అల్లు అర్జున్ మతిమరుపు? ట్రోలర్స్ కామెడీ

First Published | Nov 26, 2024, 6:52 AM IST

పుష్ప 2 ఈవెంట్లో అల్లు అర్జున్ చెప్పిన మాటలు, చేసిన డాన్స్ స్టెప్స్ పై ట్రోలర్స్ కామెడీ చేస్తున్నారు. గతంలో తానే స్టేజిపై డాన్స్ చేసి, ఇప్పుడు టికెట్ కొనుక్కుని చూడాలని చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి.

Allu Arjun


సోషల్ మీడియా యుగంలో ఉన్నాము. ప్రతీది ఆచి,తూచి మాట్లాడాల్సిన పరిస్దితి సెలబ్రెటీలది. ఎందుకంటే స్టార్స్ కు తమగురించి ఎంత తెలుసో..అంతకన్నా ఎక్కువే సోషల్ మీడియా యాంటి ఫ్యాన్స్ తెలుసుకుంటున్నారు. ఫ్యాన్స్ కన్నా యాంటీ ఫ్యాన్సే బాగా యాక్టివ్ గా ఉంటున్నారు.

దానికి తోడు అల్లు అర్జున్ పై ఇప్పుడు ఓ వర్గం వేలెత్తి చూపెట్టేందుకు అవకాసం కోసం ఎదురుచూస్తోంది.  ఈ క్రమంలో అల్లు అర్జున్ (Allu Arjun) కొన్నాళ్లుగా ఏది మాట్లాడినా సంచలనం అవుతోంది.  ట్రోలర్స్ కి పని మొదలవుతోంది. 
 

Pushpa 2


తాజాగా మరోసారి అల్లు అర్జున్ ట్రోలర్స్ కు దొరికి పొయ్యారు. వాళ్లు ఆయనకు మతి మరిపా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆ విషయం ఏంటి అంటే.. మొన్న పుష్ప 2 ఈవెంట్ ఒకటి తమిళనాడులో జరిగింది. ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ స్పీచ్ హాట్ టాపిక్ అయ్యింది.

అక్కడ తమిళ జనాలని ఆకట్టుకోవడానికి  తమిళంలో స్పీచ్ ఇచ్చాడు బన్నీ. చిన్నతనం అంతా చెన్నైలోనే గడవడం వల్ల తమిళం బాగా వచ్చు అని, మనం ఎక్కడికి వెళ్తే అక్కడి నేలకి రెస్పెక్ట్ ఇవ్వాలని అల్లు అర్జున్ చెప్పాడు. అంతవరకూ అందరూ హ్యాపీనే. అయితే అదే స్టేజిపై చేసిన డాన్స్ స్టెప్ విషయంలోనే కామెడీ మొదలైంది.



ఇక ఇదే స్టేజిపై మాట్లాడుతూ చెన్నైలో  తను రజనీకాంత్ (Rajinikanth) సినిమాల కోసం క్యూ లో నిలబడి టికెట్లు కొన్న రోజులు కూడా గుర్తు చేసుకున్నాడు. అయితే చివర్లో తనని స్టేజీపై డాన్స్ చేయమని ఫ్యాన్స్ అడిగితే చేయకుండా ‘ నా డాన్స్ చూడాలంటే టికెట్ కొనుక్కుని థియేటర్లలో చూడాలని చెపుతాను..

కానీ మీకోసం మొదటిసారి స్టేజీపై డాన్స్ చేస్తాను’ అని చెప్పి చిన్న స్టెప్ వేశాడు. అయితే అల్లు అర్జున్ గతంలో తనకి తానుగా చెప్పి మరీ స్టేజీపై డాన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు సోషల్ మీడియా జనం.


గతంలో సరైనోడు సక్సెస్ మీట్ లో ‘నాకెందుకో ఇప్పుడు ఒక స్టెప్ వేయాలని ఉంది’ అంటూ డాన్స్ చేశాడు బన్నీ. దానికి ఒక రేంజ్లో ట్రోల్స్ వచ్చాయి. అలాగే ఒక అవార్డు ఫంక్షన్ లో కూడా ప్రభుదేవాతో కలిసి డాన్స్ చేశాడు. అది కూడా తానే కోరుకుని మరీ చేశాడు.

అలా తనే డాన్స్ చెప్పి మరీ చేస్తున్నప్పుడు   టికెట్ కొనుక్కుని చూడాలి వంటి డైలాగ్స్ ఎందుకు అంటూ కౌంటర్స్ వేస్తున్నారు. అల్లు అర్జున్ ..పుష్ప2 ఒత్తిడిలో మతిమరుపు వచ్చిందా ఏమిటి అని కామెడీ చేస్తున్నారు. నిజానికి ట్రోల్ చేయాల్సినంత పెద్ద విషయం కాదు. కానీ జనాలకు అలవాటైపోయింది. 


 అల్లుఅర్జున్. పాట్నాలో పుష్ప-2 ట్రైలర్‌ లాంచ్‌, చెన్నైలో కిసిక్ సాంగ్ రిలీజ్‌..ఇలా వరుస ఈవెంట్లతో ఫుల్‌ బిజీగా గడుపుతున్నాడు. డిసెంబర్‌ ఫస్ట్‌న హైదరాబాద్‌లో బిగ్‌ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇలా పుష్ప-2 షూటింగ్ స్టార్ట్‌ అయినప్పటి నుంచి నాన్ స్టాప్‌గా వర్క్ చేస్తూ వస్తున్నాడు అల్లు అర్జున్.

దాదాపు 2 వేల కోట్ల టార్గెట్ పెట్టుకున్న బన్నీ దానికి తగ్గట్టు కష్టపడుతున్నాడు. ఇక సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. రిలీజ్ తర్వాత అయితే మరోసారి పెద్ద బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నాడట అల్లుఅర్జున్. డిసెంబర్ 5న పుష్ప-2 రిలీజ్‌ తర్వాత కూడా 20 రోజుల పాటు ప్రమోషన్స్, ప్రెస్ మీట్లు, ఇంటర్య్యూలతో బిజీగా గడపనున్నాడు అల్లు అర్జున్. 
 

Latest Videos

click me!