ఏం చేస్తే.. ఫ్రిజ్ లో వాసన పోతుందో తెలుసా?

First Published | Nov 28, 2024, 10:54 AM IST

కొన్నిసార్లు ఫ్రిజ్ లో ఏదైనా కుళ్లిపోవడం లేదా ఆహార పదార్థాన్ని తెరిచి ఉంచడం వల్ల ఫ్రిజ్ మొత్తం వాసనతో నిండిపోతుంది. దీని వల్ల ఫ్రిజ్ తెరవడంలో చాలా దుర్వాసన వస్తుంది. దాన్ని తొలగించడం అవసరం అవుతుంది. దీన్ని తొలగించడానికి ఈ రోజు మేము మీకు ఒక ట్రిక్ చెప్పబోతున్నాము.

చాలా సార్లు మనం ఫ్రిజ్ లో ఫుడ్ ఐటమ్స్ ను పెట్టేసి చాలా రోజుల వరకు తీయకుండా ఉంటాం. దీనివల్ల అవి పాడయ్యి ఫ్రిజ్ లో దుర్వాసన రావడం మొదలవుతుంది. కానీ ఈ వాసన ఫ్రిజ్ లో ఉన్న మిగతా వాటికి కూడా సోకుతుంది. దీనివల్ల ఫ్రిజ్ లో ఉన్న వేటినీ తినాలనిపించదు. అందుకే ఫ్రిజ్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. 

లేదంటే ఫ్రిజ్ లో మీరు తినడానికి పెట్టిన వేటిని తినలేరు. కానీ ఈ దుర్వాసన మాత్రం అంత సులువుగా ఫ్రిజ్ లో నుంచి పోదు. కానీ ఓట్ మీల్ తో ఫ్రిజ్ నుంచి వచ్చే దుర్వాసనను చాలా సులువుగా పోగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఓట్ మీల్ తో..

చాలా మంది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఓట్ మీల్ ను బాగా తింటుంటారు. అయితే ఈ ఓట్ మీల్ తో కూడా ఫ్రిజ్ ను క్లీన్ చేయొచ్చు. ఫ్రిజ్ నుంచి దుర్వాసనను చిటికెలో పోగొట్టొచ్చు. ఇందుకోసం కొన్ని  ఓట్స్ ను తీసుకుని ఒక అల్యూమినియం పాత్రలో పోసి ఫ్రిజ్ లో పెట్టండి. అంతే కొద్దిసేపటి తర్వాత ఫ్రిజ్ లో నుంచి దుర్వాసన రావడం తగ్గుతుంది. 

వైట్ వెనిగర్ తో

వైట్ వెనిగర్ తో కూడా మీరు ఫ్రిజ్ లో నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించొచ్చు. ఈ వెనిగర్ ను ఊరగాయ, స్నాక్స్ లో బాగా వాడుతారు. ఇది ఫ్రిజ్ లో నుంచి వచ్చే చెడు వాసనను పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం వెనిగర్ ను ఒక గిన్నె లేదా గ్లాసులోకి తీసుకోండి. దీనిని ఫ్రిజ్ ను ఓపెన్ చేసి పెట్టండి. అయితే ఫ్రిజ్ డోర్ ను మాత్రం క్లోజ్ చేయకూడదు. దీనివల్ల వాసన పూర్తిగా పోతుంది.
 



వార్తాపత్రిక రోలింగ్ 

వార్తాపత్రికలతో మనం ఎన్నో పనులు చేయొచ్చు. ముఖ్యంగా ఫ్రిజ్ ను కూడా క్లీన్ చేయొచ్చు. మీ ఫ్రిజ్ నుంచి వచ్చే వాసన పోవాలంటే కొన్ని పాత న్యూస్ పేపర్లను తీసుకుని రోల్స్ చేయండి. వీటిని ఫ్రిజ్ లో పెట్టండి. దీనివల్ల ఫ్రిజ్ లో దుర్వాసన పూర్తిగా పోతుంది. 
 

బేకింగ్ సోడా నీళ్లతో.. 

ఫ్రిజ్ నుంచి వచ్చే దుర్వాసనను పోగొట్టడంలో బేకింగ్ సోడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం కొన్ని నీళ్లు తీసుకుని దాంట్లో బేకింగ్ సోడాను వేసి కరిగించండి. దీంట్లోనే కొంచెం వెనిగర్ ను వేసి కలపండి. దీనితో ఫ్రిజ్ ను తుడవండి. ఒక గంట తర్వాత ఫ్రిజ్ లో నుంచి ఎలాంటి దుర్వాసన రాదు. 
 

ఫ్రిజ్ క్లీనింగ్

ఫ్రిజ్ నుంచి దుర్వాసన రాకూడదంటే పై చిట్కాలను పాటించడంతో పాటుగా.. ఫ్రిజ్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఫ్రిజ్ లో పెట్టిన ఫుడ్ ఐటమ్స్ లేదా కూరగాయలు, పండ్లు మురిగిపోతున్నాయేమో చెక్ చేస్తూ ఉండండి. దీనివల్ల ఫ్రిజ్ లో నుంచి వాసన రాకుండా ఉంటుంది. ఫ్రిజ్ లో ఏవైనా కుళ్లిపోవడం వల్లే వాసన వస్తుంది. 

Latest Videos

click me!