బెల్లం తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Nov 19, 2024, 11:39 AM IST

శుద్ధి చేసిన చక్కెర కంటె బెల్లమే మన ఆరోగ్యానికి చాలా మంచిది. నిజానికి బెల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మనల్ని ఎన్నో జబ్బుల నుంచి రక్షిస్తాయి. మరి రోజూ బెల్లాన్ని తింటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

jaggery

చాలా మంది ప్రతిరోజూ చక్కెరను ఎన్నో విధాలుగా వాడుతుంటారు. కానీ చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదు. దీనిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని తింటే బరువు పెరగడంతో పాటుగా మధుమేహం వంటి ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అసలు బెల్లాన్ని మనం తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

jaggery

బెల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

పోషకాలు సమృద్ధిగా ఉంటాయి

శుద్ధి చేసే ప్రక్రియలో చక్కెరలోని పోషకాలన్నీ పోతాయి. కానీ బెల్లంలో  మాత్రం పోషకాలు మెండుగా ఉంటాయి. బెల్లంలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం,  ఫాస్పరస్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే నరాల, కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచి శారీరక విధులు సక్రమంగా జరగడానికి సహాయపడతాయి. 

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు, సెలీనియం, జింక్  వంటి ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నష్టం నుంచి కాపాడుతాయి. అలాగే అంటువ్యాధులు వచ్చే ప్రమాదం నుంచి కాపాడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ కొంచెం బెల్లం తినడం వల్ల మన  ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో దగ్గు, జలుబు, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. 
 


జీర్ణక్రియకు సహాయపడుతుంది

బెల్లంలో జీర్ణక్రియకు మేలు చేసే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. బెల్లాన్ని తింటే జీర్ణ ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి. అలాగే జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగుతుంది. తిన్న తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తింటే జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. బెల్లం మన శరీరంలోని విష పదార్థాలను బయలకు పంపడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
 

రక్తాన్ని శుద్ధి చేస్తుంది

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బెల్లంలో రక్తాన్ని శుద్ధి చేసే సామర్థ్యం కూడా ఉంటుంది. బెల్లాన్ని ప్రతిరోజూ కొంచెం తినడం వల్ల రక్తం శుభ్రపడుతుంది. అలాగే రక్తానికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోతాయి. 
ఇది రక్త నాణ్యతను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. రక్తం శుభ్రంగా ఉంటే మొత్తం ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే ఇది అన్ని అవయవాలు స్వచ్ఛమైన, ఆక్సిజనేటెడ్ రక్తాన్ని అందిస్తుంది. 

నెలసరి నొప్పి నుంచి ఉపశమనం 

పీరియడ్స్ నొప్పి కొందరికి భరించలేని విధంగా వస్తుంది. ఈ నొప్పిని తగ్గించడానికి బెల్లం చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది పీరియడ్స్ టైంలో వచ్చే పొత్తి కడుపు నొప్పిని, తిమ్మిరిని తగ్గించడానికి సహాయపడుతుంది. బెల్లం హిమోగ్లోబిన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. బెల్లాన్ని తింటే ఎండార్ఫిన్లు బాగా విడుదల అవుతాయి. ఇది కండరాలను సడలించి నొప్పిని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఎనర్జీ బూస్టర్

బెల్లం ఒక సంక్లిష్ట కార్బోహైడ్రేట్. అంటే ఇది చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఇది చక్కెరలా కాకుండా.. మన శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారికి, క్రీడాకారులకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 

jaggery

రక్తపోటును నియంత్రిస్తుంది

బెల్లంలో పొటాషియం, సోడియంలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరంలో యాసిడ్ లెవల్స్ ను మెయింటైన్ చేస్తాయి. అలాగే బీపీని రెగ్యులేట్ చేయడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెల్లాన్ని తింటే శరీరంలో నీటి నిలుపుదల ఉండదు. అలాగే కడుపు ఉబ్బరం కూడా చాలా వరకు తగ్గుతుంది. బెల్లం హైబీపీ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. బెల్లాన్ని తింటే ఎలక్ట్రోలైట్లు సమతుల్యంగా ఉంటాయి. 

Latest Videos

click me!