తెలుగు రాష్ట్రాల్లో ఈ వారంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండగా, గురువారం మరో అల్పపీడనం ఏర్పడి శుక్రవారానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఈ వారమంతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, పిడుగులు, ఈదురుగాలులు ఉంటాయని తెలిపింది.
తెలంగాణలో సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు ఉంటాయని APSDMA ప్రకటించింది. గురువారం నుంచి శనివారం వరకు తీరప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు.