ఫ్రిజ్ లో వేటిని పెట్టకూడదు?

First Published May 22, 2024, 3:53 PM IST

పండ్లు, కూరగాయలు, మిగిలిపోయిన కూరలు, అన్నం, పప్పులు, ఉప్పులతో పాటుగా రకరకాల ఆహార పదార్థాలతో ఫ్రిజ్ లో ఇంత కూడా గ్యాప్ లేకుండా చేస్తుంటారు చాలా మంది. కానీ కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్ లో పొరపాటున కూడా పెట్టకూడదు. అవి ఏంటంటే?
 

fridge


ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫ్రిజ్ ను వాడుతున్నారు. పండ్లు, కూరగాయలతో పాటుగా రాత్రి మిగిలిన ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉండేందుకు వీటిని ఫ్రిజ్ లో పెట్టడం ఒక అలవాటుగా మారింది. ముఖ్యంగా చాలా మంది ఆఫీసులకు వెళ్లేవారు వారానికి సరిపడా పండ్లను, కూరగాయలను, కూల్ డ్రింక్స్ తో పాటుగా ఎన్నో ఆహారాలను ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. ఫ్రిజ్ లో పెడితే ఇవి చాలా వరకు నిల్వ ఉంటాయని చాలా మంది అనుకుంటారు. ఇది నిజమే. కానీ ఫ్రిజ్ లో కొన్ని పెట్టకూడని ఆహార పదార్థాలు ఉన్నాయి. అసలు ఫ్రిజ్ లో వేటిని పెట్టకూడదు? ఒకవేళ పెడితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

టమాటాలు

చాలా మంది టమాటాలను ఒకేసారి చాలా కొనేసి ఒక కవర్ లో పెట్టి ఫ్రిజ్ లో పెడుతుంటారు. దీనివల్ల చాలా రోజుల వరకు టమాటాలు చెడిపోవు. కానీ టమాటాలను అసలు ఫ్రిజ్ లోనే పెట్టకూడదు. అవును టమాటాలను ఫ్రిజ్ లో పెడితే వాటి నాణ్యత, రుచి తగ్గిపోతాయి. టమాటాలను చాలా రోజులు ఫ్రిజ్ లో పెడితే వాటి బయటి చర్మం కుంచించుకుపోయి టమాటాలు రుచిలేకుండా మారుతాయి. 
 

ఉల్లిపాయ

చాలా మంది ఉల్లిపాయలను కూడా ఫ్రిజ్ లో పెడుతుంటారు. కానీ ఉల్లిపాయలను గాలి, వెలుతురు వచ్చే ప్రదేశంలోనే పెట్టాలి. అప్పుడే అవి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. ఉల్లిపాయల్ని ఫ్రిజ్ లో పెడితే అవి మృదువుగా మారుతాయి. అలాగే వాటిలో ఫంగస్ వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
 

వంకాయ

వంకాయలను కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఎందుకంటే వీటిని ఫ్రిజ్ లో పెడితే వాటి రుచి తగ్గుతుంది. వంకాయలను ఇంటి గది ఉష్ణోగ్రత ఉన్న ప్లేస్ లో ఉంచాలి. అలాగే వంకాయలను ఇతర కూరగాయలు, పండ్లతో కలపకూడదు. వంకాయను ఎప్పుడూ సపరేట్ గా పెట్టడమే మంచిది. 
 

Garlic

వెల్లుల్లి

వెల్లుల్లిని కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఎందుకంటే వెల్లుల్లిని ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో పెడితే అవి మొలకెత్తుతాయి. ఉల్లిపాయల మాదిరిగానే వెల్లుల్లిని కూడా గాలి, వెలుతురు ఉండే ప్లేస్ లో పెట్టాలి. అప్పుడే వెల్లుల్లి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. 

ఆలుగడ్డ

బంగాళదుంపలను ఫ్రిజ్ లో పెట్టే అలవాటు కూడా చాలా మందికి ఉంటుంది. కానీ వీటిని ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఎందుకంటే వీటిని చాలా రోజులు ఆలుగడ్డలను ఫ్రిజ్ లో పెడితే వాటి తొక్క నల్లగా మారుతుంది. 
 

అరటిపండ్లు

సాధారణంగా అరటిపండ్లను డ్రై ప్లేస్ లో పెట్టడమే మంచది. కానీ చాలా మంది అరటిపండ్లను కూడా ఫ్రిజ్ లో పెడుతుంటారు. కానీ ఫ్రిజ్ నుంచి వెలువడే చల్లదనం, చీకటి అరటిపండు పోషకాలను తగ్గిస్తాయి. అలాగే త్వరగా కుళ్లిపోయేలా చేస్తాయి.. అందుకే అరటిపండ్లను ఫ్రిజ్ లో పెట్టకూడదు.

Latest Videos

click me!