సంతానం లేక ఇబ్బంది పడుతున్నారా..? ఈ పండుతో మీ సమస్యకు పరిష్కారం..!

First Published | Jan 15, 2024, 3:13 PM IST

సంవత్సరాల పాటు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా కూడా.. పిల్లలు పుట్టక చాలా మంది దంపతులు ఇబ్బందతులు పడుతున్నారు. ఈ రోరోజుల్లో ఇదొక కామన్ సమస్యగా మారిపోయింది. 

fertility

పూర్వం ఒక్కో ఇంట్లో డజన్ మంది పిల్లలు పెరిగేవారు. ప్రతి దంపతులు తక్కువలో తక్కువగా ఐదారుగురు పిల్లలను కనేవారు. కానీ.. ఇప్పుడు ఒకరిని కనడం కూడా కష్టంగా మారింది.  సంవత్సరాల పాటు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా కూడా.. పిల్లలు పుట్టక చాలా మంది దంపతులు ఇబ్బందతులు పడుతున్నారు. ఈ రోరోజుల్లో ఇదొక కామన్ సమస్యగా మారిపోయింది.  ఈ సంతానలేమి సమస్యకు చాలా రకాల చికత్సలు తీసుకుంటున్నవారు కూడా ఉన్నారు.

fertility

సంతానోత్పత్తి అనేది ఈ రోజుల్లో పురుషులు , మహిళలు ఎదుర్కొంటున్న సాధారణ సమస్య. ఒత్తిడితో కూడిన జీవనశైలి. పేలవమైన ఆహారం ఈ సమస్యలన్నింటికీ దారితీస్తుంది. అంతే కాదు సంతానలేమికి ప్రధాన కారణం శరీరంలో పోషకాలు లేకపోవడమేనని కొందరు నిపుణులు అంటున్నారు.
 

Latest Videos


దానిమ్మ పండులో వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అలా దానిమ్మ పండు తింటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే స్త్రీ, పురుషులిద్దరిలో సంతానోత్పత్తిని పెంచడంలో దానిమ్మ ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.


అలాగే గుండె, చర్మం, పొట్ట, మెదడు, జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ పండు ఉపయోగపడుతుంది. అంతే కాదు, ముఖ్యంగా ఈ పండు తినడం వల్ల స్త్రీ, పురుషులిద్దరిలో సంతానోత్పత్తి పెరుగుతుంది.
 


దానిమ్మలో ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం, పొటాషియం , యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉన్నాయి. కాబట్టి ఈ పండును తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎముకలు దృఢంగా మారుతాయి. ఈ పండు కండరాల నిర్మాణానికి కూడా ఉపయోగపడుతుంది.


అంతే కాదు దానిమ్మపండు తింటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. ఇది స్పెర్మ్ నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. ఈ పండు కామోద్దీపన కూడా. దీన్ని తినడం వల్ల లైంగిక కోరిక పెరుగుతుంది. సంతానోత్పత్తి సమస్యలతో బాధపడేవారు దీన్ని తినాలని నిపుణులు చెబుతున్నారు.
 


హార్మోన్ల సమస్యలతో బాధపడే మహిళలకు దానిమ్మ పండు చాలా మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల PCOS, సంతానోత్పత్తి, జుట్టు రాలడం, మొటిమలు మొదలైన అనేక సమస్యలను నయం చేయవచ్చు.

అధిక రక్తపోటు రోగులకు కూడా దానిమ్మ మంచిది. ఈ పండు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. డయేరియా, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లేదా అల్సరేటివ్ కొలిటిస్ ఉన్నవారు దానిమ్మ తినవచ్చు.
 

దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ విధంగా దానిమ్మ పండును తినడం వల్ల శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్,  ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలను ఎదుర్కోవడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ పండు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఉపయోగపడుతుంది. ఈ పండు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

click me!