రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై హోప్స్ చాలా ఉన్నాయి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను దేశ చిత్రపటంపై నిలిపారాయన. బాహుబలి పూర్తిగా కల్పిత గాథ. మానవ సాధ్యం కాని అనేక దృశ్యాలు అందులో ఉన్నాయి. అది రాచ కుటుంబంలోని కుట్రలను కుతంత్రాలను తెరకెక్కించింది. మంచికీ చెడుకు మధ్య ఘర్షణను చూపించారు. మంచీకీ చెడుకూ మధ్య జరిగిన ఘర్షణ కారణంగా మంచి విజయం సాధించడం వల్ల ప్రేక్షకులు సంతృప్తి చెంది ఉంటారు. అదే సమయంలో సెంటిమెంట్స్ దండిగా ఉన్నాయి. సెంటిమెంట్స్ సినిమాకు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
undefined
కాగా, ప్రస్తుతం తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రం ఇద్దరు చారిత్రక పురుషులకు సంబంధించిన కథ. కొమురం భీమ్, అల్లూరి సీతారామారాజు పోరాటాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరువురు ఒకే కాలంలో ఉండి పోరాటం చేస్తే ఎలా ఉంటుందనేది రాజమౌళి చూపించడానికి సిద్ధపడినట్లు అర్థమవుతోంది. కొమురం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామారాజుగా రామ్ చరణ్ నటిస్తుండడం వల్ల కూడా సినిమాపై చాలా అశలు పెట్టుకున్నారు.
undefined
నిజానికి, ఇద్దరు కూడా పరాయి పాలనలో తలెత్తిన గిరిజన సమస్యలపై పోరాటాలు చేశారు. అల్లూరి సీతారామారాజు సినిమా కృష్ణ హీరోగా వచ్చి ఘన విజయం సాధించింది. ఇందులో ప్రేక్షకులను ఉర్రూతలూగించే దేశభక్తి గీతాలున్నాయి. అంతే కాకుండా దేశవ్యాప్తంగా జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా దాన్ని చూపించారు. తల్లి, ప్రేయసి వంటి సెంటిమెంట్లు కూడా ఉన్నాయి. అంటే సినిమా కాన్వాస్ చాలా పెద్దది. సీతారామారాజుకు కొన్ని అతీత శక్తులున్నట్లు ఉన్న ప్రచారాన్ని కూడా తెరకు ఎక్కించారు. ఏక కాలంలో రెండు పోలీసు స్టేషన్లపై సీతారామారాజు దాడి చేయడం అందులో ఒకటి. అల్లూరి సీతారామారాజు బయటి నుంచి గిరిజనుల పక్కన నిలబడి పోరాటం చేశాడు. ఒక రకంగా ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. శ్రీకాకుళం గిరిజనుల పక్కన నిలబడి బ్రిటిష్ పాలకులపై పోరాటం చేశాడు.
undefined
కొమురం భీమ్ విషయానికి తన కోసం, తనవారి కోసం పోరాటం చేశాడు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈయన పోరాటం సాగించాడు. కొమురం భీమ్ పై అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో సినిమా వచ్చింది. కానీ, అల్లూరి సీతారామారాజు సినిమాకు మాదిరిగా దీనికి పెద్ద కాన్వాస్ తీసుకోలేదు. గెరిల్లా పోరాటానికి ఇచ్చిన ప్రాధాన్యం అతని వ్యక్తిగత, కుటుంబ జీవితానికి ఇవ్వలేదు. దానికితోడు, అతను పోరాటం చేయడానికి ఎదిగిన పరిణామ క్రమాన్ని కూడా సరిగా చూపించలేదు
undefined
ఈ రెండు పోరాటాలు ఒకే సమస్యపై జరిగాయి. అల్లూరి సీతారామారాజు పోరాటం తర్వాత కొమురం భీమ్ పోరాటం జరుగుతుంది. పోడు వ్యవసాయం చేసుకోవడం గిరిజనుల సంప్రదాయం. చెట్లను నరికి సాగు చేస్తూ, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిపోతూ ఉంటారు. స్థిర వ్యవసాయం చేసేవారు కారు. అడవి తమ సొంతం అని, దానిపై తమకు హక్కు ఉందని వారు నమ్మతూ వస్తున్నారు.
undefined
అటువంటి స్థితిలోనే బ్రిటిష్ ప్రభుత్వం పోడు వ్యవసాయాన్ని నిషేధిస్తూ బ్రిటిషాంధ్రలో ఓ చట్టాన్ని తెచ్చింది. ఆ చట్టం వల్ల అడవిపై గిరిజనులు తమ హక్కును కోల్పోయే పరిస్థితి వచ్చింది. దానికి వ్యతిరేకంగా సాగిన గిరిజన పోరాటానికి అల్లూరి సీతారామారాజు నాయకత్వం వహించాడు.
undefined
అది సమసిపోయిన తర్వాత అదే సమస్య ఇటు తెలంగాణలోని ఆదిలాబాదు ఆడవుల్లో తలెత్తింది. బ్రిటీషాంధ్రలో అమలు చేసిన చట్టాన్నే ఇక్కడ నిజాం ప్రభుత్వం రూపొందించి అమలు చేయడానికి పూనుకుంది. దీంతో కొమురం భీమ్ సహా గిరిజనులు తమ హక్కును కోల్పోయే పరిస్థితి వచ్చింది. మరోవైపు మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన స్థానికేతరులు గిరిజనుల భూములను అక్రమంగా ఆక్రమించుకోవడం కూడా ఉంది.
undefined
సమస్య ఒక్కటే.. కానీ పోరాటాలు జరిగిన కాలాలు, ప్రాంతాలు వేరు. దీన్ని రాజమౌళి తన సినిమాలో ఎలా చూపిస్తాడనే విషయాన్ని పక్కన పెడితే అప్పటికీ ఇప్పటికీ గిరిజనుల సమస్యలు ఏమైనా మారాయా, వారి జీవితాలు బాగుపడ్డాయా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది.
undefined
ప్రస్తుతం రాజమౌళి..ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ‘RRR’ అనే భారీ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులు కలిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 2020 జూలై 30న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
undefined