భారతీయ వ్యాపార దిగ్గజం శశి రుయా కన్నుమూత 

Published : Nov 26, 2024, 09:30 AM ISTUpdated : Nov 26, 2024, 09:48 AM IST
భారతీయ వ్యాపార దిగ్గజం శశి రుయా కన్నుమూత 

సారాంశం

ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకులు శశి రుయా కన్నుమూసారు. 

Shashi Ruia Dies : భారతీయ వ్యాపారదిగ్గజం, ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకులు శశి రుయా కన్నుమూసారు. ఈ మేరకు ఎస్సార్ గ్రూప్ అధినేత, శశి రుయా సోదరుడు రవి రుయా ప్రకటించారు. 

''మా కుటుంబ పెద్ద... రుయా, ఎస్సార్ కుటుంబానికి మార్గదర్శకుడైన శశికాంత్ రుయా గారి మృతివార్తను ఎంతో దిగ్భ్రాంతితో తెలియజేస్తున్నాము. ఆయన 81 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. సమాజ అభివృద్ది,  సేవా కార్యక్రమాలపట్ల ఆయనకు ఉన్న అపారమైన నిబద్ధత లక్షలాది మందిని ప్రేరేపించింది, వారి జీవితాలపై చిరస్థాయిగా ప్రభావం చూపించింది. ఆయనలోని మానవత్వం, మంచి మనసు, అందరినీ కలుపుకుపోయేతత్వం ఒక అసాధారణమైన నాయకుడిగా నిలిపింది" అంటూ సోదరుడి మృతిపై భావోద్వేగభరిత కామెంట్స్ చేసారు ఎస్సార్ గ్రూప్ వ్యవస్థాపకులు రవి రుయా. 

శశి రుయా మృతదేహాన్ని సందర్శనార్థం రుయా హౌస్ లో వుంచారు. సాయంత్రం 4 గంటలకు హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనునన్నారు. కుటుంబసభ్యుడిని కోల్పోయిన రుయా ఫ్యామిలీకి వ్యాపార,రాజకీయ ప్రముఖులు సానుభూతి తెలుపుతున్నారు... శశి రుయా మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  

 

PREV
click me!

Recommended Stories

Post office: రూ. 222తో రూ. 11 ల‌క్ష‌లు.. జ‌స్ట్ వ‌డ్డీ రూపంలోనే రూ. 3.8 ల‌క్ష‌లు పొందొచ్చు
Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్