పెళ్లి అనగానే ఎవరైనా ఏవేవో ఊహించుకుంటారు. ఓ వైపు పెళ్లి అనగానే ఆనందం కలిగినా... మరో వైపు కొంత భయం కూడా ఉంటుంది. అప్పటి వరకు పరిచయం లేని వ్యక్తి కుటుంబంతో కలిసి జీవించాల్సి వస్తుంది. వాళ్లు ఎలా ఉంటారు..? తమను ఎలా చూసుకుంటారు అని అమ్మాయిలు భయపడితే... తమ జీవితంలోకి వచ్చే అమ్మాయి.. తమను అర్థం చేసుకుంటుందా లేదా అని పురుషులు భయపడుతూ ఉంటారు. ఇవి పక్కన పెడితే... పెళ్లైన కొత్తలో దంపతుల్లో వచ్చే కామన్ సమస్యలు ఏంటో ఓసారి చూద్దాం..
కేవలం పెద్దలు కుదర్చిన వివాహంలో మాత్రమే కాదు... లవ్ మ్యారేజ్ చేసుకున్న వారిలోనూ సమస్యలు రావడం సహజం అని అర్థం చేసుకోవాలి. పెళ్లికి ముందు వారితో మీకు పరిచయం ఉన్నా, ఎక్కువ సేపు సమయం గడిపినా.. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి జీవించేటప్పుడు.. మాత్రం అడ్జెస్ట్ చేసుకోవడంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇద్దరి అలవాట్లు ఒకేలా ఉండకపోవచ్చు. ఒకరికి మరొకరు అలవాటు కావడానికి సమయం పడుతుంది.
దాదాపు అందరు దంపతులకు వచ్చే కామన్ సమస్య డబ్బుతోనే ప్రారంభం అవుతుంది. ఎవరికో తప్ప.. చాలా మంది డబ్బు విషయంలో సమస్యలు రావచ్చు. ఈ సమస్య పెళ్లైన మొదటి సంవత్సరంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. డబ్బులు ఖర్చు చేయడంలో, పొదుపు చేయంలో ఇద్దరి అభిప్రాయాలు కుదిరే వరకు కాస్త సమస్యగానే ఉంటుంది.
ఇక ఇంట్లో వంట సామాన్లు, ఇతర వస్తువులు ఎక్కడ ఏమి ఉన్నాయి.. అనే విషయం అలవాటు కావడానికి కూడా కాస్త సమయం పడుతుంది. అప్పటి వరకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.
పెళ్లి అంటే మీ జీవితంలోకి ఒక వ్యక్తి రావడం కాదు.. ఒక కుటుంబం రావడం. కాబట్టి.. మీరు మీ పార్ట్ నర్ తోనే కాదు.. మీ అత్తమామలతోనూ కలిసిపోవాలి. వారికి మీ జీవితంలోకి ప్రవేశించడానికి ఎంత వరకు బౌండరీ గీయాలి అనే విషయంలోనూ కాస్త ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది.
ఇక పెళ్లికి ముందు శృంగారం విషయంలో చాలా అభిప్రాయాలు, ఆశలు ఉండి ఉంటాయి. వాటిని మీ భాగస్వామి చేరుకోలేకపోయినప్పుడు.. మీరు నిరాశకు గురికావచ్చు. లేదా ఇతర సమస్యలు ఏవైనా శృంగారపరంగా ఎదురవ్వచ్చు.
ఒక.. కమ్యూనికేషన్ విధానంలో కూడా సమస్యలు ఎదురౌతాయి. ప్రతి ఒక్కరూ ఒకేలా మాట్లాడరు, ఒకేలా స్పందించకపోవచ్చు. కాబట్టి... కమ్యూనికేషన్ విషయంలో దంపతుల మధ్య అవరోధాలు ఏర్పడతాయి. ఒకరినొకరు ఈ విషయంలో అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది.