బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఎవరో తేలిపోయింది? మూడు వారాల ముందే ఫలితం, దిమ్మ తిరిగే ట్విస్ట్!

First Published | Nov 25, 2024, 10:20 AM IST

బిగ్ బాస్ తెలుగు 8 చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో విన్నర్ ఎవరనే చర్చ మొదలైంది. అయితే ఈసారి టైటిల్ కొట్టే కంటెస్టెంట్ ఎవరో క్లారిటీ వచ్చేసింది. మరి ఎవరా లక్కీ ఫెలో.. 
 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలేకి మరో మూడు వారాల సమయం మాత్రమే ఉంది. బిగ్ బాస్ హౌస్లో 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం యష్మి ఎలిమినేటైన సంగతి తెలిసిందే. టాప్ 5 లో ఉంటుంది అనుకున్న యష్మి అనూహ్యంగా ఇంటి బాట పట్టింది. నిఖిల్ వ్యవహారంలో ఆమె ఇమేజ్ డ్యామేజ్ అయినట్లు ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా అర్థం అవుతుంది. అసలు పృథ్వి కంటే యష్మి కి తక్కువ ఓట్లు వచ్చాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. 

ఏది ఏమైనా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ బిగ్ బాస్ ఇంటిని వీడింది. కాగా షో ముగియడానికి మరో మూడు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో టైటిల్ కొట్టేది ఎవరనే చర్చ మొదలైంది. దీనిపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. కొందరు పోల్స్ నిర్వహిస్తున్నారు. 


Bigg boss telugu 8

ముందు టాప్ 5 కి వెళ్లే కంటెస్టెంట్స్ ని పరిశీలిస్తే.. నిఖిల్, ప్రేరణ ఖచ్చితంగా ఫైనల్ కి వెళతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో నలుగురు మాత్రమే హౌస్లో ఉన్నారు. రోహిణి, అవినాష్, టేస్టీ తేజ, గౌతమ్... సత్తా చాటారు. వీరిలో గౌతమ్ టాప్ 5 కంటెస్టెంట్ అనే వాదన వినిపిస్తోంది.

Bigg boss telugu 8

కాబట్టి నిఖిల్, ప్రేరణ, గౌతమ్ లకు ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ అయ్యింది. మిగిలిన రెండు స్థానాలు ఎవరివి అనే సందిగ్ధం ఉంది. నబీల్, విష్ణుప్రియ, రోహిణి, టేస్టీ తేజాలలో ఇద్దరికి ఛాన్స్ రావచ్చు. విష్ణుప్రియ గేమ్ పరంగా వెనుకబడ్డప్పటికీ ఆమెకున్న ఫేమ్ రీత్యా ఫైనల్ కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. విష్ణుప్రియ సైతం టాప్ 5 లో ఉంటుందని అంచనా.. వెళ్లకపోయినా ఆశ్చర్యం లేదు. 
 

Bigg boss telugu 8

అవినాష్ ఒక వారం ఎలిమినేషన్ నుండి అవిక్షన్ షీల్డ్ కారణంగా తప్పుకున్నాడు. దాన్ని బట్టి అవినాష్ కి ప్రేక్షకులు పెద్దగా ఓట్లు వేయడం లేదని అర్థం అవుతుంది. ఈ క్రమంలో అవినాష్ ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ లేదు. 13వ వారం అతడు నామినేషన్స్ లో ఉన్నాడని తెలుస్తుంది. ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పృథ్వికి టాప్ 5 లో ఛాన్స్ ఉంటుందా లేదా అనేది అనుమానమే. నబీల్ టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉంది. నిఖిల్, ప్రేరణ, గౌతమ్, విష్ణుప్రియ, నబీల్ టాప్ 5 కంటెస్టెంట్స్ కావచ్చు. 

Bigg boss telugu 8

ఇక టైటిల్ విషయానికి వస్తే.. ప్రముఖంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి నిఖిల్ మరొకటి గౌతమ్. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్. వారిద్దరిలో ఒకరు విన్నర్ అనే ఒక వాదన మొదలైంది. అయితే గౌతమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. అతడికి టైటిల్ ఎలా ఇస్తారని కొందరు తప్పుబడుతున్నారు చివరికి ఎక్స్ కంటెస్టెంట్ అభయ్ నవీన్ ఇదే అభిప్రాయం వెల్లడించాడు. ఆల్రెడీ గేమ్ చూసి వచ్చిన కంటెస్టెంట్ కి టైటిల్ ఇవ్వడం సరికాదని వీడియో విడుదల చేశాడు. 

అలాంటప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎందుకు? గేమ్ ఆధారంగా టైటిల్ ఇవ్వాలని అభయ్ నవీన్ ని ఓ వర్గం ఖండిస్తోంది. గతంలో ఎన్నడూ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు టైటిల్ కొట్టింది లేదు. సీజన్ 7లో అర్జున్ అంబటి వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి వచ్చాడు. అతడు తన గేమ్ తో సత్తా చాటాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే రీజన్ తో టైటిల్ రేసులో లేకుండా పోయాడు. ఇవన్నీ గమనిస్తే.. ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అని తేలిపోయింది. అతడికి పోటీ ఇచ్చే మరో కంటెస్టెంట్ లేరు.. 

Latest Videos

click me!