గన్నేరు మొక్క వల్ల ఉపయోగం ఏమిటి?
గన్నేరు మొక్కను చాలా మంది ప్రజలు తమ ఇళ్లలో , రోడ్ల పక్కన పెంచుతారు. దీనికి ప్రధాన కారణం ఈ మొక్కలో గాలిని శుద్ధి చేసే గుణాలు ఉండడమే. ఈ మొక్క గాలిలోని కాలుష్య కారకాలను ఫిల్టర్ చేసి మనకు స్వచ్ఛమైన గాలిని పంపుతుంది
గన్నేరు పూల రకాలు:
అదేవిధంగా గన్నేరు మొక్కల్లో చాలా రకాలు ఉన్నాయి. అవి ఎరుపు, పసుపు , తెలుపు. అయితే వీటిలో పసుపు రంగులో ఉండే గన్నేరు పువ్వు అత్యంత విషపూరితమైనది.