పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా ఉండే కొద్దిమంది వ్యక్తుల్లో శరత్ మరార్ ఒకరు. నిర్మాతగా శరత్ మరార్ పవన్ కళ్యాణ్ తో మల్టిపుల్ చిత్రాలు నిర్మించారు. సర్దార్ గబ్బర్ సింగ్, గోపాల గోపాల, కాటమరాయుడు లాంటి చిత్రాలని శరత్ మరార్ పవన్ తో నిర్మించారు. చాలా కాలం శరత్ మరార్ పవన్ తో ట్రావెల్ చేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ మనస్తత్వం ఏంటో శరత్ మరార్ కి బాగా తెలుసు.