బియ్యాన్ని కడిగే వండాలా?

First Published | Mar 9, 2024, 9:58 AM IST

మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. బియ్యాన్ని ఒకటి రెండు సార్లు బాగా కడిగి వండటం. అయితే బియ్యాన్ని కడిగే ఎందుకు వండుతారని ఎప్పుడైనా ఆలోచించారా? 
 

ఇంట్లో ఆడవాళ్లు ఎన్నో పనులు చేస్తుంటారు. అందులో మనకు చాలా విషయాలు తెలియవు. వాటిని మనం కూడా ఫాలో అవుతుంటాం తప్ప ఇలా ఎందుకు అని మాత్రం అడగం. అందులో బియ్యాన్ని కడగడం ఒకటి. బియ్యాన్ని కడిగి వండే అలవాటు ఇప్పటిది కాదు.. శతాబ్దాలది. వంటకు ముందు బియ్యాన్ని కడగడం ఒక సంస్కృతిగా మారింది. అయితే వండటానికి ముందు బియ్యాన్ని కడగడం వల్ల వాటికున్న పిండి పదార్ధాలు, మలినాలు తొలగిపోతాయని నమ్ముతారు. దీంతో బియ్యం ఎక్కువ జిగటగా ఉండవు. అలాగే వండటానికి ముందు బియ్యాన్ని ఎందుకు కడగాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


పిండి పదార్థాలు

బియ్యంలో పిండి పదార్థాలు చాలా ఉంటాయి. ఇవి మన బరువును పెంచడంతో పాటుగా ఎన్నో సమస్యలకు కారణమవుతాయి. అదే బియ్యాన్ని కడిగి వండటం వల్ల వాటికున్న అదనపు పిండి పదార్థాలు తొలగిపోతాయి. బియ్యాన్ని పాలిష్ చేసినప్పుడు లేదా ప్రాసెస్ చేసినప్పుడు వాటిపై పిండి పొర ఏర్పడుతుంది. దీనివల్ల అన్నం జిగటగా ఉంటుంది. అన్నం జిగటగా కావొద్దంటే ఖచ్చితంగా బియ్యాన్ని కడిగే వండాలని నిపుణులు చెబుతున్నారు. 
 

Latest Videos


rice

మలినాలు 

బియ్యాన్ని బాగా కడగడం వల్ల ఎక్స్ ట్రా పిండి పదార్థాలు తొలగిపోవడంతో పాటుగా వాటికి అంటుకున్న మురికి, మలినాలు పోతాయి. అయితే ఇది మీరు తినే బియ్యం ఎలా ప్రాసెస్ చేయబడ్డాయి? ఎలా నిల్వ చేయబడ్డాయి? అనే దానిపై ఆధారపడి ఉంటుంది. దీనిని బట్టి దుమ్ము, ధూళి లేదా ఇతర కాలుష్య కారకాలు బియ్యంలో ఉండొచ్చు. బియ్యాన్ని చల్ల నీటిలో కడగడం వల్ల ఈ మలినాలు, మురికి అంతా పోయి బియ్యం శుభ్రం అవుతాయి. 

అన్నం మెత్తగా కాదు

బియ్యాన్ని సరిగ్గా కడగకుంటే కూడా బియ్యం ఒకదానికొకటి అంటుకుని మెత్తగా ఉంటుంది. బియ్యాన్ని బాగా కడిగి వండితే రైస్ అంటుకోదు. ఎందుకంటే బియ్యం పై పొరపై ఉండే అదనపు పిండి పదార్ధం మెతుకులు ఒకదానికొకటి అంటుకునేలా చేస్తుంది. అన్నం జిగటగా ఉడకడం మీరు అప్పుడప్పుడు గమనించే ఉంటారు. అందుకే అన్నం వండటానికి ముందు బియ్యాన్ని బాగా కడగండి. 
 

 బియ్యం ఆకృతిని మెరుగుపరుస్తుంది

బియ్యాన్ని కడగడం వల్ల అన్నం ఆకృతి కూడా మెరుగుపడుతుంది.చాలా మంది అన్నాన్ని మెత్తగా తినరు. అన్నం ఒకదానికొకటి అంటుకోకుండా ఉండే అన్నాన్నే బాగా ఇష్టపడతారు. మరికొంతమంది మాత్రం  మెత్తగా, జిగటగా తినడానికి ఇష్టపడతారు. ఏదేమైనా బియ్యాన్ని బాగా కడిగితే అన్నం బాగా అవుతుంది. పిండి పదార్థాలు కూడా పోతాయి. 
 

బియ్యాన్ని ఎప్పుడు కడగొద్దు?

బియ్యాన్ని కడగడం వల్ల వాటికుండే మురికి మొత్తం పోతుంది. పిండి పదార్ధాలు కూడా తగ్గుతాయి. అయితే మీరు కొన్ని సార్లు బియ్యాన్ని కడగాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడెప్పుడంటే?

1. బియ్యం రకం

బియ్యం రకాన్ని బట్టే కడగాలి. అంటే బాస్మతి వంటి పొడుగ్గా ఉండే బియ్యాన్ని బియ్యాన్ని తరచుగా కడగడం వల్ల వాటిలోని అదనపు పిండి పదార్ధాలు తొలగిపోతాయి. అలాగే ఫీడింగ్ రైస్ తయారవుతుంది. అయితే ఆర్బోరియో లేదా సుషి బియ్యం వంటి చిన్నగా ఉండే బియ్యం వాటి కొంచెం జిగటగా ఉంటాయి. ఇవి అలాగే  తయారవుతాయి. కాబట్టి వీటిని మీరు కడగాల్సిన అవసరం లేదు. 
 

2. వంట విధానం

మీరు వంట విధానం బట్టి కూడా బియ్యాన్ని కడగాల్సిన అవసరం లేదు. క్రీమీగా కావాలనుకుంటే రిసోటో లేదా రైస్ పుడ్డింగ్ వంటి వంటకాలకు పిండి పదార్ధాలను అలాగే ఉంచాలి. అందుకే ఇలాంటి వంటకాలు తయారుచేసినప్పుడు బియ్యాన్ని ఒకసారి కడగడం లేదా మొత్తమే కడగాల్సిన అవసరం లేదు. అయితే పిలాఫ్ లేదా స్టిర్ ఫ్రై రైస్ తయారు చేసేటప్పుడు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.

click me!