21 రోజుల్లో 13 దేశాలు తిరిగొచ్చేయండి.. ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం ఇదే

First Published | Nov 28, 2024, 11:26 AM IST

ప్రపంచాన్ని చుట్టి రావాలనుందా? 21 రోజుల్లో 13 దేశాలను చూపించే రైలు మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం కూడా ఇదే. ఈ ట్రైన్ మొత్తం 18,755 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మీకు ఆ దేశాల ప్రకృతి అందాలను పరిచయం చేస్తుంది. ఈ  ట్రైన్ టికెట్ ధర తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంత తక్కువ ధరకు అన్ని దేశాలు తిరిగి రావచ్చా అని వెంటనే టిక్కెట్ బుక్ చేసుకుంటారు. 

చలికాలంలో చాలా మంది సిమ్లా, మనాలి వంటి అందమైన హిల్ స్టేషన్లకు వెళతారు. మరికొందరు పారిస్, సింగపూర్ వంటి నగరాలను చూడాలని అనుకుంటారు. కానీ ఒకే ప్రయాణంలో మీరు అన్నీ ఆస్వాదించవచ్చని చెబితే మీరు నమ్ముతారా? అవును. ఒకే రైలు ప్రయాణంలో మీరు 13 దేశాలను చూడవచ్చు. పారిస్ అందాలను ఎంజాయ్ చేయొచ్చు. సింగపూర్‌లో షాపింగ్ చేయొచ్చు. స్పెయిన్, థాయిలాండ్ బీచ్‌లలో విశ్రాంతి తీసుకోవచ్చు. ఇవన్నీ 21 రోజుల్లో మీరు చూసి రావచ్చు. ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం ఇదే. ఈ జర్నీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. 

ఈ ట్రైన్ పేరు బోటెన్-వియెంటియన్ ట్రైన్. ఇది పోర్చుగల్‌ దేశంలోని అల్గార్వే నుండి ప్రారంభమవుతుంది.  ఈ రైలు స్పెయిన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, వియత్నాం, థాయిలాండ్ వంటి 13 దేశాల మీదుగా ప్రయాణించి చివరకు సింగపూర్ చేరుకుంటుంది. ఈ రైలు మార్గం మధ్యలో 11 చోట్ల ఆగుతుంది. వాతావరణం వల్ల అంతరాయాలు ఏమైనా ఉంటే ఈ ప్రయాణ సమయం పొడిగిస్తారు. మీరు గాని ఈ ట్రైన్ ఎక్కితే 21 రోజుల్లో 18,755 కి.మీ. దూరం ప్రయాణిస్తారు. 


ఈ రైలు ప్రయాణంలో మీరు అందమైన యూరోపియన్ దేశాల నుండి సైబీరియా మంచు ప్రాంతాల వరకు ఉన్న వివిధ రకాల సంస్కృతులు, ప్రకృతి దృశ్యాలను చూసే అవకాశం పొందుతారు. పారిస్, మాస్కో, బీజింగ్, బ్యాంకాక్ వంటి నగరాల్లో రైలు ఆగుతుంది. కాబట్టి ప్రపంచంలోని బెస్ట్ సిటీస్ ని, అక్కడ అందాలను, కల్చర్ ను ఆస్వాదించే అవకాశం మీకు కలుగుతుంది. 

ఈ రైలు టికెట్ ధర దాదాపు 1,350 అమెరికన్ డాలర్లు ఉంటుంది. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ.1,13,988 అన్న మాట. టికెట్ బుక్ చేసుకుంటే చాలు.. భోజనం, వసతి ట్రైన్ లోనే ఇస్తారు. అన్నింటికీ కలిపి ఈ టికెట్ ధర నిర్ణయించారు. ఈ ప్రయాణంలో రకరకాల భోజనం, పానీయాలు, సౌకర్యవంతమైన వసతి ఏర్పాట్లు ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా జర్నీని ఎంజాయ్ చేయడమే మీ పని.  

యూరప్ నుండి ఆసియా వరకు ఒకే రైలులో అనేక దేశాలు తిరిగే అరుదైన అవకాశాన్ని ఈ ట్రైన్ కల్పిస్తుంది. ఇది ప్రయాణికులకు కచ్చితంగా ఒక గొప్ప మెమొరబుల్ జర్నీగా గుర్తుండిపోతుంది.

ఈ ప్రయాణం చేయాలనుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. అందుకే ముందు వాతావరణం గురించి ఎక్వైరీ చేసుకొని టికెట్లు బుక్ చేసుకోవాలి. అవసరమైన అన్ని డాక్యుమెంట్లు దగ్గర పెట్టుకోవాలి. ఈ రైలులో సీట్లు ఖాళీ ఉన్నాయో లేదో ముందే చూసుకోవాలి. సరైన ప్రణాళికతో మీరు ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం చేసి, జీవితంలో మరచిపోలేని ఆనందాన్ని పొందండి. 

Latest Videos

click me!