జుట్టు పలచగా ఉందా? ఒత్తుగా మార్చే ట్రిక్స్ ఇవి

Published : Nov 28, 2024, 12:01 PM IST

ఈరోజుల్లో జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. జుట్టు విపరీతంగా ఊడిపోవడం, దీంతో జుట్టు పలచగా మారడం వంటి చాలా సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటివారు ఈ కింది చిట్కాలు ఫాలో అయితే చాలు, మీ జుట్టు మళ్లీ ఒత్తుగా కనిపిస్తుంది.     

PREV
14
జుట్టు పలచగా ఉందా? ఒత్తుగా మార్చే ట్రిక్స్ ఇవి

ఈ రోజుల్లో జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. తాము ఎంత కేర్ తీసుకున్నా కూడా  జుట్టు విపరీతంగా రాలిపోతోందని బాధపడుతూ ఉంటారు. అయితే... మనం రెగ్యులర్ గా కొన్ని హెయిర్ కేర్ ట్రిక్స్ ఫాలో అయితే జుట్టు సమస్యల నుంచి బయటపడొచ్చట. దానిలో మొదటిది... రెగ్యులర్ గా తలకు షాంపూ చేస్తూ ఉండాలట. షాంపూ చేసినప్పుడు మన జుట్టు నార్మల్ గా కంటే ఒత్తుగా ఉన్నట్లు కనపడుతుంది. ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్స్ ఉన్న సమయంలో.. షాంపూ చేయడం చాలా అవసరం.

 

 

24

మనం జుట్టుకు షాంపూ చేసిన తర్వాత , హెయిర్ షైన్ గా, మృదువుగా మార్చుకోవడానికి కండిషనర్ వాడుతూ ఉంటారు. కానీ.. జుట్టు పలచగా ఉన్నవారు మాత్రం కండషనర్ అస్సలు వాడకూడదట. ఎందుకంటే.. కండిషనర్ వాడితే.. జుట్టు మరింత పలచగా కనపడుతుందట.  ఒత్తుగా కనపడే అవకాశం చాలా తక్కువగా ఉంటుందట. కాబట్టి, ఆ పొరపాటు చేయకండి.

34

ఎక్కువ మంది బయటకు వెళ్లే అవసరం ఉన్నప్పుడు, ఫంక్షన్ లకు వెళ్లే ముందు తలస్నానం చేస్తూ ఉంటారు. అది మంచిదే కానీ, తడి తల మీద బయటకు వెళ్లకూడదు. తడి జుట్టు వల్ల.. జుట్టు తక్కువగా ఉన్నట్లు కనపడుతుంది. తల పూర్తిగా ఆరిన తర్వాత దువ్వుకొని వెళితే.. జుట్టు ఒత్తుగా కనపడుతుంది. 

44

జుట్టు పలచగా ఉన్నవారు కూడా హెయిర్ స్టైల్ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అల్లుకోవడం వల్ల జుట్టు పలచగా, సన్నగా కనపడుతుంది. అలా కాకుండా.. ఫ్రీ స్టైల్ బాగుంటుంది.  కానీ ఎలా దువ్వాలి, ఎలా ఉంచుకోవాలి అనేది చూసుకోవాలి. జుట్టును కట్టుకునేటప్పుడు కూడా  లూజుగా కట్టుకోవాలి. అవసరమైతే హెయిర్ స్టైలిస్ట్ సలహా తీసుకోవచ్చు.

click me!

Recommended Stories