రాజకీయ ఎత్తుగడలు: కుటుంబాల విభజన, అన్ని పార్టీల్లోనూ వారే...

First Published | Jan 13, 2020, 4:27 PM IST

గతంలో రాజకీయాలకు ప్రస్తుత రాజకీయాలకు చాలా తేడా ఉంది. అప్పట్లో రాజకీయ నాయకులు పార్టీలకు తమ విశ్వాసాన్ని ప్రకటించి, గెలుపోటముల్లో తోడుండేవారు. కేవలం నాయకులే కాకుండా వారి కుటుంబాలు కూడా అదే తరహాలో కొనసాగేవారు. బంధుత్వాలకు, బాంధవ్యాలు విలువలనిస్తూ వారు ఆలా కొనసాగేవారు.

కానీ ప్రస్తుతం ఆ ట్రెండ్ మారింది. బంధాలు, బంధుత్వాలకన్నా అధికారం ఎక్కువయిపోయింది. రాజకీయ నాయకులూ తమ మద్దతును విశ్వాసాన్ని పార్టీలకు కాకుండా అధికారానికి ప్రకటిస్తున్నారు. అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోతున్నారు. పార్టీ సిద్ధాంతాలు, విలువలు అనేవి మచ్చుకి కూడా కనబడడం లేదు
undefined
దీనికి కారణం కూడా లేకపోలేదు. గతంలో ఎన్నికల్లో పోటీ చేయడం ఇప్పుడున్నంత ఖరీదైన విషయం కాదు. అప్పట్లో రాజకీయ నాయకులంటే రాజకీయం మాత్రమే చేసేవారు. ఎప్పుడైతే ధనవంతులు, వ్యాపారవేత్తలు ఇలా రాజకీయాల్లోకి ప్రవేశించారో...వారు ఎన్నికలను బాగా ఖరీదైన తతంగంగా మార్చివేశారు. ఇప్పుడొకరకంగా ఎన్నికలనేవి ఖరీదైన జూదంగా మారిపోయాయి.
undefined

Latest Videos


ఎన్నికల్లో పోటీచేయాలంటే.. కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి. పార్టీ అధినాయకులు టిక్కెట్లిచ్చే ముందే ఎంత ఖర్చుపెట్టగలుగుతావని బాహాటంగానే అడుగుతున్నారు. ఇలా ఎప్పుడైతే ఎన్నికల్లో డబ్బు పెట్టి బలమైన పార్టీ నుంచి టికెట్ సంపాదిస్తే గెలవొచ్చని మరింతమందికి అర్థమయ్యిందో...మరింతమంది డబ్బున్నవారు టికెట్ల కోసం పోటీ పాడడం మొదలయింది.
undefined
ఇలా టికెట్ల కోసం పోటీ పెరగడాన్ని పార్టీలు కూడా తమకనుకూలంగా మలుచుకొని... ఒకరకంగా టికెట్ల వేలంపాటను నిర్వహించడం మొదలుపెట్టాయి కొన్ని పార్టీలు. ఎవరెక్కువ రేటుకు కొనుక్కుంటే వారికి టికెట్ కేటాయించడం మొదలుపెట్టారు.
undefined
టికెట్లు కొనుక్కున్న తరువాత వారు ఎన్నికల్లో విపరీతంగా డబ్బు ఖర్చుపెడతారు. పార్టీ నుంచి టికెట్ కొనుక్కొని ఎన్నికల్లో ఓట్లు కొనుక్కొని గెలిచినా తరువాత వారు పార్టీలకు విధేయులుగా ఉండమంటే ఉంటారా? అది జరిగే పనేనా? ఇక్కడే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఒకటుందని మనకు గుర్తుకు రావొచ్చు. ఈ చట్టం పనితీరు మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉందొ మనం చెప్పనవసరం లేదు. ఈ చట్టాలున్నప్పడికి కూడా అవి చేసేదేమి లేదు అన్నట్టు యథేచ్ఛగా, ఇష్టానుసారంగా జంప్ జిలానీలు గోడలు దూకుతూనే ఉన్నారు
undefined
ఇలా గోడలు దూకేటప్పుడు బంధాలు బంధుత్వాలన్నిటినీ కూడా పక్కకు పెడుతున్నారు. ఎన్నికలప్పుడు ఏ పార్టీవైపు గాలి బలంగా వీస్తుందో చూసి ఆ పార్టీలోకి దూరిపోతున్నారు. వర్క్ అవుట్ అయితే ఓకే..లేకుంటే ఘర్ వాపసీ.... మొన్న మహారాష్ట్రలో అజిత్ పవార్ విషయంలో జరిగింది అదే కదా
undefined
ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇలాంటి ఉదాహరణలకు కొదవే లేదు. భార్య భర్తలు వేర్వేరు పార్టీల్లో ఉన్న సందర్భాలు, అన్న దమ్ములు విడిపోవడమే కాకుండా ఒకరిపై ఒకరు పోటీ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా వెంకటస్వామి పెద్ద కొడుకు వినోద్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు అన్న కాంగ్రెస్ లో ఉండగా తమ్ముడు మాత్రం బీజేపీలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఆసక్తికర కుటుంబ కథా రాజకీయ చిత్రాలను నెమరువేసుకుందాం.
undefined
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గనుక తీసుకుంటే... 2014లో అక్కాతమ్ముడు డీకే అరుణ, చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ టికెట్ పైన్నే పోటీ చేసి గెలిచారు. అరుణ గద్వాల్ నుంచి గెలవగా, రామ్మోహన్ రెడ్డి మక్తల్ నుంచి గెలిచాడు. కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవడంతో...తొలిసారి గద్దెనెక్కిన టర్స్లో రామ్మోహన్ రెడ్డి చేరిపోయారు. అరుణ మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగారు.
undefined
2018 ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ నుంచే పోటీ చేసి ఓటమి చెందారు. సోదరుడు రామ్మోహన్ రెడ్డి మాత్రం విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక పార్లమెంటు ఎన్నికల ముందు అరుణ బీజేపీలో చేరారు. ఎంపీ గా పోటీ చేసి ఓటమి చెందారు.
undefined
ఇక ఆంధ్రప్రదేశ్ లో గనుక చూసుకుంటే ఒక జంట మనకు కనబడుతుంది. అదే దగ్గుబాటి వెంకటేశ్వర్రావు, పురంధేశ్వరి. పురంధేశ్వరి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్టీ వైఖరితో విభేదించి 2014 ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు,1984,1985,1989,1994లో పర్చూరు నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ పై అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004లో, 2009లో కాంగ్రెస్ టికెట్ పై ఇక్కడి నుండి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మరో సారి పార్టీ మారిన ఆయన వైసీపీ టికెట్ పైన పోటీచేసి ఓటమి చెందారు. భార్య పురంధేశ్వరి బీజేపీ టికెట్ పై విశాఖ పార్లమెంటుకు పోటీ చేయగా... దగ్గుబాటి వెంకటేశ్వర్రావు అసెంబ్లీకి వైసీపీ నుంచి పోటీ చేసారు.
undefined
ఇక తెలంగాణాలో మరో మామ అల్లుడి పోరు మనకు ఎర్రబెల్లి దయాకర్ రావు, మదన్ మోహన్ రావుల మధ్య మనకు కనబడుతుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండగా మామ ఎర్రబెల్లి మాత్రం తెరాస లో కొనసాగుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు కూతురిని మదన్ మోహన్ పెళ్లి చేసుకున్నారు
undefined
ఇక తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో కూడా మనకు ఇలాంటి ఒక వింతే కనబడుతుంది. ఒక తండ్రి కొడుకుల జంట. తండ్రి డి శ్రీనివాస్ తెరాస నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతుంటే... కొడుకు అరవింద్ నిజామాబాదు నుంచి లోక్ సభకు ఎంపీగా ఎన్నికయ్యాడు.
undefined
ఇక ఇదే ఉత్తర తెలంగాణ ప్రాంతానికే చెందిన మరో కుటుంబంలో కూడా మనం ఇలాంటి ఒక పోరుని చూడవచ్చు. చెన్నమనేని రాజేశ్వర్ రావు సిపిఐ లో కొనసాగగా...ఆయన తమ్ముడు విద్యాసాగర్ రావు మాత్రం బీజేపీ నుంచి ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేసారు. ఇద్దరు ఒకేసారి ఎమ్మెల్యేలుగా కూడా కొనసాగారు. తండ్రి రాజేశ్వర్ రావు లా కాకుండా, అతని తనయుడు చెన్నమనేని రమేష్ టీడీపీ నుంచి తెరాస లో చేరి ఆ పార్టీనుంచి గెలిచారు.
undefined
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ లో కొనసాగే వారు. ఆయన రెండుసార్లు తెనాలి నియోజికవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన జనసేనలో కొనసాగుతుండగా...ఆయన తండ్రి, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు బీజేపీలో చేరారు.
undefined
ఇక మరో ఆసక్తికరమైన కుటుంబ పోరు మనకు విశాఖ మన్యం ప్రాంతంలో కనబడుతుంది. అక్కడ కిశోర్ చంద్రదేవ్, కుమార్తె శృతి దేవిలా మధ్య పోరు ఆసక్తిగా నడిచింది. కిషోర్ చంద్రదేవ్ ఇంతకుముందు కాంగ్రెస్ నుంచి ఎంపీ గా గెలిచి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసారు. ఆయన 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా ఆయన కూతురు శృతిదేవి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు. కానీ ఇద్దరు కూడా ఓటమి చెందారు.
undefined
అందరి గురించి చెప్పి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురించి ప్రస్తావించక ముగించడం భావ్యం కాదు. ఆయన విభజన కు నిరసనగా కాంగ్రెస్ ను వీడి జైసమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. ఆ తరువాత కొద్దీ కలం కింద ఆయన తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. తమ్ముడు కిశోరె కుమార్ మాత్రం ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆయన టీడీపీ టికెట్ పైన పీలేరు నుంచి పోటీచేసి ఓటమి చెందారు
undefined
click me!