‘కంగువా’ డిజాస్టర్: నిర్మాత చెప్పే కారణం వింటే మతిపోతుంది

First Published | Nov 26, 2024, 6:37 AM IST

సూర్య భార్య జ్యోతిక సైతం  మూవీలోని తప్పిదాల్ని అంగీకరించింది. అదే సమయంలో ఇప్పుడు కో ప్రొడ్యూసర్ ధనుంజయన్  ఈ సినిమాని  కొందరు కావాలని ఫ్లాఫ్ చేసారని చెప్పుకొచ్చారు. 

Actor Suriyas Kanguvas India collection report out


 నవంబరు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కంగువా మూవీ..  మార్నింగ్ షో నుంచే డివైడ్  టాక్‌ను సొంతం చేసుకుంది. దాంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర వసూళ్లని రాబట్టలేకపోయింది. మరో ప్రక్క ఇప్పటికే ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

అంతేకాకుండా  కంగువా సినిమా నుంచి 12 నిమిషాల్ని మేకర్స్ ట్రిమ్ చేశారు. అయితే కంగువా కొత్త వెర్షన్‌ ని ఎవరూ పట్టించుకోలేదు. అయితే.. అప్పటికే నెగటివ్ మౌత్ టాక్‌తో ఉన్న ఈ మూవీ మళ్లీ పుంజుకోలేకపోయింది.

Kanguva


సుమారు 400 కోట్లతో తెరకెక్కిన  కంగువా భారీ డిజాస్టర్ గా నిలిచింది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం ఈ స్దాయిలో ఫ్లాఫ్ అవటం నిర్మాతలకు నిద్రపట్టని పరిస్దితి తెలుస్తోంది. ఈ సిట్యువేషన్ లో ఓ ప్రక్కన ఈ సినిమా రివ్యూలపై విరుచుకుపడుతున్నారు.

మరో ప్రక్క సూర్య భార్య జ్యోతిక సైతం  మూవీలోని తప్పిదాల్ని అంగీకరించింది. అదే సమయంలో ఇప్పుడు కో ప్రొడ్యూసర్ ధనుంజయన్  ఈ సినిమాని ఫ్లాఫ్ కొందరు కావాలని చేసారని చెప్పుకొచ్చారు. 


Kanguva


‘కంగువా’ నిర్మాత ధనంజయన్ ఓ యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడుతూ...తమ సినిమాని  పర్టిక్యులర్ గా ఇద్దరు స్టార్స్ ఫ్యాన్ చార్గెట్ చేసారని అన్నారు. వాళ్లకి రెండు పొలిటికల్ పార్టీల అండ ఉందన్నారు. దాంతో తమ సినిమాకు నెగిటివ్ టాక్, రిజల్ట్ వచ్చాయని చెప్పుకొచ్చారు.

ఆ ఫ్యాన్స్ ఎవరికి చెందినవో కూడా చెప్పుకొచ్చారు. విజయ్, అజిత్ ఫ్యాన్స్ తమ సినిమాని కావాలని టార్గెట్ చేసారని అన్నారు. సూర్య తమిళంలో నెక్ట్స్ లెవిల్ కు వెళ్ళకూడదనే ఆలోచనతో సినిమాని తొక్కేసారని అన్నారు. అలాగే కొన్ని రాజకీయ పార్టీలకు కూడా సూర్య ఎదగటం ఇష్టం లేదని , అందుకే సినిమా చుట్టూ నెగిటివిటీని స్ప్రెడ్ చేసారని చెప్పుకొచ్చారు.


అలాగే ధనంజయన్ చెప్తూ..కంగువా ని ఇలా దారుణంగా దెబ్బతీసారని, ఇలా సూర్య చుట్టూ ఉన్న యాక్టివిటీస్ తో , దాని వలన వచ్చిన ఫలితంతో తమ టీమ్ ఏ మాత్రం ఆనందంగా లేదని అన్నారు.

అయితే ఈ స్టేట్మెంట్స్ చూసిన వాళ్లు ఏమంటున్నారంటే..ఇంకా నిర్మాతలు వాస్తవంలోకి రాలేదని, తమ భ్రమలు, ఆలోచనలతో కొన్ని థీరీలు తయారు చేసుకున్నారని అంటున్నారు. సినిమా బాగుంటే ఎవరి ఫ్యాన్స్ ఎంత నెగిటివిటీని స్ప్రెడ్ చేసినా పట్టించుకోకుండా జనం చూస్తారని అన్నారు. సినిమా సరిగ్గా తీయకుండా ఇలా అందరిపై విరుచుకుపడటం, బ్లేమ్ చేయటం వలన కలిసొచ్చేదేమీ లేదని చెప్తున్నారు. 

Kanguva


ఇక కంగువా సినిమాలో సూర్య సరసన దిశా పటాని నటించగా.. బాబీ డియోల్ విలన్‌గా యాక్ట్ చేశారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా.. ఇప్పటికే సూర్య అభిమానులు అతనిపై గుర్రుగా ఉన్నారు. సినిమాలోని పాటలకే కాదు పాటు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు కూడా నాసిరకంగా ఉందని కామెంట్స్ చేసారు. దాంతో థియేటర్లలో సౌండ్ రెండు పాయింట్లు తగ్గించాలని నిర్మాత  సలహా కూడా ఇచ్చారు.

Suriyas Kanguvas saturday Tamil collection report out


మరో ప్రక్క కంగువా ఓటీటీ రైట్స్‌ను మంచి ఫ్యాన్సీ రేటుకి అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబరు చివరి వారంలో ఓటీటీలోకి కంగువా రావాల్సి ఉంది. కానీ.. నెగటివ్ టాక్, విమర్శల నేపథ్యంలో.. ముందుగానే స్ట్రీమింగ్‌కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

డిసెంబరు రెండో వారం లోనే స్ట్రీమింగ్‌కి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఓటీటీలో ఆ 12 నిమిషాలు ట్రిమ్ చేసిన సీన్స్ ఉంటాయో లేదో చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడం లేదు. 

Latest Videos

click me!