Today Top 5 News : ఈ రోజు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన వార్తలు

Published : Sep 23, 2025, 05:49 PM IST

Today Top 5 News : మీరు ఇవాళ్టి టాప్ న్యూస్ ఒకేచోట తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీకోసమే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, నేషనల్ , ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ లో టాప్ 5 వార్తలు ఇక్కడ అందిస్తున్నాం.

PREV
15
Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వచ్చే 24 గంటల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ 25న మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడనుందని పేర్కొంది. దీంతో ఈ వారమంతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం విపత్తు నివారణ చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు.

25
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త వ్యూహం

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా మెడికల్ కాలేజీలపై పీపీపీ విధానంలో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తన హయాంలో 16 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చినట్లు, వాటిలో కొన్నింటిని పూర్తిచేశామని జగన్ గుర్తుచేశారు. ఈ వివాదం నేపథ్యంలో ప్రజా దీక్షలకు సన్నాహాలు చేస్తూ, దసరా తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభించనున్నారని సమాచారం. దీంతో ఏపీ రాజకీయాలు మరో మలుపును చూడనున్నాయి.

35
I Love Muhammad బ్యానర్ వివాదం? దేశంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో బరావఫాత్ శోభాయాత్రలో “I Love Muhammad” ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో వివాదం చెలరేగింది. స్థానిక హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయగా, పోలీసులు టెంట్ మార్చి 24 మందిపై కేసులు పెట్టారు. తరువాత ఉనావ్, మహారాజ్‌గంజ్, కౌశాంబీ తదితర ప్రాంతాల్లో ఆందోళనలు, రాళ్లదాడులు జరిగాయి. హైదరాబాద్, నాగ్‌పూర్, లక్నోలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. ఉత్తరాఖండ్ కాశీపూర్‌లో పోలీసులతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై రాజకీయ పార్టీలూ, మతపెద్దలూ భిన్నంగా స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీ మత స్వేచ్ఛని ప్రస్తావించగా, బీజేపీ చట్టం అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

45
వాణిజ్యం, రక్షణ, ఇండో-పసిఫిక్‌పై భారత్-అమెరికా కీలక చర్చలు

అమెరికా భారత్‌పై విధించిన భారీ దిగుమతి సుంకాల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. న్యూయార్క్‌లో జరిగిన 80వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ అయ్యారు. 

వాణిజ్యం, రక్షణ, ఔషధాలు వంటి ప్రధాన రంగాలపై ఇరువురు చర్చలు జరిపారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంత అభివృద్ధి, క్వాడ్‌ సహకారం బలోపేతం దిశగా కలిసి పనిచేయాలని అంగీకరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విమర్శలతో భారత్‌పై విధించిన సుంకాల కారణంగా దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నంగా ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

55
ఆసియా కప్ : డూ ఆర్ డై మ్యాచ్.. సొంత దేశంలోనే పాక్ పై విమర్శలు

ఆసియా కప్ 2025 లో మంగళవారం శ్రీలంక, పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు ఫైనల్ అవకాశాలు ఉంటాయి. లేకుంటే ఇంటికి వెళ్తాయి. 

కాగా, ఈ టోర్నీలో భారత్ తో ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది పాకిస్తాన్. మ్యాచ్ ను కోల్పోవడంతో పాటు ఆటగాళ్ల ప్రవర్తన తీరుపై సొంత దేశంలోనే పాకిస్తాన్ విమర్శలు ఎదుర్కొంటోంది.  పాక్ జట్టు తీరుపై ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సొంత జట్టుపై విమర్శలు గుప్పించారు. పాక్‌ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసీం మునీర్, పీసీబీ చైర్మన్ నఖ్వీ ఓపెనర్లు ఆడితే, అంపైర్లంతా పాక్‌ వ్యక్తులు అయితేనే జట్టు విజయం సాధిస్తుందేమో అనే రీతిలో వ్యంగ్య వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

Read more Photos on
click me!

Recommended Stories