కరోనా వైరస్ కారణంగా దేశంలో దాదాపు మూడు నెలలపాటు లాక్ డౌన్ విధించారు. ఇప్పుడిప్పుడే ఆ లాక్ డౌన్ రూల్స్ ని సడలిస్తూ వస్తున్నారు. అయితే.. ఈ లాక్ డౌన్ కారణంగా జీవితాలన్నీ తారుమారు అయ్యాయి. అయితే.. ఈ లాక్ డౌన్ సమయంలో.. మనవాళ్లు.. సెక్స్ టాయ్స్ విపరీతంగా కొనుగోలు చేశారట.
undefined
కేవలం దేశంలోనే కాదు.. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతంగా కొనుగోలు చేయడం గమనార్హం. దట్స్ పర్సనల్ డాట్ కామ్ సంస్ధ చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
undefined
ఇండియా అన్‌కవర్డ్ పేరిట లైంగిక ఉత్పత్తులపై విశ్లేషణ చేస్తూ ఈ సంస్థ ఒక అధ్యయన నివేదిక విడుదల చేసింది. కాగా.. ఆ నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
undefined
పురుషులకంటే స్త్రీలే ఎక్కువగా ఈ సెక్స్ టాయ్స్ ని కొనుగోలు చేయడం గమనార్హం.దేశవ్యాప్తంగా తొమ్మిది చిన్న నగరాల్లో వీటి కోసం మహిళల ఆర్డర్లు 300 శాతం వృద్ధి చెందాయి.
undefined
ఈ నగరాల్లో విజయవాడ ఉండటమే కాకుండా అగ్రస్థానంలో నిలిచింది. వయసుల వారీగా చూస్తే 25-34 ఏళ్ల వయసు విభాగంలో 61 శాతం మంది మళ్లీ మళ్లీ ఉత్పత్తుల కోసం ఆర్డర్లు చేస్తున్నారు.
undefined
దేశవ్యాప్తంగా అత్యధికంగా సెక్స్‌టాయ్స్ కొంటున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా తెలంగాణ ఏడో స్థానంలో ఉంది. తెలంగాణలో పురుషులకన్నా మహిళలే ఎక్కువగా సెక్స్‌టాయ్స్ కొనుగోలు చేస్తున్నా రు. అమ్మకాలపరంగా దేశంలో ఆరోస్థానంలో హైదరాబాద్ ఉంది.
undefined
సాధారణంగా పురుషులు రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకూ సెక్స్‌టాయ్స్ కొనుగోలు చేస్తుంటే, మహిళలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకూ కొంటున్నారు. పురుషులు మేల్ పంప్ కోసం ఎక్కువ ఆర్డర్లు చేస్తుండగా.. మహిళలు మసాజర్ కోసం ఆర్డర్ చేస్తున్నారు.
undefined
ఈ సెక్స్‌టాయ్స్‌ని పెళ్లి కాని, ఒంటరిగా ఉంటున్న వారు, పెళ్లయిన వారు కొంటున్నారు. వాడిన తరువాత ఆనందం పొందామని 86శాతం పెళ్లయిన మగవారు, 89 శాతం మంది మహిళలు చెబుతుంటే.. పెళ్లి కాని అబ్బాయిలు 71 శాతం మాత్రమే సంతృప్తి పొందామంటున్నారు.
undefined
సెక్స్‌టాయ్స్ వాడిన తరువాత పెళ్లయిన జంటలు తాము నెలలో తరచుగా సంభోగంలో పాల్గొనడం పెరిగిందంటున్నారు. వీటిని వాడకముందు 5.1 సార్లు సంభోగంలో పాల్గొంటే ఇవి వాడిన తరువాత 9.4 సార్లు పాల్గొంటున్నారట!
undefined