ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన అంతర్గత చర్చ టీఆర్ఎస్ లో మరో సారి తెరమీదికి వచ్చింది. ఈ చర్చకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెరలేపారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన చెప్పారు. ఎంపీ మాలోతు కవిత కూడా అదే మాట అన్నారు. అయితే, ఎప్పుడు ఆయన సిఎం పీఠాన్ని అధిష్టిస్తారనేది వారు చెప్పలేదు. (srinivas goud)
undefined
నిజానికి, కేసీఆర్ కేటీఆర్ ను తన వారసుడిగా ఇప్పటికే నిలబెట్టారు. శాసనసభ ఎన్నికల్లో సీనియర్లను పక్కన పెట్టి కేటీఆర్ అనుకూలమైనవారికి టికెట్లు ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి వర్గ ఏర్పాటులో కూడా కేటీఆర్ కు అనుకూలంగా ఉండేవారికే చోటు కల్పించారు.
undefined
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తూ కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించారు. హరీష్ రావును మంత్రివర్గంలోకి తీసుకోలేదు. హరీష్ రావును పక్కన పెట్టాలనే ఉద్దేశంతోనే కేటీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదు. కానీ పార్టీపై పూర్తి అధికారం ఇచ్చారు. ఈటెల రాజేందర్ ను కూడా మంత్రి పదవికి దూరం చేద్దామని భావించారు. కానీ, అనివార్యమైన పరిస్థితిలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది. (harsih rao, ktr)
undefined
శాసనసభ ఎన్నికల తర్వాత హరీష్ రావు పాత్రను కుదిస్తూ వచ్చారు. ఈ స్థితిలో రాజకీయాల పట్ల హరీష్ వైరాగ్యం ప్రదర్శించారు కూడా. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలు దాటి ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో హరీష్ రావు తన సిద్ధిపేట నియోజకవర్గానికే పరిమితం కావాల్సి వచ్చింది.(harish rao)
undefined
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంగుల కమలాకర్ కు మంత్రి పదవి ఇచ్చి ఈటెల రాజేందర్ కు సెగ పెట్టారు. ఈటెల రాజేందర్ ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ వచ్చారు. ఇప్పటికీ ఈటెల రాజేందర్ అసంతృప్తిగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు.
undefined
ఇదంతా కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలనే వ్యూహంలో భాగంగానే కేసీఆర్ చేశారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి తాను జాతీయ రాజకీయాలకు వెళ్లాలని కేసీఆర్ అనుకున్నారు. ఇందులో భాగంగా ఆయన ఫెడరల్ ఫ్రంట్ ను ముందుకు తెచ్చారు. లోకసభ ఎన్నికల్లో బిజెపికి తగిన మెజారిటీ రాదని, ఇతర పార్టీల మద్దతు అవసరం పడుతుందని ఆయన అంచనా వేశారు. (KCR)
undefined
అదే సమయంలో తెలంగాణలోని 17 లోకసభ స్థానాల్లో 16 గెలుచుకుంటామని కేసీఆర్ అంచనా వేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ నాయకత్వంలోని వైసీపీ అత్యధిక లోకసభ స్థానాలను గెలుచుకుంటుందని భావించారు. దాంతో జగన్ తో దోస్తీ కట్టారు. జగన్ తో పాటు నవీన్ పట్నాయక్ వంటి వాళ్లను తీసుకుని బిజెపికి మద్దతు ఇవ్వాలని ప్లాన్ వేశారు.
undefined
అయితే, కేసీఆర్ ప్లాన్ రెండు విధాలుగా బెడిసికొట్టింది. ఒకటి.. బిజెపికి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చింది. రెండోది... తెలంగాణలో బిజెపి 4, కాంగ్రెసు 3 స్థానాలు గెలుచుకున్నాయి. దానికితోడు తనకు అత్యంత సన్నిహితుడైన వినోద్ కుమార్, తన కూతురు కల్వకుంట్ల కవిత ఓడిపోయారు. దాంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల వ్యూహంపై దెబ్బ పడింది.
undefined
వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ పాలనాపరమైన కార్యక్రమాలకు దూరమవుతూ వచ్చారు. దాంతో కేసీఆర్ ప్రభుత్వంలో తనకు ధీటుగా పనిచేసేవారు లేకుండా పోయారు. దాంతో కేటీఆర్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన ఒత్తిడిలో పడ్డారు. కేటీఆర్ ను మంత్రివర్గంలోకి తీసుకుని హరీష్ రావును పక్కన పెడితే ఏర్పడే ముప్పు కేసీఆర్ కు తెలుసు. దాంతో హరీష్ రావును కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నారు
undefined
ఇకపోతే ఉమ్మడి కరీనంగర్ జిల్లా నుంచి ఇప్పటికే ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ మంత్రివర్గంలో ఉన్నారు. ఆగష్టు 6న జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో ఇదే జిల్లా నుంచి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీమంత్రి కేటీఆర్ కు మరోసారి ఛాన్స్ ఇవ్వనున్నారు కేసీఆర్.
undefined