సెకండ్ హ్యాండ్ అన్నారు, నిందలు వేశారు, విడాకులుపై నోరు విప్పిన సమంత! 

First Published | Nov 26, 2024, 3:43 PM IST


సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుని మూడేళ్లు అవుతుంది. త్వరలో నాగ చైతన్యకు రెండో పెళ్లి. ఈ క్రమంలో సమంత కీలక విషయాలు బయటపెడుతూ వార్తల్లో నిలుస్తోంది. 
 

SAMANTHA

ఒకవైపు నాగ చైతన్య పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో నాగ చైతన్య-శోభితల వివాహం జరగనుంది. కేవలం 300కి మాత్రమే ఆహ్వానం. పెళ్లి నిరాడంబరంగా జరగనుందట. నాగ చైతన్య కోరిక మేరకు పెళ్లి సింపుల్ గా ముగిస్తున్నామని నాగార్జున సైతం వెల్లడించారు.

మరోవైపు నాగ చైతన్య మాజీ భార్య సమంత... ఇంటర్వ్యూలలో సంచలన కామెంట్స్ చేస్తూ వార్తలకు ఎక్కుతుంది. సమంత-వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలు చేసిన సిటాడెల్: హనీ బన్నీ సిరీస్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. హనీ బన్నీ ప్రమోషన్స్ లో వీరిద్దరూ బిజీగా ఉన్నారు. ఓ ఇంటర్వ్యూలో నువ్వు చేసిన వృద్ధా ఖర్చు ఏమిటంటే.. నా ఎక్స్ (మాజీ భర్త)కి ఖరీదైన బహుమతులు ఇవ్వడం. అవి ఎందుకు పనికిరావు.. అన్నారు. ఇది షాకింగ్ స్టేట్మెంట్ అని చెప్పాలి. 
 


అలాగే విడాకుల ప్రకటన అనంతరం ఎదురైన సవాళ్లు, అవమానాల పై కూడా సమంత ఓపెన్ అయ్యింది. విడాకులు తీసుకున్న తమ లాంటి మహిళలకు ఈ సమాజం సెకండ్ హ్యాండ్ అనే ట్యాగ్ ఇస్తుందని ఆమె వాపోయారు. సమంత మాట్లాడుతూ.. విడాకులు తీసుకున్న అమ్మాయిలకు ఈ సమాజం కొన్ని ట్యాగ్స్ ఇస్తుంది. సెకండ్ హ్యాండ్, ఈ అమ్మాయి జీవితం వృధా, యూజ్డ్ అనే ట్యాగ్స్ ఎందుకు ఇస్తారో అర్థం కాదు. ఈ కామెంట్స్ వలన ఆ అమ్మాయి, తన ఫ్యామిలీ ఎంతో వేదనకు గురి అవుతుంది. 
 


బాధల్లో ఉన్న అమ్మాయి ఇంకా నిరాశ చెందుతుంది. నాపై ఎన్నో నిందలు వేశారు. వాటిలో నిజం లేదు. అందుకే నేను ఆ ఆరోపణల మీద స్పందించలేదు. కఠిన సమయంలో నా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు మద్దతుగా నిలిచారు... అని అన్నారు. సమంత కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

Naga Chaitanya

2017లో ప్రేమ వివాహం చేసుకున్న నాగ చైతన్య- సమంత 2021లో మనస్పర్ధలతో విడిపోయారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. విడాకుల అనంతరం సమంత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. సమంతకు పిల్లల్ని కనడం ఇష్టం లేదు. ఆమె కుటుంబ విలువలు పాటించడం లేదు. బోల్డ్ రోల్స్ చేస్తుంది. ఎఫైర్స్ ఉన్నాయంటూ పుకార్లు చెలరేగాయి. 

Samantha and naga chaitanya

నిరాధార కథనాలతో విసిగిపోయిన సమంత... కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద చర్యలు తీసుకున్నారు.  అప్పటి తన మానసిక వేదనను ఆమె తాజాగా బయటపెట్టారు. కాగా 2022లో సమంత మయోసైటిస్ కి గురైంది. ఈ అరుదైన వ్యాధికి గత రెండేళ్లుగా ఆమె చికిత్స తీసుకుంటుంది. దాదాపు ఏడాది పాటు సమంత ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయలేదు. ఇటీవల ఓ నిర్మాణ సంస్థను స్థాపించిన సమంత... మా ఇంటి బంగారం టైటిల్ తో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్రకటించింది.... 

Latest Videos

click me!