రోడ్డుపై గుంతల వల్ల కలిగిన నష్టానికి వినియోగదారుల హక్కును క్లెయిమ్ చేసే పద్ధతులు:
ముందుగా మీకు కలిగిన నష్టాలకు సంబంధించి ఆధారాలు సేకరించండి. గుంతల స్పష్టమైన ఫొటోలు, మీ వాహనానికి జరిగిన నష్టం ఫొటోలు తీయండి. మీ వాహనం లైసెన్స్ ప్లేట్ నంబర్‌తో సహా సంఘటన జరిగిన కచ్చితమైన సమయం, ప్రదేశాన్ని రాసి పెట్టుకోండి.
అధికారికంగా ఫిర్యాదు చేయండి:
మీ నగర మున్సిపాలిటీ వెబ్‌సైట్ లేదా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు చేసినందుకు రుజువుగా ఆ ఫిర్యాదు స్క్రీన్‌షాట్ లేదా రసీదు తీసుకోండి.
లీగల్ నోటీసు పంపండి
రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ చిరునామా ఉంటే లేదా మున్సిపల్ సంస్థకు లీగల్ నోటీసు పంపవచ్చు.
జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ వెబ్‌సైట్ ఈ ప్రక్రియను ప్రారంభించడానికి ఒక వేదికను అందిస్తుంది.
వినియోగదారుల కేసు నమోదు చేయండి:
వినియోగదారుల రక్షణ చట్టం, 2019 కింద వినియోగదారుల కమిషన్‌లో కేసు నమోదు చేయండి.
మీకు లాయర్ అవసరం లేదు. రోడ్డు ఫొటోలు, నష్టం, అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించిన ఆధారాలతో మీరు కేసు నమోదు చేయవచ్చు.