వెల్లుల్లిలో సిస్టైన్ అనే అమైనో ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది మన జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే వెల్లుల్లిని తింటే జుట్టు బాగా పొడుగ్గా పెరుగుతుంది. అలాగే జుట్టు హెల్తీగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మసాలా దినుసులో ఉండే లక్షణాలు జుట్టు రాలిపోకుండా, తెగిపోకుండా ఉంచడానికి సహాయపడుతుంది.
వెల్లుల్లిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి బాగా సహాయపడతాయి. వెల్లుల్లిని తినడం వల్ల మనకు సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వెల్లుల్లి అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా బాగా సహాయపడుతుంది. దీనిలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను పెంచే సామర్థ్యం ఉంటుంది. దీంతో శరీరంలో సులువుగా రక్తం సరఫరా జరుగుతుంది. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. దీనివల్ల గుండె జబ్బులొచ్చే ముప్పు కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.