మామిడి కాయ, మామిడి పండు.. రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?

First Published May 16, 2024, 1:50 PM IST

మామిడి రుచిగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే చాలా మందికి పచ్చి మామిడి కాయ మంచిదా? మామిడి పండు మంచిదా? అన్న డౌట్ చాలా మందికి వస్తుంటుంది. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే? 

Image: Getty

ఎండాకాలాన్ని మామిడి పండ్ల సీజన్ అంటారు. ఎందుకంటే ఈ ఒక్క సీజన్ లోనే మామిడి పండ్లు దొరుకుతాయి. అందులోనూ మామిడి అందరికీ ఎంతో ఇష్టమైన పండు. అయితే రుచిలోనే కాదు మామిడి పోషణ ఇవ్వడంలో కూడా ముందుంటుంది. అయితే చాలా మందికి మామిడి కాయ, మామిడి పండులో ఏది మంచిదన్న డౌట్ వస్తుంటుంది. నిపుణుల ప్రకారం.. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

పచ్చి మామిడి

పచ్చి మామిడి సాధారణంగా పుల్లగా,గట్టిగా ఉంటుంది. దీని బాహ్య చర్మం ఆకుపచ్చగా ఉంటుంది. పచ్చి మామిడిని సాధారణంగా ఎన్నో రకాల వంటల్లో వేస్తారు. అలాగే వీటితో సలాడ్లు, ఊరగాయలు, చట్నీలను తయారుచేస్తారు. 
 

raw mango

పచ్చిమామిడి ప్రయోజనాలు

విటమిన్ సి:  పచ్చి మామిడికాయల్లో మన రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మనల్ని ఎన్నో రోగాల నుంచి రక్షిస్తుంది. పచ్చిమామిడి కాయలోని విటమిన్ సి మన చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. 

Image: Getty Images

పండిన మామిడి పండ్ల మాదిరిగానే పచ్చి మామిడికాయలో క్వెర్సెటిన్, ఐసోక్వెర్సిట్రిన్, ఫిసెటిన్, గాలిక్ ఆమ్లం వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి, మంట నుంచి రక్షించడానికి సహాయపడతాయి.
 

జీర్ణక్రియ: పచ్చి మామిడికాయలో అమైలేస్ వంటి ఎంజైములు కూడా ఉంటాయి. ఇవి కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయడానికి సహాయపడతాయి. ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇది మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది.
 

కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది: పచ్చి మామిడి కాయల్లో ఉండే బయోయాక్టివ్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. దీంతో  గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని కొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 

పండిన మామిడి

పండిన మామిడి పండ్లు తియ్యగా, జ్యూసీగా ఉంటాయి. పండిన మామిడి పండ్లు ఎన్నో రకాలుగా ఉంటాయి. సాధారణంగా పండిన మామిడి పండ్లను వాటి బయటి చర్మాన్ని బట్టి గుర్తించొచ్చు. మామిడి పండ్లను డెజర్ట్స్ గా, స్మూతీలుగా, జ్యూస్ లుగా, స్నాక్స్ గా తింటారు.

పండిన మామిడి పండ్ల ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్లు,ఖనిజాలు: పండిన మామిడిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలేట్ వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా చాలా అవసరం.

రోగనిరోధక శక్తి: పండిన మామిడిలో పండ్లలో ఎక్కువ మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది మన శరీరం అంటువ్యాధులు,వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.
 

కంటి చూపును మెరుగుపరుస్తుంది: పండిన మామిడిలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది.ఇది మన శరీరంలోకి వెళ్లి విటమిన్ ఎ గా మారుతుంది. అలాగే ఇది మన కంటిచూపును మెరుగుపరుస్తుంది. వయస్సు సంబంధిత వ్యాధులను నివారించడానికి కూడా సహాయపడుతుంది.

click me!