హింసాత్మక సినిమాలు చూస్తే ఆరోగ్యం సంగతి అంతేనా?

First Published | Dec 24, 2023, 9:48 AM IST

ప్రస్తుత కాలంలో చాలా మంది యాక్షన్ సినిమాలనే ఇష్టపడుతున్నారు. అందుకే ఇలాంటి సినిమాలే ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. అందుకే రీసెంట్ గా వచ్చిన యానిమల్ సినిమా కూడా ఈ కారణంగానే జనాల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. కానీ కొంతమందికి మాత్రం యాక్షన్ నచ్చలేదు. కానీ సినిమాల్లో చూపించే హింస మనల్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తుంది. 
 

ఈ మధ్య కాలంలో యాక్షన్ కంటెంట్ కు జనాల్లో క్రేజ్ బాగా పెరిగింది. అందుకే ప్రస్తుత కాలంలో ఇలాంటి సినిమాలు, సిరీస్ లు చాలా వస్తున్నాయి. ఇటీవల బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ నటించిన యానిమల్ చిత్రం బాక్సాఫీస్ మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది. థియేటర్లు తెరుచుకోవడంతో ఈ చిత్రం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చాలా మందికి ఈ సినిమా బాగా నచ్చి ప్రశంసలు కురిపించారు. యాక్షన్ లవర్స్ కి ఇక ఈ సినిమా పిచ్చ పిచ్చగా నచ్చేసింది. అయితే సినిమాలో చూపించిన పలు సన్నివేశాలు, వాడిన డైలాగులపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.వీటిలో యాక్షన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రియాలిటీ కాకపోయినా.. జనాలపై మాత్రం ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో.  ఇలాంటి పరిస్థితుల్లో హింసాత్మక సినిమాలు చూడటం వల్ల ప్రజల మనసుపై ఎలాంటి ప్రభావం పడుతుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 
 

Watching Tv


అయోవా స్టేట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల బృందం 2017 విశ్లేషణ ప్రకారం.. హింసాత్మక సినిమాలు దూకుడు ఆలోచనలు, కోపంతో కూడిన భావాలు, శారీరక ఉద్రేకం, శత్రు అంచనాలు, దూకుడు ప్రవర్తన,  హింసకు సున్నితత్వం కలిగిస్తుందని పేర్కొంది. ఇది వారి సామాజిక ప్రవర్తనకు ఆటంకం కలిగిస్తుంది. అలాగే సహానుభూతిని తగ్గిస్తుంది. ప్రేమించే, శ్రద్ధ వహించే మానవుడిలో రెండు ముఖ్యమైన లక్షణాలు. అయితే న్యూ ఢిల్లీలోని తులసి హెల్త్కేర్ సైకియాట్రిస్ట్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ గౌరవ్ గుప్తా జాగ్రాన్ తో .. హింసాత్మక సినిమాలు మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇలా వివరించారు. 

మానసిక ఆరోగ్యంపై హింస, హింసాత్మక సినిమాలు, సిరీస్లు లేదా ఇతర కంటెంట్ సినిమాలు మీ మనస్సు, మానసిక ఆరోగ్యంపై లోతైన ప్రభావాన్ని చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. హింసాత్మక సినిమాలు చూడటం వల్ల మీ మానసిక ఆరోగ్యం ఎన్నో విధాలుగా దెబ్బతింటుంది. 
 

Latest Videos


watching tv

దూకుడు ప్రవర్తన

హింసాత్మక సినిమాలు చూసినప్పుడు.. ఇది వారిని మరింత దూకుడుగా మారుస్తుంది. ఏదేమైనా.. ప్రతి ఒక్కరూ హింసాత్మకంగా మారతారని దీనర్థం కాదు. కానీ ఇది కొంతమంది ప్రవర్తనలను ప్రభావితం చేస్తుంది.

భయం 

ఇలాంటి సినిమాలు, సిరీస్లు, కంటెంట్ పట్ల సున్నితంగా ఉండేవారికి హింసాత్మక సన్నివేశాలను చూసినప్పుడు  భయం లేదా ఆందోళన  కలుగుతాయి. ఇది వారి రోజువారీ జీవితాన్ని మరింత ఒత్తిడి, ఆత్రుతగా చేస్తుంది.

సానుభూతి లేకపోవడం

చాలా హింసాత్మక సినిమాలు లేదా టెలివిజన్ షోలు చూస్తే.. మీరు హింసకు తక్కువ సున్నితంగా లేదా భయపడకపోవచ్చు. ఫలితంగా వాస్తవంగా జరుగుతున్న నిజమైన హింసాత్మక విషయాల పట్ల మీ సహానుభూతి తగ్గొచ్చు. అంటే తక్కువ రెస్పాన్స్ అవుతారు. 

పిల్లలపై చెడు ప్రభావం

హింసాత్మక సినిమాల ప్రభావానికి పిల్లలు మరింత సున్నితంగా ఉండే అవకాశం ఉంది. పిల్లలు హింసాత్మక సినిమాలను చూడటం వల్ల పిల్లల ప్రవర్తన, భావోద్వేగ ఆరోగ్యం, దృక్పథం ప్రభావితం అవుతుంది. 
 

పీడకలలకు కారణాలు

హింసాత్మక, గ్రాఫిక్ చిత్రాలు మీ మనస్సులో మెదులుతూనే ఉంటాయి. ఇవి కొన్నిసార్లు మీ నిద్రకు భంగం కలిగిస్తాయి లేదా పీడకలలకు కారణమవుతాయి. ఇది మీ సాధారణ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది అలాగే మీకు నిద్రపట్టకుండా చేస్తుంది. 

click me!