Ashok Galla, Devaki Nandana Vasudeva
మహేశ్‌బాబు (Mahesh Babu) మేనల్లుడు, గల్లా జయదేవ్ తనయుడు అశోక్ (Ashok Galla) ‘హీరో’ చిత్రంతో పరిచయమయ్యిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. తన నటనతో మాత్రం ఫర్వాలేదనిపించారు. రెండో సినిమా కోసం పెద్ద హీరోలు చేయదగ్గ కమర్షియల్ కథని ఎంచుకున్నారు.
‘దేవకీ నందన వాసుదేవ’ (devaki nandana vasudeva)గా వచ్చిన ఈ చిత్రానికి ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కథ అందించడం, అది కూడా పురాణాలతో ముడిపడిన కథ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అర్జున్ జంధ్యాల (Arjun Jandyala) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో ఈ సినిమాపై ఎంత పెట్టారు..ఎంత నష్టపోయే అవకాసం ఉందనే విషయం ట్రేడ్ లో చర్చ మొదలైంది. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి...
Ashok Galla, Devaki Nandana Vasudeva
సినిమాకు మినిమం ఎక్సపెక్టేషన్స్ క్రియేట్ చేయలేక ఓపినింగ్స్ కూడా రాబట్టలేని సిట్యువేషన్ లో సినిమా రిలీజంది. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో 40 లక్షలు రాబట్టడం కష్టమైపోయింది. ఆదివారం చాలా చోట్ల షోలు పడలేదు. జనాలు లేక షోలు కాన్సిల్ చేసారు. మేజర్ డిజాస్టర్ గా ఈ సినిమాని చెప్తోంది ట్రేడ్.
Ashok Galla, Devaki Nandana Vasudeva
బడ్జెట్ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చు పెట్టారని వినికిడి. 14 కోట్లు దాకా ఈ సినిమాపై పెట్టారని, జీరో షేర్ రావటంతో మొత్తం పోయినట్లే అంటున్నారు. ఇప్పుడీ సినిమాని ఓటిటి, శాటిలైట్ ఎగ్రిమెంట్స్ కూడా చేయటం కష్టమని చెప్తున్నారు.
వీక్ కంటెంట్ , హీరో స్దాయికి తగ్గ కథ కాకపోవటం ముంచేసాయని చెప్తున్నారు. దానికి తగినట్లు గల్లా అశోక్ నటన నేర్చుకుని వచ్చి సినిమాలు చేస్తే బాగుంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పుడున్న సమయంలో ఇలాంటి అర్దంపర్దం లేని కథలను తెరపై చూడటానికి ఇష్టపడటం లేదని, స్ట్రాంగ్ కంటెంట్ లేనప్పుడు ప్రేక్షకులు డబ్బుతో పాటు టైమ్ ని వెచ్చించటానికి ఆసక్తి చూపటం లేదని చెప్తున్నారు.
Ashok Galla, Devaki Nandana Vasudeva
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు దేవకీ నందన వాసుదేవ’ చిత్రానికి రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. గల్లా అశోక్ మొదటి సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు.
ఈ సినిమాకి జరిగిన బిజినెస్ అంతా ప్రశాంత్ వర్మ బ్రాండ్ పై జరిగిందే. కాబట్టి సినిమాకి స్ట్రాంగ్ పాజిటివ్ టాక్ వస్తే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లేదు. అయితే ప్రశాంత్ వర్మ బ్రాండ్ కూడా వర్కవుట్ కాలేదు. ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఓపినింగ్స్ కూడా రాలేదు.
Ashok Galla, Devaki Nandana Vasudeva, Review
అశోక్ గల్లా నెక్ట్స్ ప్రాజెక్టు సితార ఎంటర్ట్నైమెంట్స్ బ్యానర్ లో చేస్తున్నారు. ఇది అశోక్ కెరీర్ కు క్రిటికల్ టెస్ట్ లాంటిదని అంటున్నారు. ఆ సినిమా వర్కవుట్ అయితేనే ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళటానికి వీలుంటుంది.
రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అశోక్ గల్లాతో పాటు ‘మ్యాడ్’ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ, ‘కోట బొమ్మాళి పి.ఎస్’ ఫేమ్ రాహుల్ విజయ్, శివాత్మిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అమెరికా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు ఉద్భవ్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ నెలాఖరు నుంచి చిత్ర టీమ్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది.