నయనతార vs ధనుష్: పోస్టర్ తో “యుద్ధం ప్రకటించింది”?

First Published | Nov 19, 2024, 11:23 AM IST

నయనతార తన కొత్త సినిమా 'రక్కయీ' పోస్టర్‌ను విడుదల చేసింది, దీనిలో ఆమె చేతిలో కొడవలితో కనిపిస్తుంది. ధనుష్ తన సినిమా ఫుటేజీని ఉపయోగించినందుకు నయనతారపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

Nayanthara,RAKKAYIE, Dhanush, Netflix


 
నయనతార సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటుంది. అయితే అనుకోని విధంగా రెండు రోజుల క్రితం ధనుష్ పై ఆమె విరుచుకు పడ్డారు. అందుకు కారణం ... నయనతారను హెచ్చరిస్తూ ధనుష్‌  లాయర్‌  నోటీసులు పంపటమే .నయనతారపై తెరకెక్కించిన డాక్యుమెంటరీలో తమ సినిమాకు సంబంధించిన ఫుటేజీని తొలగించాలని ఆయన కోరారు.

ఈమేరకు ఇప్పటికే నోటీసులు కూడా పంపడం జరిగిందని ఆయన గుర్తుచేశారు. 24 గంటల్లో ఆ ఫుటేజీని తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని ధనుష్‌ లాయర్‌  హెచ్చరిస్తూ నయన్‌కు నోటీసులు పంపారు. ఈ విషయమై ఆమె ఆల్రెడీ సోషల్ మీడియా వేదిక ద్వారా ధనుష్ పై ఫైర్ అయ్యారు. 

Rakkayie Nayantara film title teaser out


నయనతార డాక్యుమెంటరీ కోసం ధనుష్‌ నిర్మాతగా వ్యవహరించిన 'నేనూ రౌడీనే' సినిమా నుంచి మూడు సెకండ్ల వీడియోను ఆమె ఉపయోగించుకుంది. దీంతో ధనుష్‌ కాపీరైట్‌ చట్టం కింద నయన్‌పై రూ. 10 కోట్లు నష్టపరిహారం కేసు వేశారు. అయితే, తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ఆ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్‌ అవుతుండంతో అందులో ఈ సినిమా నుంచి తీసుకున్న ఫుటేజీ కూడా ఉంది.

దీంతో ధనుష్‌ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఆమెతో పాటు నెట్‌ఫ్లిక్స్‌కు హెచ్చరికతో ధనుష్‌ అడ్వకేట్‌ నోటీసు జారీ చేశారు. ఈ విషయమై నయనతార అఫీషియల్ గా ఏమీ స్పందించలేదు కానీ తాజాగా ఆమె విడుదల చేసిన పోస్టర్ తో తన కోపాన్ని ప్రదర్శించింది అంటున్నారు. 



వరుస సినిమాలతో అలరిస్తోన్న నయనతార (nayanthara) పుట్టినరోజు నాడు అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ‘రక్కయీ’ (RAKKAYIE) అనే కొత్త సినిమాను ప్రకటించారు. సెంథిల్‌ దర్శకత్వంలో ఈ చిత్రం ఐదు భాషల్లో తెరకెక్కనుంది.

ఈ వివరాలు తెలుపుతూ టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు. డ్రమ్ స్టిక్స్‌ ప్రోడక్షన్‌, మూవీ వర్స్‌ఇండియా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో నయనతార కూతరు కోసం యుద్ధం చేసే శక్తిమంతమైన తల్లిపాత్రలో కనిపించనున్నారు. 


ఈ సినిమా పోస్టర్ లో నయనతార చేతిలో కొడవలి పట్టుకొని “యుద్ధం ప్రకటించింది” అంటూ చూపించారు. దాంతో, ఆమె ధనుష్ ని టార్గెట్ చేస్తూ ఈ పోస్టర్ ని విడుదల చేసినట్లు భావిస్తున్నారు.

ఈ విషయమై సోషల్ మీడియాలో ధనుష్ అభిమానులకు, నయనతార అభిమానులకు మధ్య పెద్ద యుద్దమే జరుగుతోంది. నయనతార ను ధనుష్ ప్యాన్స్ విమర్శిస్తున్నారు. మరో ప్రక్కన ధనుష్ ఇలాంటివాడే అంటూ నయనతారను సపోర్ట్ చేస్తున్నారు.


ఇదిలా ఉండగా ధనుష్‌ లాయర్‌ తాజాగా నయన్‌ అడ్వకేట్‌కు ఒక లేఖ  ఇలా రాశారు 'నా క్లయింట్‌కు హక్కులు కలిగి ఉన్న సినిమాలోని వీడియోను నయనతార డాక్యుమెంటరీలో ఉపయోగించారు. ధనుష్‌ అనుమతి లేకుండా అలా చేయడం చట్టరిత్యా నేరం. 24 గంటల్లో దానిని తొలగించాలి.

ఈ విషయంలో మీ క్లయింట్‌కు (నయనతార) సలహా ఇవ్వండి. లేని పక్షంలో మీ క్లయింట్‌కు వ్యతిరేకంగా నా క్లయింట్  చట్టపరమైన తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.   రూ. 10 కోట్ల నష్టపరిహారం విషయంలో నయనతారతో పాటు నెట్‌ఫ్లిక్స్ ఇండియా కూడా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది.' అని ప్రకటన ముగించారు. దీంతో నయనతారకు పుట్టినరోజు కానుకను ధనుష్‌ ఇలా ప్లాన్‌ చేశాడా అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Latest Videos

click me!