Diwali 2021 : పండగ వేళ.. మీ బరువును ఈ ఆసనాలతో ఇలా కంట్రోల్ లో పెట్టుకోండి..

First Published Oct 30, 2021, 3:08 PM IST

ఇష్టమైన పండగ పిండివంటకాల్ని లాగిస్తూ కూడా మీ వెయిట్ మెయింటేన్ చేయడం సాధ్యమేనా? అంటే ఖచ్చితంగా సాధ్యమే అంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు.

సంవత్సరంలో అత్యంత ఆసక్తితో ఎదురుచూసే పండుగ దీపావళి.. దీపకాంతుల తోరణాలు, టపాకుల మోతలు, రకరకాల పిండివంటలు, స్వీట్లతో దీపావళి ఎంతో సంతోషంగా గడుపుకుంటారు. బంధువులు, స్నేహితులతో కలిసి పండుగ జరుపుకునే సమయంలో వారితో కలిసి డైట్ ని మరిచి కాస్త నోటికి పనిచెప్పడమూ మామూలే.. పర్యవసానం ఇన్ని రోజులు చేసిన డైటింగులు, తీసుకున్న జాగ్రత్తలు పక్కకుపోయి కాస్త ఒళ్లు రావడం ఖాయం. 

అందుకే పండగ పూట కూడా నోరు కట్టుకునేవాళ్లు చాలామందే ఉంటారు. అలా కాకుండా అటు ఇష్టమైన పండగ పిండివంటకాల్ని లాగిస్తూ కూడా మీ వెయిట్ మెయింటేన్ చేయడం సాధ్యమేనా? అంటే ఖచ్చితంగా సాధ్యమే అంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు.

ఈ ఆరు సాధారణ యోగా ఆసనాలు చేస్తే..మీ పండుగను ఆస్వాదించడంలో మీరు ఇబ్బంది పడక్కరలేదు అని సూచిస్తున్నాయి. 

Yoga

ఊర్ధ్వ కర్తలా తాడాసనం
Urdhva kartala tadasana అనేది మామూలుగా నిలబడి ఉన్నట్టుగా ఉండే ఆసనం. నిటారుగా నిలబడి శరీరాన్ని భూమి, ఆకాశాన్ని కలుపుతున్నట్టుగా ఉండాలి. దీనికోసం నిటారుగా నిలబడి మీ చేతులను గాలిలో పైకి లేపాలి. అరచేతులను ఇంటర్‌లాక్ చేస్తూ పైకి చాచాలి.  దీనివల్ల శరీరం మొత్తం చైతన్యవంతంగా మారుతుంది. దీనివల్ల శరీరంలోని ప్రతీ కణం శక్తివంతంగా తయారవుతుంది. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. కండరాలను బలోపేతం చేయడంతో పాటు చురుకుదనాన్ని మెరుగుపరుస్తుంది.

పార్శ్వకోనాసనం 
శరీరాన్ని ఒక వైపు సాగదీసే ఆసనం Parsvakonasana. దీన్ని చేయడానికి ముందు మీ పాదాలను దూరంగా పెట్టి.. హిప్ ప్రాంతంలో లూజ్ గా ఉండేలా చూసుకోవాలి. తరువాత ఒక కాలు నుండి 90-డిగ్రీల కోణంతో మరో కాలు వైపు వంగుతూ..శరీరాన్ని సాగదీయాలి. ఇప్పుడు 90 డిగ్రీలు వంగిన కాలు వైపుకు వంగి, ఎదురుగా ఉన్న చేతిని చెవుల పైన చాచి, మరొక అరచేతిని పాదాల ముందు నేలపై ఉంచండి. శరీరం మొత్తానికి బలాన్ని, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ఆసనం గొప్పది.

yoga

అశ్వ సంచలన్ 
ఇది సూర్య నమస్కారంలో భాగమైన ఆసనం. దీన్నే Ashwa sanchalan ఆసనం అంటారు. ఇది లో లంగ్ ఫోజ్. ఈ pose చేయడానికి ఒక కాలు వెనక్కి, ఒక కాలు ముందుకు పెట్టి నడుం భాగంలో వెనక్కి వంచి మొహాన్ని సూర్యుడి వైపుకి పెట్టి.. చేతులు రెండు నమస్కార భంగిమలో పెట్టాలి. ఈ ఆసనం వల్ల జీర్ణక్రియ, జీవక్రియను మెరుగుపరుస్తుంది.

నౌకాసనం
Naukasana కడుపు కండరాలపై పనిచేస్తుంది.  మీ coreని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ ఆసనం వేయడానికి పైకప్పుకు ఎదురుగా నేలపై పడుకోవాలి. తరువాత మీ చేతులను మీ ప్రక్కన ఉంచాలి. మీ భుజాలను విశ్రాంతిగా వదలాలి. తరువాత వీపును నిటారుగా ఉంచండి. ఇప్పుడు మీ చేతులు, కాళ్ళను నేల నుండి పైకి లేపాలి. శరీరం V-ఆకారంలో ఉండే వరకు 45-డిగ్రీల కోణం వచ్చేలా చూసుకోండి. ఇలా 6 సెకన్లపాటు అలాగే ఉంచి లోతైన శ్వాసను తీసుకోవాలి. 

వీర బధ్ర ఆసనం 
Veerbhadra asana అంటే తాడసానాలో నిలబడి, పాదాలను 3-4 అడుగుల దూరంలో ఉంచి, భుజం-పొడవుతో పాటు చేతులను విస్తరించడం నుంచి మొదలవుతుంది. ఆ తరువాత ఒక అడుగు నుండి 90-డిగ్రీల కోణాన్ని పెట్టి, మరొక కాలును సాగదీయడం ద్వారా పాదాలను భూమికి గట్టిగా అదమాలి. ఇది కండరాలలో బలాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. దీనివల్ల పూర్తి శరీరం వ్యాయమం అవుతుంది. 

జాను సిరా పరిఘాసన 
​Janu sira parighasana చేయడానికి, రెండు మోకాళ్లను చాచి, ఒక కాలు ముందుకు వేసి నేలపై కూర్చోవాలి. ఇప్పుడు చాచిన కాలు మోకాలికి తలను తాకేలా వంచండి. ఈ ఆసనం వెనుక మోకాలి, తుంటి, వెన్నెముకలోని blockagesను తొలగిస్తుంది. 

click me!