సెక్స్ ఇద్దరి వ్యక్తుల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. వారి బంధాన్ని మరింత బలంగా చేస్తుంది. ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని పెంచుతుంది. ప్రేమను రెట్టింపు చేస్తుతంది. సెక్స్ లో భాగస్వాములిద్దరూ ఆనందాన్ని పొందుతారు. అంతకు మించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతారు. కానీ కొంతమందికి సెక్స్ తర్వాత సంతోషంగా అనిపించదు. అలాగే బాధపడతారు. ఏడుస్తారు కూడా. సెక్స్ తర్వాత ఏడవడాన్ని సైన్స్ లో పోస్ట్ కోయిటల్ డైస్ఫోరియా (పిసిడి) అంటారు.
ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ సెక్సువల్ మెడిసిన్ ప్రకారం.. కొంతమంది మహిళలు సెక్స్ తర్వాత భావోద్వేగానికి గురవుతారు. దీనివల్లే వారు సెక్స్ తర్వాత ఏడుస్తారు. అంతమాత్రాన వారు శృంగారాన్ని ఆస్వాదించలేదని కాదు. మహిళలు సంతోషంగా, ప్రేమగా సెక్స్ చేసిన తర్వాత కూడా ఏడవొచ్చు.
అయితే ఆడవారు కొన్నిసార్లు మహిళలు సెక్స్ సమయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు. దీనివల్ల వారి మెదడులోని అన్ని కణాలు కలిసి పనిచేయడం ప్రారంభిస్తాయి. ఇది వారికి అన్ని రకాల భావోద్వేగాలను కలిగిస్తుంది. నిజానికి ఏడుపు విశ్రాంతి తీసుకోవడానికి ఒక మార్గం. ఏడుపు మనసును శాంతపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అసలు సెక్స్ తర్వాత ఎందుకు ఏడుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
సెక్స్ తర్వాత ప్రేమ లేకపోవడం
సెక్స్ తర్వాత మీరు మీ భాగస్వామి మాట్లాడుకుంటారా? మీరిద్దరూ కౌగిలించుకుంటున్నారా? నిజానికి సెక్స్ తర్వాత కౌగిలింత చాలా ముఖ్యమంటారు నిపుణులు. ఎందుకంటే ఇదే మీకు వారిపై ఎంత ప్రేమ ఉందో చెబుతుంది. మీకు వారు ఎంతో ముఖ్యమో తెలుపుతుంది. ఇది మీ భాగస్వామికి మంచి ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే సెక్స్ తర్వాత ప్రేమ లేదా అటాచ్ మెంట్ లేకపోవడం వల్ల అవాంఛిత భావన కలుగుతుంది. అందుకే కళ్ల ద్వారా బయటకు వచ్చే భావోద్వేగాలతో నిండిపోతారు.
ఇబ్బంది లేదా గాయం
చాలా మంది మహిళలు తమ శరీరం గురించి అపనమ్మకాలు పెట్టుకుంటారు. అలాగే తమ శరీరం గురించి సిగ్గుపడతారు. అందుకే సెక్స్ తర్వాత కొంతమంది ఏడుస్తారు. ఇది కాకుండా ఏదైనా లైంగిక దాడి లేదా చెడు అనుభవం మెదడును శాశ్వతంగా ప్రభావితం చేస్తుంది. చాలాసార్లు సెక్స్ వారికి చెడు గాయాల్నిన గుర్తు చేస్తుంది. దీని కారణంగా సెక్స్ తర్వాత ఏడుస్తారు. ఇది సాధారణమని కనుగొన్నారు.
విపరీతమైన ఆనందం
చాలా కాలం తర్వాత స్త్రీలు తమ భాగస్వామితో శారీరక సంబంధం పెట్టుకున్నప్పుడు పూర్తి లైంగిక శక్తి వెంటనే బయటకు వస్తుంది. అది కళ్లలో ఆనందబాష్పాలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
డిప్రెషన్
డెలివరీ తర్వాత ఆడవారి శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ప్రసవానంతర సమయంలో శృంగారంలో పాల్గొంటే భావోద్వేగాల కారణంగా మహిళలు ఏడుస్తారని నిపుణులు చెబుతున్నారు.
పనితీరు ఆందోళన
పురుషుల మాదిరిగానే మహిళలకు కూడా తమ పనితీరు గురించి ఆందోళన చెందుతారు. అయితే వారు అనుకున్న ప్రకారం ఏదీ జరగకపోతే వారు విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. అయితే ఒత్తిడి ప్రత్యక్ష ప్రభావమే ఏడుపు. మీ భాగస్వామి మీతో సంతృప్తిగా ఉన్నారా? అని ప్రతి ఒక్కరి మదిలో మెదులుతూనే ఉంటుంది. ఈ ఒత్తిడి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఏడుస్తారట. 32 నుంచి 46 శాతం మంది మహిళలు పిసిడిని అనుభవిస్తారని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.