చిరంజీవికి విజయశాంతి తక్కువేం కాదు, అయినా అన్యాయం చేశారు.. మెగాస్టార్ సినిమాలోనే అలా జరగడంతో..

First Published | Nov 25, 2024, 9:45 AM IST

మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి లది సూపర్ హిట్ పెయిర్. యముడికి మొగుడు, గ్యాంగ్ లీడర్, స్వయంకృషి, కొండవీటి దొంగ లాంటి అద్భుతమైన చిత్రాల్లో ఇద్దరూ నటించారు. ఆ తర్వాత రాజకీయంగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. 

మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి లది సూపర్ హిట్ పెయిర్. యముడికి మొగుడు, గ్యాంగ్ లీడర్, స్వయంకృషి, కొండవీటి దొంగ లాంటి అద్భుతమైన చిత్రాల్లో ఇద్దరూ నటించారు. ఆ తర్వాత రాజకీయంగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. కానీ సినిమాల్లో మాత్రం పర్ఫెక్ట్ జోడి, అదే విధంగా స్నేహితులు కూడా. దాదాపుగా ప్రతి చిత్రంలో విజయశాంతి చిరంజీవికి పోటీగా నటించేవారు. 

గ్యాంగ్ లీడర్ లో అయితే పెర్ఫెమెన్స్ తోపాటు డ్యాన్స్ కూడా విజయశాంతి రెచ్చిపోయి చేసింది. అందుకే ఆ మూవీ చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.  విశ్వనాధ్ దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి నటించిన చిత్రం స్వయం కృషి. 


ఈ చిత్రంలో చెప్పులు కుట్టే వ్యక్తిగా చిరంజీవి నటన నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. చిరంజీవి కెరీర్ లో క్లాసిక్ మూవీగా స్వయంకృషి నిలిచింది. చిరంజీవి భార్యగా విజయశాంతి కూడా అమాయకత్వం ప్రదర్శిస్తూ మెప్పించింది. ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడే తనతో పాటు విజయశాంతికి కూడా నంది అవార్డు వస్తుంది అని చిరంజీవి అంచనా వేశారు. 

కానీ చివరికి చిరంజీవికి మాత్రమే నంది అవార్డు వచ్చింది. చిత్ర యూనిట్ మొత్తం చిరంజీవికి అభినందనలు తెలపడానికి ఆయన ఇంటికి వెళ్లారట. చిరు వెంటనే విజయశాంతికి అవార్డు రాలేదా అని అడిగారు. చిత్ర యూనిట్ ఆమెకి రాలేదు అని చెప్పేసరికి చిరు చాలా బాధపడ్డారట. 

వందశాతం విజయశాంతికి కూడా అవార్డు వస్తుంది అని అప్పటి వరకు చిరు నమ్మకంతో ఉన్నారు. ఈ మూవీలో 'అట్టా సూడమకయ్యా' అంటూ విజయశాంతి చెప్పే డైలాగులు చిరంజీవికి తెగ నచ్చాయి అట. కానీ బ్యాడ్ లక్ ఆమెకి అవార్డు రాలేదు. 

Latest Videos

click me!