ఈరోజుల్లో భాగస్వామిని మోసం చేసేవారు చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఈ మోసం చేసే జాబితాలో పురుషులు ఎంత మంది ఉంటున్నారో... మహిళలు కూడా అంతే ఉంటున్నారు. అయితే... ఒక మహిళ తమ భర్తను మోసం చేస్తోంది అని.. ఆమె కదలికలను బట్టే గుర్తించవచ్చట. అదెలాగో ఓసారి చూద్దాం..
నిజంగా ఓ మహిళ తన భర్తకు కాకుండా మరో పురుషుడితో ఎఫైర్ పెట్టుకుంటే కచ్చితంగా గిల్టీగా ఫీలౌతుందట. తమ భర్తను మోసం చేస్తున్నామని, కుటుంబాన్ని బాధ పెడుతున్నామని వారు ఫీలౌతూ ఉంటారు.
వారు చేసే ప్రతి పనిలోనూ కాన్ఫిడెంట్ గా ఉండలేరు. ఎప్పుడూ.... తాము పెట్టుకున్న ఎఫైర్ బయటపడుతుందా..? అది తమ జీవితాన్ని ఎంత డ్యామేజ్ చేస్తుందా అని ఆలోచిస్తూ ఉంటారు.
తాము ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తి తమతో ఎంతకాలం ఉంటాడో తెలీదు. అతని కోసం కుటుంబాన్ని నాశనం చేసుకుంటుంటే.. ఒకవేళ అతను వదిలేస్తే పరిస్థితి ఏంటి అని భయపడుతూ ఉంటారు.
ఒక మహిళ నిజంగా ఎఫైర్ పెట్టుకుంటే.... ఇంట్లో ఒంటరిగా గడుపుతూ ఉంటుందట. వారి ఫీలింగ్స్ ని ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే భయపడుతూ ఉంటుందట. తాము ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తికి కూడా పెళ్లై ఉంటే.. ఆమె కారణంగా తనకు ఏదైనా సమస్య వస్తుందేమో అని ఆలోచిస్తూ ఉంటారట.
ప్రతి నిమిషం తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారట. ఎలాంటి సమస్య వస్తుందో... వాటి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ ఉంటారు.
Extramarital affair
ఈ మహిళలు... తాము ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తి పై కూడా పూర్తిగా నమ్మకం పెట్టుకోలేరు. వారిని నిత్యం ఏదో ఒక విషయంలో ఇబ్బంది పెడుతూ ఉంటారు.
ఇని ఆలోచనలు, భయాలతో వారి మానసిక ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతింటూ ఉంటుందట. వారిలో అభద్రతా భావం బాగా పెరిగిపోతుందట. యాంక్సైటీ సమస్యలు కూడా వస్తూ ఉంటాయట.