ముఖం నిండా దుప్పటి కప్పుకుని పడుకుంటే ఏమౌతుందో తెలుసా?

First Published | Nov 26, 2024, 3:40 PM IST

చలికాలంలో దుప్పటి కప్పుకున్న దాకా నిద్రే రాదు. అయితే కొంతమంది దుప్పటిని ముఖం నిండా కప్పుకుని పడుకుంటుంటారు. కానీ దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా?

చలికాలంలో వేడి వేడి దుప్పటి కప్పుకుంటేనే హాయిగా నిద్రపడుతుంది. అయితే కొంతమంది తల నుంచి కాళ్ల వరకు నిండుగా దుప్పటి కప్పుకుని పడుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల చలి తక్కువగా పెట్టినా.. ఆరోగ్యం మాత్రం పాడవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు శరీరం మొత్తం దుప్పటి కప్పుకుని పడుకోవడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

చలికాలం నిద్ర చిట్కాలు - చర్మానికి హానికరం:

చలికాలంలో కాళ్ల నుంచి ముఖం వరకు దుప్పటిని కప్పుకోవడం వల్ల చల్లగాలి ఒంటికి తగలదు. దీనితో చలి పెట్టదు. అందుకే చాలా మంది ఇలా నిండుగా కప్పుకుని పడుకుంటుంటారు. కానీ దీనివల్ల దుప్పట్లో ఉన్న అపరిశుభ్రమైన గాలి బయటకు వెళ్లదు. ఈ గాలిని పీల్చడం వల్ల మీ చర్మం రంగు మారిపోతుంది. అంతేకాకుండా చర్మంపై ముడతలు కూడా ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ముఖంపై మొటిమలు ఏర్పడేలా చేయడంతో పాటుగా చర్మ సమస్యలను కూడా కలిగిస్తుంది. 

ఊపిరితిత్తుల సమస్యలను కలిగిస్తుంది:

ముఖానికి కూడా దుప్పటి కప్పుకోవడం వల్ల ఊపిరితిత్తులకు సరిగ్గా గాలి అందదు. దీంతో ఊపిరితిత్తులు కుంచించుకుపోవడం ప్రారంభమవుతుంది. దీనివల్ల మీకు తలనొప్పి, ఆస్తమా వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఇప్పటికే ఆస్తమా ఉన్నవారు ఇలా ముఖం నిండా దుప్పటి కప్పుకుని పడుకోకూడదు. 


దుప్పటితో ముఖం కప్పి పడుకోవడం

గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది:

శరీరం మొత్తం అంటే ముఖానికి కూడా దుప్పటి కప్పుకోవడం వల్ల మీ శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరిగ్గా అందదు. దీనివల్ల మీ గుండెపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. దీనివల్ల మీకు గుండెపోటు రావడంతో పాటుగా ఊపిరి ఆడకపోవడం వంటి సమస్య కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా దుప్పటితో ముఖాన్ని పూర్తిగా కప్పి నిద్రపోతే వికారం, తల తిరగడం వంటి సమస్యలు కూడా వస్తాయి.

రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది:

దుప్పటిని నిండుగా కప్పుకుని పడుకోవడం వల్ల తగినంత ఆక్సిజన్ దుప్పట్లోకి రాదు. దీనివల్ల శరీరంలో ఉన్న ఆక్సిజన్ మళ్లీ మళ్లీ ఉపయోగించబడుతుంది. దీంతో క్రమంగా దుప్పట్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది మీ రక్త ప్రసరణపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దీంతో మీ శరీరంలోని ప్రతి భాగానికి సరైన మోతాదులో రక్తం ప్రవహించదు.

మెదడు దెబ్బతింటుంది:

దుప్పటిని ముఖం నిండా కప్పుకుని పడుకుంటే కార్బన్-డై-ఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. దీంతో మీ మెదడు పనితీరు దెబ్బతింటుంది.

నిద్ర దెబ్బతింటుంది:

తల నుంచి పాదాల వరకు నిండుగా దుప్పటి కప్పుకుని పడుకుంటే మీ శరీరంలో వేడి పెరుగుతుంది. దీనివల్ల చెమటలు పడతాయి. దీంతో మీరు కంటినిండా నిద్రపోలేరు. 

దుప్పటితో ముఖం కప్పి పడుకోవడం

ఊపిరి ఆడకపోవడం:

 ముఖం నిండా దుప్పటిని కప్పినప్పుడు ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ మార్పిడికి అడ్డంకి కలుగుతుంది. దీంతో మీకు ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

జుట్టు రాలిపోతుంది:

అవును దుప్పటిని తలనిండుగా కప్పితే జుట్టు రాలే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ అలవాటు జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది. దీంతో విపరీతమైన హెయిర్ ఫాల్ ఏర్పడుతుంది. 

గొంతు పొడిబారడం:

దుప్పటి నిండుగా కప్పుకుని పడుకోవడం వల్ల దుప్పట్లో ఉన్న గాలిని పదేపదే పీల్చుతారు. దీనివల్ల గొంతులోపల తేమ తగ్గిపోతుంది. గొంతు తడి ఆరి పొడిబారుతుంది. 

శరీరంలో అలసట:

ఈ అలవాటు వల్ల అలసట కూడా కలుగుతుంది. అవును దుప్పటిని ముఖం నిండా కప్పుకుని పడుకోవడం వల్ల ఆక్సిజన్ తక్కువగా అందుతుంది. దీనివల్ల మీకు తలనొప్పితో పాటుగా అలసట సమస్య కూడా వస్తుంది.

Latest Videos

click me!