1984లో ఆసియా కప్ మొదలైంది. తొలి సీజన్‌లోనే భారత్ ఛాంపియన్ గా నిలిచింది. శ్రీలంకను ఓడించి ఆసియా కప్ టైటిల్‌ను జట్టుకు అందించిన తొలి కెప్టెన్ సునీల్ గవాస్కర్.
1988 ఆసియా కప్‌లో శ్రీలంకను ఓడించి భారత్ రెండో ట్రోఫీని గెలుచుకుంది. అప్పుడు భారత కెప్టెన్‌గా దిలీప్ వెంగ్‌సర్కార్ ఉన్నారు.
1990లో శ్రీలంకను ఓడించి భారత్ మూడోసారి ట్రోఫీని గెలుచుకుంది. ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్‌గా మహ్మద్ అజారుద్దీన్ ఉన్నారు.
తన కెప్టెన్సీలో రెండుసార్లు ఆసియా కప్ టైటిల్‌ను భారత్‌కు అందించిన తొలి కెప్టెన్‌గా అజారుద్దీన్ నిలిచారు. 1995లో అతని కెప్టెన్సీలో భారత్ నాలుగోసారి శ్రీలంకను ఓడించింది.
2010లో భారత జట్టు కెప్టెన్ గా ఎంఎస్ ధోని ఉన్నారు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో తన కెప్టెన్సీలో శ్రీలంకను ఓడించి భారత్‌కు ఐదో ట్రోఫీని అందించాడు.
2016లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో టీ20 ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి భారత్ ఆరో ట్రోఫీని గెలుచుకుంది.
2018లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ. హిట్ మ్యాన్ కెప్టెన్సీలో వన్డే ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి భారత్ ఏడో ట్రోఫీని గెలుచుకుంది.
చివరిసారిగా ఆసియా కప్ 2023లో జరిగింది. వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో శ్రీలంకను ఓడించి భారత్ ఎనిమిదో ట్రోఫీని గెలుచుకుంది. అప్పుడ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నారు.