ఈ ఆహారాలు జ్ఞాపకశక్తిని తగ్గిస్తాయి.. ఎక్కువగా తినకండే..

First Published Feb 2, 2023, 5:03 PM IST

జ్ఞాపకశక్తి  మెరుగ్గా ఉండేనే మనం అన్ని విధాలా బాగుంటాం. అదే మెమోరీ పవర్ తగ్గితే.. పక్కనోళ్ల విషయాల సంగతి పక్కన పెడితే.. మన ఇంట్లో వారి పేర్లు.. మీకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను మర్చిపోతే ఎన్ని సమస్యలొస్తాయో ఊహించడానికే కష్టంగా ఉంది కదూ. అలాంటి సమస్య ఒకవేళ మీకు నిజంగా వస్తే..? మీకు తెలుసా కొన్ని ఆహారాలు మెమోరీ పవర్ ను బాగా తగ్గిస్తాయట.  
 

memory

మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. అంటే మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారం చాలా ముఖ్యమన్న మాట. శరీరంలోని ఏ అవయవం అయినా సరే సరిగ్గా పనిచేయడానికి అవసరమైన అన్ని పదార్థాలు, శక్తి ఆహారం ద్వారానే లభిస్తాయి. అయితే కొన్ని ఆహారాలు మనకు మంచివి కాకపోవచ్చు లేదా మనకు హాని కలిగించొచ్చు. ఇవి మెదడు పనితీరును ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇవి జ్ఞాపకశక్తిని తగ్గిస్తాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

చక్కెర

చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆహారాల లీస్ట్ లో ముందుంటాయి. ముఖ్యంగా తీపి పానీయాలు. మనం షాపుల్లో కొనే శీతల పానీయాల్లో శుద్ది చేసిన చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన ఆహారాలు మెదడు ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతుంది.  అయితే ఇవి నేరుగా మెదడును ప్రభావితం చేయవు. కానీ  హృదయ సంబంధ సమస్యలు, డయాబెటిస్ కు కారణమవుతాయి. వీటితో పాటుగా మెదడు కూడా ప్రభావితమవుతుంది. స్వీట్లను ఎక్కువగా తిన్నప్పుడు ఇన్సులిన్ హార్మోన్ లలో వచ్చే మార్పులు కూడా మెదడుపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా జ్ఞాపకశక్తి తగ్గుతుంది. నేర్చుకునే సామర్థ్యం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 

ట్రాన్స్ ఫ్యాట్స్

ట్రాన్స్ ఫ్యాట్స్ మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. కానీ నేడు చాలా మంది ఇవి ఉన్న ఆహారాలనే ఎక్కువగా తింటున్నారు. ఈ కేటగిరీకి చెందిన కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు కూడా మెదడుకు మంచివి కావు. ఇది ఆహారాలలో సహజంగా లభిస్తుంది. కానీ ప్రాసెస్డ్ ఫుడ్ లోనే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ మోతాదుకు మించి ఉంటాయి. 
 

మద్యం

కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఆల్కహాల్ ను మోతాదులో తాగితే ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదని చెప్తే.. ఇంకొన్ని అధ్యయనాలు ఆల్కహాల్ మొత్తమే మంచిది కాదని చెబుతున్నాయి. అయితే మద్యం సేవించడం వల్ల మెదడుపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. క్రమం తప్పకుండా ఆల్కహాల్ ను తాగే వ్యక్తులు జ్ఞాపకశక్తిని ఎక్కువగా కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు. ఆలోచించే సామర్థ్యం కూడా బాగా తగ్గుతుంది.

కార్భోహైడ్రేట్లు

మనం తినే చాలా ఆహారాల్లో కార్బోహైడ్రేట్లు పక్కాగా ఉంటాయి. కానీ శుద్ధి చేసిన కార్బ్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇలాంటి వాటిలో పోషకాలు తక్కువగా ఉంటాయి. మైదా ఇందుకు మంచి ఉదాహరణ. మీరు తినే ఆహారంలో ఈ రకమైన ఆహారాలు ఎక్కువగా ఉంటే మీ మెదడుకే కాదు మీ మొత్తం ఆరోగ్యానికి మంచిది కాదు.
 

స్వీట్స్

రెగ్యులర్ గా స్వీట్లను తప్పకుండా తినేవారున్నారు. ఇక కొందరైతే రాత్రి భోజనం చేసిన తర్వాత ఖచ్చితంగా స్వీట్స్ ను తింటుంటారు. కానీ కృత్రిమ స్వీటెనర్లతో తయారు చేసిన వంటకాలను క్రమం తప్పకుండా తినడం మెదడుకు మంచిది కాదు. ఎందుకంటే ఇవి మెమోరీ పవర్ ను తగ్గిస్తాయి. 
 

Foods For Brain

మెదడుకు మేలు చేసే ఆహారాలు

కొన్ని ఆహారాలు మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. అవోకాడోలు, ఆలివ్ ఆయిల్, కాలీఫ్లవర్, క్యాబేజీ, బచ్చలికూర, డార్క్ చాక్లెట్, కొబ్బరి నూనె ఇవన్నీ మేధస్సును పెంచుతాయి. మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే ఇలాంటి ఆహారాలను ఎక్కువగా తినండి.  

click me!