అలసట, వయస్సు వల్ల సెక్స్ కోరికలు తగ్గుతున్నాయా? ఈ టిప్స్ మీకోసమే..!

First Published | May 1, 2023, 11:24 AM IST

ఎక్కువ పని వల్ల శరీరం బాగా అలసిపోతుంది. ఈ అలసట, వయస్సు పెరగడం వల్ల చాలా మందికి సెక్స్ పై ఇంట్రెస్ట్ ఉండదు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను ఫాలో అయితే మాత్రం మీ లైంగిక జీవితం మెరుగుపడుతుంది. 

అధిక పని, వృద్ధాప్యం, హార్మోన్ల మార్పులు వంటి కారణాల వల్ల లైంగిక వాంఛ దెబ్బతిని సెక్స్ కోరికలు తగ్గిపోతాయి. హార్మోన్ల స్థాయిలు తగ్గడం, నాడీ, ప్రసరణ మార్పుల వల్ల కూడా లిబిడో తగ్గుతుంది. కొన్ని పనుల వల్ల సెక్స్ కోరికలు పెరుగుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. సెక్స్ కోరికలు పెరిగేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

శారీరక ఆకర్షణ

హార్వర్డ్ హెల్త్ ప్రకారం.. సెక్స్ ను ఎక్కువ సేపు ఆస్వాదించడానికి, ఆహ్లాదకరంగా చేయడానికి శారీరక ఆకర్షణ బాగా ఉపయోగపడుతుంది. ఒక సమస్యతో అలసిపోయినప్పుడు లేదా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా భావోద్వేగ అనుబంధం అవసరం. ఇందుకోసం మీ  భాగస్వామిని ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం లాంటివి చేయండి. ఇవి మంచి అనుభూతిని కలిగించి సెక్స్ లో పాల్గొనేలా చేస్తాయి. 
 

Latest Videos


లూబ్రికెంట్ వాడకం

పెరిమెనోపాజ్ ప్రారంభమైనప్పుడు యోని తరచుగా పొడిబారుతుంది. ఇలాంటి సమయంలో సెక్స్ లో పాల్గొంటే విపరీతమైన నొప్పి వస్తుంది. అందుకే యోని పొడిబారినప్పుడు లూబ్రికెంట్ లేదా జెల్స్  ను వాడండి. ఇవి మీరు ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనడానికి సహాయపడతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఒకవేళ మీరు డయాబెటిస్ పేషెంట్ అయితే మీరు షుగర్ లేని లూబ్రికెంట్ లను  ఉపయోగించండి. 
 

టచ్ థెరపీ

ఆఫ్రికన్ రిప్రొడక్టివ్ హెల్త్ జర్నల్ ప్రకారం.. సెక్స్ బొమ్మల వాడకం లైంగిక సంక్రమణ అంటువ్యాధులకు దారితీస్తుంది. అందుకే ఆనందకరమైన సెక్స్ సెషన్ కోసం టచ్ థెరపీని అవలంబించడం అవసరం. ఇందుకోసం ఒకరినొకరు ప్రేమగా తాకడం ప్రాక్టీస్ చేయాలి. దీనికోసం పుస్తకాలను, వీడియోలను చూడొచ్చు. ఒత్తిడికి గురికాకుండా శారీరక సంబంధాన్ని మెరుగుపర్చుకోవడానికి ఇది సహాయపడుతుంది. 
 

వేర్వేరు స్థానాలను ప్రయత్నించండి 

హార్వర్డ్ హెల్త్ ప్రకారం.. ప్రతిసారీ ఒకే పద్దతి కాకుండా వేరువేరు సెక్స్ పొజీషన్స్ ను ట్రై చేయండి. ఇది లవ్ మేకింగ్ పై ఆసక్తిని పెంచడమే కాకుండా, సమస్యలను అధిగమించడానికి కూడా సహాయపడుతుంది. ఉదాహరణకు మెయిల్ భాగస్వామి వెనుక నుంచి ప్రయత్నించినప్పుడు జి-స్పాట్ కోసం ఉత్సాహం పెరుగుతుంది. ఇది స్త్రీ భావప్రాప్తి పొందడానికి సహాయపడుతుంది.
 

రొమాంటిక్ సినిమాలు చూడండి

మీకు, మీ భాగస్వామికి సెక్స్ పై ఇంట్రెస్ట్ పోయినప్పుడు రొమాంటిక్ మూవీ చూడండి. అలాగే మిమ్మల్ని రొమాంటిక్ గా మార్చిన అనుభవం లేదా సినిమా గురించి ఒకరితో ఒకరు చెప్పుకోండి. దీనివల్ల మీ ఇద్దరి మనస్సు తేలిగ్గా ఉంటుంది. టెన్షన్స్ అన్నీ పోతాయి. మీ భాగస్వామితో మీ ఫాంటసీలను కూడా చెప్పడానికి ప్రయత్నించండి. తక్కువ సెక్స్ కోరికలు ఉన్నవారికి ఇది బాగా సహాయపడుతుంది.
 

విశ్రాంతి 

హార్వర్డ్ హెల్త్ ప్రకారం.. సెక్స్ చేయడానికి ముందు కలిసి ఏదైనా సరదాగా చేయండి. అంటే ఆడ ఆడటమో లేదా డిన్నర్ కు బయటకు వెళ్లడం లాంటివి చేయండి. అలాగే లోతైన శ్వాస వ్యాయామాలు లేదా యోగా వంటి శరీరానికి విశ్రాంతినిచ్చే వ్యాయామాలను ప్రయత్నించండి. 

వైబ్రేటర్ ఉపయోగించండి

ఈ సాధనం స్త్రీ తన లైంగిక ప్రతిస్పందన గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది. భాగస్వామిని ఉత్తేజపరచడానికి, సెక్స్ ను మరింత ఆస్వాదించడానికి ఇది ప్రభావవంతమైన ట్రిక్. 

click me!