పుష్ప 1 ఐటెం గర్ల్ సమంతకు పుష్ప 2 శ్రీలీల ఐటెం సాంగ్ నచ్చిందా లేదా? వైరల్ గా స్టార్ లేడీ రివ్యూ 

First Published | Nov 26, 2024, 7:50 AM IST

పుష్ప చిత్రానికి సమంత ఐటెం సాంగ్ ప్రత్యేక ఆకర్షణ. ఈ సాంగ్ పై పెద్ద చర్చ నడిచింది. కాగా పార్ట్ 2 లో శ్రీలీల ఆ బాధ్యత తీసుకుంది. కాగా శ్రీలీల సాంగ్ పై సమంత రివ్యూ సంచలనంగా మారింది.. 
 

Pushpa 2

పుష్ప 2 విడుదలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఇండియా వైడ్ హైప్ నెలకొన్న ఈ మూవీ బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. పుష్ప 2 రూ. 600 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు సమాచారం. శాటిలైట్, డిజిటల్ రైట్స్ కూడా కలిపితే పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 1000 కోట్లు అని ట్రేడ్ వర్గాల అంచనా..

Pushpa 2

అంటే భారీ టార్గెట్ తో పుష్ప 2 బరిలో దిగుతుంది. ఒక్క నైజాం రైట్స్ ఏకంగా రూ. 100 కోట్లకు అమ్మారట. ఇది ఆల్ టైం హైయెస్ట్. ఆర్ ఆర్ ఆర్, కల్కి చిత్రాల నైజాం హక్కులు రూ. 70-75 కోట్ల మధ్య ఉన్నాయి. నైజాం లో పుష్ప 2 రికవరీ అవ్వాలంటే రూ. 220 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉందని సమాచారం. టికెట్స్ ధరల హైక్, అర్థరాత్రి నుండే ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు. ఓపెంగ్స్ ద్వారానే చాలా వరకు రికవరీ చేయాలనేది ప్లాన్.. 
 


ప్రమోషన్స్ లో భాగం పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. చెన్నైలో ప్రీ రిలీజ్ వేడుక చేశారు. ఈ రెండు ఈవెంట్స్ కి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. మరోవైపు మూవీలోని సాంగ్స్ విడుదల చేస్తున్నారు. పుష్ప మూవీలో సమంత ఐటెం సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పుష్ప 2 లో సైతం హాట్ అండ్ గ్లామరస్ ఐటెం సాంగ్ ని డిజైన్ చేశారు. 

కిస్సిక్.. అనే ఈ ఐటెం సాంగ్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల నటించింది. మొదట్లో శ్రీలీల చేయను అన్నారట. మంచి రెమ్యూనరేషన్ ఇవ్వడంతో పాటు, బ్రతిమిలాడి ఆమెను ఒప్పించారని టాక్ ఉంది. శ్రీలీలకు కెరీర్లో ఫస్ట్ ఐటెం సాంగ్ ఇది. అలాగే అతిపెద్ద ఛాలెంజ్ కూడాను. 'ఊ అంటావా మామా' సాంగ్ తో సమంత ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఆ సాంగ్ లో సమంత బోల్డ్ స్టెప్స్ తో రెచ్చిపోయింది. 

సౌత్-నార్త్ అనే తేడా లేకుండా 'ఊ అంటావా మామా' సాంగ్ విపరీతంగా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. సినిమాకు ఆ సాంగ్ ఒక హైలెట్ అని చెప్పాలి. మరి శ్రీలీల సమంతను మరిపించగలదా.. అంతకు మించిన పెర్ఫార్మన్స్ ఇస్తుందా అనే సందేహం ఉంది. కాగా నవంబర్ 24న శ్రీలీల నటించిన 'కిస్సిక్' సాంగ్ విడుదల చేశారు. ఈ మూవీకి యూట్యూబ్ లో స్పందన బాగానే ఉంది. అయితే శ్రీలీల పెర్ఫార్మన్స్ తెలియాలంటే థియేటర్స్ లో పూర్తి స్థాయి సాంగ్ చూడాలి. 

Pushpa 2

కాగా శ్రీలీల సాంగ్ పై సమంత స్పందించారు. ఆమె షార్ట్ రివ్యూ ఇచ్చారు. 'శ్రీలీల చంపేసింది, ప్రశాంతంగా పుష్ప 2 కోసం వెయిట్ చేయండి' అని సమంత తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో వీడియో పోస్ట్ చేసింది. సమంత రివ్యూ వైరల్ అవుతుంది. పుష్ప 2 డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. 

Latest Videos

click me!