బరువు ఎక్కువుంటే భావప్రాప్తిని పొందలేరా?

First Published Jan 16, 2024, 1:59 PM IST

ఊబకాయం మీ శారీరక ఆకారాన్ని మార్చడమే కాకుండా మీ లైంగిక జీవితంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మరి బరువు ఎక్కువగా ఉండేవారు ఎలాంటి లైంగిక సమస్యలను ఫేస్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Is intimacy means sexual relationship
undefined

శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల ఇర్రెగ్యలర్ పీరియడ్స్, మొటిమల సమస్యలు,  బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే హార్మోన్ల అసమతుల్యత వల్ల లైంగిక వాంఛ తగ్గడం కూడా చాలా సహజం. అవును బరువు ఎక్కువగా ఉన్న కొంతమందిలో లిబిడో తక్కువగా ఉంటుంది. ఈ లిబిడో లేకపోవడం వల్ల ఉద్వేగం పొందలేరు. ఒబేసిటీ అధ్యయనం ప్రకారం.. ఊబకాయంతో బాధపడటం ప్రారంభించినప్పుడు.. వారి లైంగిక జీవితం ప్రభావితమవుతుంది. అలాగే వారిలో లిబిడో తగ్గడం ప్రారంభమవుతుంది. అసలు ఊబకాయం మీ లైంగిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తోందో తెలుసుకుందాం పదండి. 

జర్నల్ ఆఫ్ హెల్త్ అండ్ సెక్స్ గైడ్ ప్రకారం.. బరువు పెరిగిన వారిలో 30 శాతం మంది బలహీనమైన సెక్స్ డ్రైవ్, తక్కువ లిబిడో, పేలవమైన లైంగిక పనితీరుతో బాధపడుతున్నారు. ఊబకాయం వల్లే ఈ సమస్యలన్ నీ పెరగడం ప్రారంభమవుతాయి. 
 

స్థూలకాయం లైంగిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

 లైంగిక వాంఛ తగ్గుతుంది

ఊబకాయం వల్ల లిబిడో తగ్గడం మొదలవుతుంది. నిజానికి శరీరంలో కొవ్వులు పెరగడం వల్ల సెక్స్ హార్మోన్-బైండింగ్ గ్లోబులిన్ అనే రసాయనం పెరుగుతుంది. ఇది శరీరంలోని టెస్టోస్టెరాన్ ను ప్రభావితం చేస్తుంది. ఇది లిబిడోను తగ్గిస్తుంది.
 

స్టామినా తగ్గుతుంది

బరువు ఎక్కువగా ఉండి ఊబకాయులుగా మారిన వారు తమ శరీర స్టామినాను కోల్పోతారు. అలాగే వీళ్లు చాలా త్వరగా అలసిపోవడం ప్రారంభిస్తారు. వీరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి వారి లైంగిక జీవితానికి అంతరాయం కలిగిస్తాయి. అందుకే వీళ్లు దీర్ఘకాలిక శృంగారాన్ని ఆస్వాదించలేరు.
 

 భావప్రాప్తిలో సమస్యలు 

ఊబకాయం కారణంగా వీరి శరీరంలో రక్త ప్రవాహం సరిగ్గా జరగదు. ఇది భావప్రాప్తికి చేరుకోవడాన్ని కష్టతరం చేస్తుంది. జననేంద్రియాలకు రక్త ప్రవాహం తగ్గి రక్త నాళాలు సంకోచించబడతాయి. ఇది లైంగిక జీవితంపై ప్రభావం చూపుతుంది.
 

సెక్స్ భంగిమలను ఆస్వాదించలేకపోవడం

బలమైన లైంగిక సంబంధానికి సాన్నిహిత్యం చాలా ముఖ్యం. మీ భాగస్వామి స్థూలకాయుడైతే  మీరు లైంగిక జీవితాన్ని ఆస్వాధించడానికి వేర్వేరు సెక్స్ భంగిమలను కూడా ఆస్వాదించలేరు. ఇది లైంగిక కోరికలను తగ్గిస్తుంది. తర్వాత ఇది మీ మొత్తం లైంగిక జీవితానికి ఇబ్బందిని కలిగిస్తుంది. 
 

బాడీ షేమింగ్

లైంగిక చర్యను ఆస్వాదించడానికి.. ప్రేమ, అంగీకారం రెండూ అవసరం. శృంగారానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోగలిగే వరకు  మీరు దానిని మనస్ఫూర్తిగా ఆస్వాదించలేరు. స్థూలకాయులు ఆత్మవిశ్వాసం పొందలేకపోతారు. దీని వల్ల వారు ఆనందాన్ని పొందలేరు.

మీరు లేదా మీ భాగస్వామి బరువు ఎక్కువగా ఉండే భావప్రాప్తి పొందడానికి ఈ చిట్కాలను ప్రయత్నించండి

అనుకూలమైన సెక్స్ భంగిమలు 

మీ శరీర బరువు ఎక్కువగా ఉంటే మీ సౌలభ్యాన్ని బట్టి మీరు సెక్స్ భంగిమలను ఎంచుకోండి. ఇది మీ సెక్స్ జీవితంలో ఉత్సాహాన్ని పెంచుతుంది. అలాగే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయడం మానేయండి. 
 

ఫోర్ ప్లేను ఆస్వాదించండి

భావప్రాప్తి సాధించడానికి ఫోర్ ప్లే చాలా ముఖ్యం. ఇది మీ లైంగిక కోరికలను పెంచుతుంది. అలాగే  ఇది లైంగిక ఆనందానికి దారితీస్తుంది. ఫోర్ ప్లే కోసం మీరు మీ జీ స్పాట్ లను తెలుసుకోవాలి. క్లిటోరి,  చనుమొన నుంచి దిగువ ఉదరం వంటి భాగాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. 
 

ఒకరితో ఒకరు మాట్లాడుకోండి

రతిక్రీడ కోసం స్పాట్ ను ప్రేరేపించే విధానం ఆనందాన్ని పొందేలా చేయదు. అలాగే  మీరు ఒకరితో ఒకరు మాట్లాడకుండా భావప్రాప్తిని చేరుకోలేరు. మీ కోరికలు, సమస్యలను వ్యక్తపరచడం చాలా ముఖ్యం. అందుకే భాగస్వామితో వీటి గురించి వివరంగా చెప్పండి.
 

సెక్స్ టాయ్స్

మీ సెక్స్ జీవితంలో కొత్తదనాన్ని తీసుకురావడానికి సెక్స్ టాయ్స్ ను కూడా ఉపయోగించొచ్చు. ఇది మీ సెక్స్ జీవితాన్ని సులభతరం చేస్తుంది. అలాగే లైంగిక ఆనందాన్ని పొందేలా చేస్తుంది. అలాగే హస్తప్రయోగంతో కొత్త అనుభూతిని పొందుతారు. 

click me!