వెలగ పండు గుజ్జు స్త్రీలు తింటే ఏం జరుగుతుంది.. ఎలాంటి మార్పులు వస్తాయ్?

First Published Oct 4, 2021, 5:33 PM IST

చాలా వరకు వెలగ పండు గురించి అందులో ఉండే పోషక విలువలు గురించి ఎవరికీ తెలియదు. కానీ ఈ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

చాలా వరకు వెలగ పండు గురించి అందులో ఉండే పోషక విలువలు గురించి ఎవరికీ తెలియదు. కానీ ఈ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

ఈ వెలగపండును వినాయకుడికి నైవేద్యంగా పెడతారన్న వరకే తెలుసు. వెలగ పండును ఏనుగులు ఇష్టంగా తింటాయి. అందుకే ఈ పండును ఎలిఫెంట్ యాపిల్ అని కూడా పిలుస్తారు.

వెలగ పండు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పండు గుజ్జును స్త్రీలు తింటే  ఎన్నో మార్పులు వస్తుంటాయి. మంచి ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది.

అన్ని పండ్ల కంటే ఈ పండులో ఎక్కువ ఔషధగుణాలు ఉన్నాయి. ఈ పండు చూడటానికి గట్టిగా కొబ్బరికాయలా ఉంటుంది. దీనిని పగలకొట్టి అందులో ఉన్న గుజ్జును తినాలి.

ఈ పండు గుజ్జు వగరుగా ఉంటుంది. కానీ దీనితో పెరుగుపచ్చడి, పప్పు కూర వంటివి చేస్తారు. గుజ్జు పండుగా మారినప్పుడు మంచి రుచిని, వాసనను  కలిగి ఉంటుంది.

ఈ పండులో ప్రోటీన్లు, బీటా కెరోటిన్, థైమీన్, రీబోఫ్లోవిన్, నియాసిస్, కాల్షియం, పాస్పరస్, ఐరన్, ఆక్సాలిక్, మాలిక్, సిట్రిక్ ఆమ్లాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది.

వ్యాధుల నివారణకు ఔషధంగా ఈ పండు బాగా సహాయపడుతుంది. వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి నివారణకు ఈ పండు ఉపయోగపడుతుంది.
 

ఇందులో గుజ్జు తినడం వల్ల రక్తహీనత సమస్య ఉండదు. మూత్రపిండాల సమస్యలు ఉన్నవాళ్లు ఈ పండును తింటే చాలా లాభం ఉంటుంది.

కాలేయ సంబంధించిన సమస్యలకు ఇది మంచి ఔషధం. కంటికి బాగా పనిచేస్తుంది. ఈ గుజ్జును తినడం వల్ల స్త్రీలకు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు దరిచేరవు.

గుజ్జు పండుగా మారినప్పుడు ఆ గుజ్జులో బెల్లం లేదా తేనెను వేసుకొని తినడం వల్ల మంచి లాభం ఉంటుంది. ఎండాకాలంలో ఈ గుజ్జు తీసుకోవడం వల్ల దాహం తీరుతుంది.

click me!