పెళ్లైన కొత్తలో లైంగిక చురుగ్గా ఉండి రాను రాను సెక్స్ కు దూరంగా ఉండేవారు చాలా మందే ఉన్నారు. సెక్స్ మీ బంధాన్ని బలపరచడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కానీ చాలా జంటలు సెక్స్ కు దూరంగా ఉంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ సెక్స్ లో పాల్గొనలేం అని, లైంగిక ఆనందం తగ్గుతుందని చాలా మంది నమ్ముతారు. కకానీ దీనిలో నిజం లేదంటున్నారు నిపుణులు. నిజానికి ఏ వయసులోనైనా లైంగిక ఆనందం తగ్గదు. వాస్తవానికి 40, 50, అంతకంటే ఎక్కువ వయస్సున్న చాలా మంది వ్యక్తులు సంతృప్తికరమైన లైంగిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది వారి మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇతరుల కంటే మరింత సంతోషంగా ఉంచుతుంది.
నిజానికి వయస్సు పెరిగే కొద్దీ లైంగిక కార్యకలాపాల ఫ్రీక్వెన్సీ సహజంగా తగ్గుతుందని పరిశోధనలు వెళ్లడిస్తున్నాయి. కానీ సెక్స్ నాణ్యత, మొత్తం సంతృప్తి మాత్రం మెరుగుపడతాయట. అందుకే మీరు ఎంత తరచుగా సెక్స్ చేస్తారు లేదా భావప్రాప్తి పొందుతారనేది వదిలేసి మీ భాగస్వామితో రిలేషన్ షిప్ గురించి ఆలోచించండి. లైంగిక జీవితం మెరుగ్గా ఉంటేనే మీ ఇద్దరి మధ్య బాండింగ్ అంత స్ట్రాంగ్ గా ఉంటుందంటున్నారు నిపుణులు.
sex life
వృద్ధాప్యంలో కూడా సెక్స్ చేయొచ్చు
శరీరంలో మార్పులు మీ లైంగిక జీవితాలకు కొత్తదనాన్ని తెస్తాయన్న ముచ్చట మీకు తెలుసా? కానీ ఇది ఎల్లప్పుడూ మీకు సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు. అనారోగ్యం, హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, శారీరక, మానసిక సమస్యలు మీ లైంగిక శ్రేయస్సును ప్రభావితం చేస్తాయి.
యోని నొప్పి, అంగస్తంభన లోపం, లిబిడో తగ్గడం వృద్ధాప్యంలో చాలా సహజ సమస్యలు. ఈ వయస్సులో లైంగికంగా చురుగ్గా ఉండటం కాస్త సవాలుగానే ఉంటుంది. కానీ చాలా మంది వృద్ధాప్యంలో కూడా సెక్స్ ను ఆస్వాధించేవారున్నారు. హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్, దీర్ఘకాలిక నొప్పి లేదా రుతువిరతి వంటి అనారోగ్య సమస్యలున్నవారు కూడా లైంగిక సంతృప్తిని పొందొచ్చంటున్నారు నిపుణులు. సెక్స్ మనల్ని యవ్వనంగా, బలంగా భావిస్తుంది. ఇది ఎండార్ఫిన్లను పెంచుతుంది. గుండె పనితీరు, మానసిక స్థితి, నిద్ర, శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది.
అంతేకాక సెక్స్ మీ వైవాహిక జీవితాన్ని మరింత ఆనందంగా చేస్తుంది. భావోద్వేగ సాన్నిహిత్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. మొత్తం శ్రేయస్సుకు లైంగిక శ్రేయస్సు అవసరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ శృంగారం కోసం ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty Images
మీరు లైంగికంగా ఎంత సంతృప్తి చెందారు?
సెక్స్ లో శారీరక, భావోద్వేగ మార్పులను తెలుసుకోవడానికి కాస్త సమయం తీసుకోండి. మీరు భిన్నంగా ఉండాలనుకుంటున్నదాన్ని ప్రయత్నించండి. అలాగే మీ స్వంత సంతృప్తికి ప్రాధాన్యతనివ్వండి. మీకు ఆనందాన్ని కలిగించేవేవో తెలుసుకోండి. నిజానికి ఈ వయసులో కూడా మీరు మంచి లైంగిక ఆనందాన్ని పొందుతారు.
Image: Getty Images
మీ అవసరాలు, కోరికలను చెప్పండి
మీకు ఆనందాన్ని కలిగించే వాటి గురించి మీ భాగస్వామిని మొహమాట పడకుండా చెప్పేయండి. మీ అవసరాలను మీ భాగస్వామికి చెప్తేనే మీ బంధం మరింత బలపడుతుంది. అలాగే మంచి లైంగిక ఆనందాన్ని కూడా పొందుతారు. ఇది మీ ఆత్మ విశ్వాసాన్ని కూడా పెంచుతుంది.
మీ శరీరానికి తగిన శ్రద్ధ ఇవ్వండి
వృద్ధాప్యంతో శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా మీ శరీరం అంత బలంగా ఉండదు. చర్మం వదులుగా మారుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే మీరు ఎక్కువ శక్తివంతంగా, తక్కువ నొప్పితో ఉన్న సమయాల్లోనే లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనండి. మీ మందులు ఏవైనా మీ లైంగిక కార్యకలాపాలపై దుష్ప్రభావాలను చూపితే మీ డాక్టర్ ను సంప్రదించండి.
ఫోర్ ప్లే
సెక్స్ కంటే ముందు ఫోర్ ప్లేలో పాల్గొనండి. దీనిలో ముద్దు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం, మసాజ్ లు వంటివి ఉంటాయి. అలాగే మీ కోరికలు, భయాలు, సరిహద్దుల గురించి మీ భాగస్వామితో బహిరంగంగా చెప్పేయండి. లీడ్ తీసుకోవడానికి సిగ్గుపడకండి.