మాటలు రాని వేళ.. మనసులోని మాటను చెప్పేందుకు ముద్దును ఉపయోగించవచ్చు. ముద్దు బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఇష్టాన్ని తెలియజేసే పద్దతుల్లో ఇది కూడా ఒకటి. అయితే.. ఈ ముద్దు గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియవు. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఓసారి చూడండి..!
జర్మనీ ఫిజీషియన్స్, సైకాలజిస్టులు చేసిన పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే.. ముద్దు పెట్టుకోవడం వల్ల ఎక్కువ కాలం జీవించగలరట. వారు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
2007లో ఓ పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే... తొలి ముద్దును బట్టి... చాలా మంది తమ పార్ట్ నర్ ని జడ్జ్ చేస్తారట. వారు ముద్దు ఎలా పెట్టారనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకుంటారట. ఆ ముద్దుతోనే వారి గురించి ఓ ఐడియాకు వచ్చేస్తారట.
ఇక.. శృంగారంలో పాల్గొనాలి అనే కోరికను కలిగించడంలోనూ... ఈ ముద్దు కీలక పాత్ర పోషిస్తుందట. ముద్దుతో మొదలుపెడితే.. శృంగారం మరింత రసవత్తరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
2003లో జపనీస్ శాస్త్ర వేత్తలు చేసిన సర్వేలో తేలిన విషయం ఏమిటంటే.. ముద్దు పెట్టుకోవడం వల్ల.. శరీరంలో వచ్చే ఎలర్జీలు తగ్గిపోతాయట. అంతేకాదు.. ముద్దు ఒత్తిడిని కూడా తగ్గించేస్తుందట.
అంతేకాదు.. ముద్దు పెట్టుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుందట. అంతేకాదు.. ముఖంలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుందట. ఇది ఫేషియల్ మజిల్స్ లా పనిచేస్తుందట.
మీరు గమనించారో లేదో.. ముద్దు పెట్టే సమయంలో.. మనలో దాదాపు అందరూ.. తమ తలను కుడి వైపు వంచుతామట. ఈ విషయం కూడా ఓ పరిశోదనలోనే తేలడం గమనార్హం.
ఫ్రెంచ్ కిస్ అంటే ఏంటో ఇప్పుడు అందరికీ తెలుసు. అయితే.. ఈ ఫ్రెంచ్ కిస్ ని.. అంతకముందు ఫ్లోరెంటైన్ కిస్ అని పిలిచేవారట. దీనిని మొదటి ప్రపంచ యుద్దం తర్వాత దీనిని బ్రిటీషర్స్ దీనికంటూ ఓ ప్రాధాన్యత తీసుకువచ్చారు.
ఇప్పటి వరకు ప్రపంచంలో అతి పెద్ద ముద్దు.. 58 గంటల 35 నిమిషాల 58 సెకన్ల పాటు పెట్టుకున్నారట. ఇప్పటి వరకు ఇదే ప్రపంచ రికార్డు కావడం గమనార్హం.
మనకు వివిధ విషయాలపై ప్రత్యేకంగా స్టడీస్ ఉంటాయి. అదేవిధంగా... ముద్దు గురించి కూడా స్టడీలు చేయడానికి అధికారికంగా విద్య ఉంది. దానిని ఫిలోమోటాలజీ అని పిలుస్తారు.
కొన్ని సంప్రదాయాలు, మొదటి ఐదు సెంచరీలకు ముందు.. ముద్దును ఒప్పందం కింద ఉపయోగించేవారట. ఏదైనా ఒప్పందం చేసుకునే సమయంలో... ముద్దు పెట్టుకునేవారట.