‘కాంతారా: చాప్టర్‌ 1’ బస్సు ప్రమాదం.. షాక్ లో టీం!

First Published | Nov 25, 2024, 8:51 AM IST

కాంతార చాప్టర్ 1 షూటింగ్ జరుగుతుండగా జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన చిత్ర బృందాన్ని షాక్‌కు గురిచేసింది.


 ‘కాంతార’ ప్యాన్ ఇండియా సినిమాగా దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రిషబ్ శెట్టి వాళ్ల గ్రామంలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించాడు. అంతేకాదు ఆ పాత్రలో లీనమై నటించాడు.

ఆఖరి అరగంట మనల్ని ఆధ్యాత్మిక లోకంలో విహరింప జేసాడు. అంతేకాదు ఈ సినిమాలోని నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు సాధించారు. హెంబళే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ సినిమాకు పలు అవార్డులు కూడా వరించాయి.  ప్రస్తుతం   కాంతారా చాప్టర్ 1ను తెరకెక్కిస్తున్నాడు రిషబ్ శెట్టి. అయితే అనుకోని విధంగా ఈ చిత్రం ఆర్టిస్ట్ లు ప్రయాణిస్తున్న బస్సుకు యాక్సిడెంట్ అయ్యింది.
 


గత కొద్ది రోజులుగా కాంతారా చాప్టర్ 1 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.   కాంతార చాప్టర్ 1లో నటిస్తున్న ఆర్టిస్టుల బస్సు ప్రమాదానికి గురైంది. షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తున్న మినీ బస్సు బోల్తా పడింది. కర్ణాటక కొల్లూరు సమీపంలోని జడ్కల్ సమీపంలో బోల్తా పడిన బస్సులో ఇరవై  మంది ఉన్నారు.

వీరిలో 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంపార్టెంట్ షూట్ ఉన్న సమయంలో ఇలా జరగటం టీమ్ ని షాక్ కు గురి చేసింది. హెల్త్ అప్డేట్ రావాల్సి ఉంది. వాళ్లు స్పీడుగా రికవరీ అవ్వాలని టీమ్ కోరుకుంటోంది.
 


Kantara Movie


‘హోంబాలే ఫిలింస్’ ద్వారా విజయ్ కిరగందురు నిర్మిస్తున్న చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’. రిషబ్ శెట్టి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ‘కాంతార’కి ప్రీక్వెల్‌గా ‘కాంతారా: చాప్టర్‌ 1’ చిత్రం రాబోతోంది. . రీసెంట్ గానే రిషబ్ శెట్టి ‘కాంతారా: చాప్టర్ 1’ సినిమా విడుదల తేదీ గురించి సమాచారాన్ని పంచుకున్నారు.

ఈ చిత్రాన్ని 2025 అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ‘కాంతార’ సినిమాకు గాను రిషబ్ శెట్టి ఆ చిత్రంలో నటనకు జాతీయ అవార్డును గెలుచుకున్నాడు అలాగే  పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో ఇప్పుడు కాంతార ప్రీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Kantara director hero Rishab Shetty


తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ‘కాంతార’ సినిమా అద్భుతమైన డివోషనల్ విజయం సాధించింది. అతి చిన్న సినిమాగా 15 కోట్లతో వచ్చిన ‘కాంతార’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.400 కోట్లను వసూళ్లు చేసింది. అంతేకాదు నిర్మాతకు భారీగా లాభాలను తీసుకొచ్చి పెట్టింది. తాజాగా కాంతార మూవీకి ముందు ఏం జరిగిందనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టి.  కాంతార లో చూపించిన కథకు ముందు జరిగే కథతో కాంతార : చాప్టర్‌ 1 టైటిల్‌తో ఆడియన్స్ ముందుకు ఈ మూవీ రాబోతుంది.


పీరియాడికల్ మూవీగా రూపొందుతోన్న ఈ ప్రీక్వెల్ కు సంబంధించిన విశేషాలు సినిమాపై మరింత హైప్ పెంచుతున్నాయి. ‘కాంతారా’ ద్వారా కొంకణ్ జానపద జీవితాల్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ సినిమా ప్రీక్వెల్ కోసం గత కాలపు గుర్తుల్ని వెండి తెరపై ఆవిష్కరించనున్నారు.

దక్షిణ భారత చరిత్రలో స్వర్ణ యుగంగా పేరొందిన కదంబ రాజ్య నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందట. మూడో శతాబ్దపు కాదంబ రాజ్య వైభవం, ఆనాటి ఆనవాళ్లు ప్రతిబింబించేలా కర్ణాటకలోని కుండా పుర అనే ప్రాంతంలో ఈ సినిమా సెట్ ను రూపొందించారు. ప్రాచీన యుద్ధ కళ కలరియుపట్టులో రిషబ్ శెట్టి శిక్షణ పొందారు.

Latest Videos

click me!