100గదుల ఇళ్లు.. 39మంది భార్యలు.. 94మంది పిల్లలు!

First Published Sep 18, 2020, 1:13 PM IST

మరి అంత మంది భార్యల్లో ఆయన ఎవరితో ఎక్కువ సమయం గడుపుతాడు అనే అనుమానం మీకు కలగొచ్చు. అయితే.. ఆ విషయంలో ఆయన మాత్రం అంత టెన్షన్ అవసరం లేదని, భార్యలే ఒకరితో ఒకరు మాట్లాడుకుని సమయం కేటాయించుకుంటారని జియోనా అన్నారు. 

ఓ వ్యక్తికి ఎంతమంది భార్యలు ఉంటారు..? ఇదేం ప్రశ్న అని అడగకుండా. ఎవరికైనా ఒక్క భార్యే ఉంటుంది. మహా అయితే.. చాలా కొద్ది మందికి ఇద్దరు, ముగ్గురు భార్యలు ఉంటారు. కానీ ఈ వ్యక్తికి మాత్రం ఏకంగా 39మంది భార్యలు. 94 మంది పిల్లలు, 14 మంది కోడళ్లు, మనుమలు, మనవరాళ్లతో కలిపి మొత్తం అటూ ఇటుగా 200 మంది వరకు ఉంటారు.
undefined
వాళ్లంతా ఉండటానికి ఆయనకు 100 గదుల ఇళ్లు ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం ఉన్న ఈ వ్యక్తి ఉన్నది మరెక్కడో కాదు. మనదేశంలోనే. మిజోరాంకి చెందిన ఈ వ్యక్తి గురించి చెప్పాలంటే.. వినేవాళ్లకు ఓపిక ఉండాల్సిందే.
undefined
ఆయన పేరు జీయోనా చానా. 1945లో పుట్టిన జియోనాకు 17వ ఏటనే వివాహం అయింది. ఆయనకు ఇప్పుడు 39 మంది భార్యలు. చిన్న భార్య వయసు 38 ఏళ్లు. ఒక ఏడాదిలో ఏకంగా 10 పెళ్లిళ్లు చేసుకున్నారు.
undefined
క్రైస్తవ మతానికి చెందిన చానా తెగలో బహు భార్యత్వం ఉంది. ఆయనకు నాలుగు అంతస్థుల భవనం, ఒక గెస్ట్‌ హౌస్‌ ఉంది. జియోనాకు ఇప్పుడు 70ఏళ్లు దాటాయి. మిజోరాం రాష్ట్రం, భక్తవాంగ్‌ గ్రామంలో ఈ కుటుంబం ఉంటుంది.
undefined
అందరూ భోజనానికి కూర్చోవాలంటే 39 కోళ్లు వండాలి. అందరూ అన్నం తినాలంటే కనీసం 50 కిలోల బియ్యం వండాలి. 60 కిలోల బంగాళదుంపలు కూర ఉంటేనే పూట గడిచేది.ఇంట్లో చికెన్ వండాలి అంటే కనీసం 50 కోళ్లు అవసరం అవుతాయట. ఇక చనా కుటుంబం అంటే ఆ ఊర్లో గౌరవం ఉన్నది. వారు చెప్పినట్టుగా గ్రామం వింటుంది. అందుకే ఎన్నికల సమయంలో చనా కుటుంబం సపోర్ట్ కోసం రాజకీయ నాయకులు వీరి ఇంటి చుట్టూ తిరుగుతుంటారట.
undefined
మరి అంత మంది భార్యల్లో ఆయన ఎవరితో ఎక్కువ సమయం గడుపుతాడు అనే అనుమానం మీకు కలగొచ్చు. అయితే.. ఆ విషయంలో ఆయన మాత్రం అంత టెన్షన్ అవసరం లేదని, భార్యలే ఒకరితో ఒకరు మాట్లాడుకుని సమయం కేటాయించుకుంటారని జియోనా అన్నారు. జియోనా ఎవరినీ మోసగించి పెళ్లి చేసుకోలేదని, బహుభార్యత్వం తమ తెగలో మొదటి నుంచి ఉందని చెప్పారు.
undefined
తమ భార్యలు ఎవరి మధ్య గొడవలు లేవని, అన్యోన్యంగా ఉంటారని, కుటుంబ సభ్యులంతా ఒకే చోట ఉండేందుకు వీలుగా నాలుగు అంతస్థుల భవనం నిర్మించారు. తమ గ్రామానికి వచ్చే అతిథుల కోసం ఒక గెస్ట్‌ హౌస్‌ కూడా నిర్మించారు. పిల్లల కోసం జియోనా కుటుంబం ఒక స్కూల్‌ నడుపుకుంటోంది. ఇంట్లోవాళ్లే ఉపాధ్యాయులు.
undefined
జియోనా కుటుంబం స్వయంగా వ్యవసాయం చేస్తోంది. కోళ్లు, పందుల పెంపకం నిర్వహిస్తుంది. వారికి అవసరమైన ఆహారాన్ని వారే పండించుకుంటారు. పైగా తేయాకు తోటలు కూడా ఉన్నాయి. కుటుంబంలో కొందరు తేయాకు తోటలో పనిచేస్తారు. వడ్రంగి పని చేస్తారు.
undefined
ఇంట్లో ప్రతి గదిలో ఒక టీవీ ఏర్పాటు చేశారు. ఇంటి మరమ్మత్తులు కూడా వాళ్లే చేసుకుంటారు. కాగా ఈనెల 21న జియోనా తన 71వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకోబోతున్నారు. అతను మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిద్దాం.
undefined
click me!