40 ఏండ్ల తర్వాత కూడా శృంగారంలో చురుగ్గా ఉండాలంటే..?

First Published | Jun 8, 2023, 10:33 AM IST

లైంగికంగా చురుగ్గా లేకపోతే భాగస్వాముల మధ్య ఎన్నో విభేదాలు వస్తాయి. అలాగే వారి సాన్నిహిత్యం కూడా దెబ్బతింటుంది. సెక్స్ మీ జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి, ప్రేమను పెంచడానికి సహాయపడుతుంది. కానీ 40 ఏండ్ల తర్వాత లైంగిక జీవితానికి చాలా మంది పుల్ స్టాప్ పెడతారు. 
 

చిన్న చిన్న క్షణాల్లో కూడా ఆనందాన్ని వెతుక్కోవడం వల్ల రిలేషన్ షిప్ లో ఆనందం రెట్టింపు అవుతుంది. పెళ్లైన మొదట్లోనే ప్రతి జంట లైంగిక  కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటారు. కానీ మారుతున్న పరిస్థితులు, బాధ్యతల వల్ల మీ జీవితంలో ఆనందం, సెక్స్ డ్రైవ్ తగ్గుతాయి. సెక్స్ జీవితాన్ని సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచడానికి మీ ఇద్దరు ప్రయత్నించడం చాలా ముఖ్యం. లిబిడోను పెంచడానికి ఎన్నో ఉత్పత్తులు, మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవే కాకుండా మీ సెక్స్ లైఫ్ ను హ్యాపీగా కొన్ని చిట్కాలు కూడా ఎంతో సహాయపడతాయి. 

లైంగిక సంబంధాల ప్రభావం మన ఆరోగ్యంపై కూడా కనిపిస్తుందని ఎన్సీబీఐ పరిశోధనలో తేలింది. లైంగిక సంబంధాల్లో ఆనందాన్ని పొందని మహిళలు అధిక రక్తపోటు బారిన పడుతున్నారని తేలింది. ఇక పురుషులైతే ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారట. మొత్తం జీవిత నాణ్యతను మెరుగుపరచడానికి సెక్స్ చాలా ముఖ్యమని పరిశోధనలో తేలింది.

Latest Videos


Image: Getty Images

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. లైంగిక ఆరోగ్యం, లైంగిక సంబంధాలకు సానుకూల, గౌరవప్రదమైన విధానం చాలా చాలా అవసరం. వీటితో పాటుగా బలవంతం, వివక్ష, హింస లేకుండా ఆరోగ్యకరమైన సంబంధాలను నిర్మించుకోవాలి. లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి లైంగిక హక్కులను గౌరవించాలి. పరిరక్షించాలి. లైంగిక జీవితాన్ని ఆరోగ్యంగా మార్చడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

సాంగత్యంపై ఎక్కువ దృష్టి పెట్టండి

చాలా మంది సెక్స్ లో పాల్గొంటున్నామా అంటే పాల్గొంటున్నాం అన్నట్టుగానే ఉంటారు. కానీ సెక్స్ సమయంలో సంతృప్తిపై దృష్టిని అసలే పెట్టరు. ఒకరికొకరు తోడుగా ఉంటే చాలు.. ఒకరితో ఒకరు సమయం గడపడిపితే చాలు అనుకునేవారు చాలా మందే ఉన్నారు. వీటిపైనే ఎక్కువ దృష్టి పెడతారు. అయితే శృంగారంలో భావప్రాప్తిని తారాస్థాయికి తీసుకెళ్లడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. నిజానికి భావప్రాప్తితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నప్పుడు శృంగారంలో పాల్గొన్న ప్రతిసారీ మీరు లైంగిక ఆనందాన్ని పొందలేరు. సంతోషకరమైన జంటలు సెక్స్ పనితీరు కంటే ఆ సమయాన్ని ఆస్వాదించడంపైనే ఎక్కువ దృష్టి పెడతారు. ఇది వారి సంబంధాన్ని బలంగా, ఆరోగ్యంగా చేస్తుంది.


మీ భాగస్వామి గురించి పట్టించుకోండి

మీ భాగస్వామితో సెక్స్ చేసేటప్పుడు, సెక్స్ తర్వాత సమయం ఇస్తే ఒకరిపై ఒకరికి అవగాహన పెరుగుతుంది. నిజానికి చాలా మంది జంటలు ఒకరిపై ఒకరికి ఆకర్షణ పోయిన తర్వాత అసంతృప్తిగా ఉంటారు. సెక్స్ సమయంలో మాత్రమే ప్రేమగా ఉంటారు. ఆ తర్వాత ఒకరి ఇష్టాయిష్టాల గురించి మరొకరు పట్టించుకోరు. కాగా మంచి స్నేహితులుగా ఉండే జంటలు ఒకరినొకరు ప్రేమించుకోవడంతో పాటుగా భావోద్వేగాల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఫోర్ ప్లే నుంచి ఆఫ్టర్ ప్లే వరకు అన్నింటిలో జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా వీరు సంభోగంలో చురుగ్గా ఉంటారు. 
 

లైంగిక జీవితానికి సమయం 

పెళ్లైన కొన్నేళ్ల తర్వాత సెక్స్  పట్ల ఇంట్రెస్ట్ ను కోల్పోయే జంటలు చాలానే ఉన్నాయి. ఇలాంటి వారికి లైంగిక జీవితం క్రమంగా విసుగ్గా అనిపిస్తుంది. ఇంకొంత కాలం తర్వాత వీరి లైఫ్ లో సెక్స్ అనేదే ఉండదు. కానీ దీనివల్ల వారి జీవితం ఒత్తిడిగా, అలసటగా మారుతుంది. అలాగే వీరి మధ్య రోజురోజుకూ గొడవలు, తగాదాలు పెరిగిపోతాయి. పెళ్లైన కొన్నేండ్ల తర్వాత కూడా సంతోషంగా కనిపించే కొన్ని జంటలు తమ లైంగిక జీవితాన్ని కొనసాగిస్తారు. వీళ్లు వారి భాగస్వామి కోసం సమయాన్ని కేటాయిస్తారు. అయితే వీళ్లు లిబిడో కంటే ఒత్తిడికి దూరంగా ఉండటానికే సెక్స్ కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. 
 

సెక్స్ ను భారంగా భావించొద్దు

పెళ్లైన తర్వాత ఏండ్ల తరబడి శృంగార సౌందర్యాన్ని ఆస్వాదించలేని వారికి సెక్స్ ఒక టాస్క్ లాగా మారుతుంది. వీరు సెక్స్ లో పాల్గొన్నా ఆనందాన్ని మాత్రం పొందలేరు. దీని ప్రభావం వారి బంధంపై కనిపిస్తుంది. క్రమక్రమంగా శృంగారాన్ని భారంగా భావించడం మొదలుపెడతారు. అందుకే మీ సంబంధంలో ఆనందాన్ని పొందడానికి సెక్స్ ను కేవలం ఒక పనిగా భావించొద్దు. ఆ సమయంలో సంతోషాన్ని పొందడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామిని కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఒకరినొకరు సంతోషంగా ఉంచుకోవడం వల్ల మీ బంధం బలపడుతుంది. 
 

ది మ్యాజిక్ ఆఫ్ థింగ్స్

మీ బంధం మరింత బాగుండటానికి మీ భాగస్వామితో మాట్లాడటం చాలా ముఖ్యం. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్ల మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అలాగే లైంగిక జీవితంలో ఒడిదుడుకులను సులభంగా పరిష్కరించుకోవచ్చు. చర్చలు చాలా సమస్యలను పరిష్కరిస్తాయి. శృంగారం విషయాలను సీక్రేట్ గా ఉంచకుండా మీ భాగస్వామితో మాట్లాడటానికి ప్రయత్నించండి. కమ్యూనికేట్ చేసుకోండి. ఇది మీ మధ్య ఆనందాన్ని కలిగిస్తుంది. 

click me!