School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. మళ్లీ స్కూళ్లకు వరుస సెలవులు

First Published | Nov 26, 2024, 11:36 AM IST

ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులు మరోసారి ఎగిరి గంతేసే సమాచారమిది. మరోసారి రాష్ట్రంలోని స్కూళ్లకు వరుస సెలువులు వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకో తెలుసా? 

School Holidays

School Holidays : ఆంధ్ర ప్రదేశ్ లో మరోసారి స్కూళ్లకు వరుస సెలవులు వచ్చే అవకాశాలున్నాయి. ఈ వర్షాకాలంలో ఇప్పటికే భారీ తుఫానులు, వరదల కారణంగా చాలా విద్యార్థులకు భారీగా సెలవులు వచ్చాయి. తాజాగా మరోసారి ఏపీకి వర్షం ముప్పు పొంచివుండటంతో ముందుగానే అప్రమత్తం కావాలని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో వర్షప్రభావం ఎక్కువగా వుండే ప్రాంతాల్లో స్కూళ్ళకు సెలవులు ప్రకటించే అవకాశం వుంది. 

School Holidays

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారుతోంది. దీని ప్రభావంలో ఇవాళ్టి నుండే అంటే నవంబర్ 26 మంగళవారం నుండి ఏపీలో వర్షాలు ప్రారంభం అవుతాయని హెచ్చరించారు. ఈ వర్షాలు మూడు రోజులపాటు కొనసాగనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. 

ఇవాళ, రేపు (మంగళ, బుధవారాలు) ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం వుంది. అక్కడక్కడా భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఈ నెల 29న అంటే శుక్రవారం కోస్తాంద్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారే అవకాశాలు కూడా వున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 


School Holidays

ఏపీలోని ఏ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు? 

భారీ నుండి అతిభారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో మళ్లీ స్కూళ్లకు వరుస సెలవులు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వర్ష ప్రభావం ఎక్కువగా వుండే జిల్లాల్లో రెండుమూడు రోజులు సెలవులు వుండవచ్చు. ఆయా ప్రాంతాల్లో వర్షాలు, వాతావరణ పరిస్థితులను బట్టి జిల్లా అధికారులే సెలవులపై నిర్ణయం తీసుకుంటారు. 

తీవ్ర వాయుగుండం ప్రభావం ఏపీ,తమిళనాడుతో పాటు అండమాన్ నికోబార్ దీవులపై ఎక్కువగా వుంటుందని ఐఎండి తెలిపింది. ఏపీలోని కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. తిరుపతిలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. ఇక మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురవడం, ఆకాశం మేఘాలతో కప్పెసి వాతావరణం చల్లగా వుంటుందని  తెలిపారు. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని... అక్కడక్కడ గంటకు 70 కిలో మీటర్ల వేగంతో వీస్తూ భీభత్సం సృష్టిస్తాయని హెచ్చరించారు. 

ఇలా వర్ష ప్రభావం ఎక్కువగా వుండే జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తారు. ఇప్పటికే ఏ ప్రాంతాలకు వర్షం ముప్పు పొంచివుందో ఆ జిల్లా అధికారులకు సమాచారం అందింది. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో విద్యాశాఖ అధికారుల సూచన మేరకు జిల్లా కలెక్టర్ సెలవులపై నిర్ణయం తీసుకుంటారు. అయితే నదీతీర గ్రామాలు, పట్టణాలు, లోతట్టుప్రాంతాల్లోని స్కూళ్లకు వరుస సెలవులు వచ్చే అవకాశాలున్నాయి. 

School Holidays

తెలంగాణలో చలి పంజా : 

ఇక మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ఏపీలో వర్షాలు కురుస్తుంటే తెలంగాణలో పొగమంచు కురుస్తోంది. ఆదిలాబాద్, సంగారెడ్డి వంటి జిల్లాల్లో అయితే రాత్రి ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. నిన్న (సోమవారం) సంగారెడ్డి జిల్లా కోహీర్ లో అత్యల్పంగా 8.8  డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది... ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో ఇటీవల 8.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. హైదరాబాద్ లో కూడా చలి తీవ్రత పెరిగింది. 

ఇలా నవంబర్ లోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు గజగజా వణికిపోతున్నారు. ఉదయం స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు కూడా స్వెట్టర్లు లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదు. చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం వుంది... కాబట్టి స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, ఉద్యోగులు జాగ్రత్తగా వుండాలని సూచిస్తున్నారు. చలి నుండి కాపాడుకునే దుస్తులు ధరించాకే ఇళ్లనుండి బయటకు రావాలని సూచిస్తున్నారు. మరీముఖ్యంగా తెల్లవారుజామున, రాత్రుళ్లు వెచ్చగా వుండే దుస్తులను ధరించాలి. శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఈ సమయాల్లో ఇళ్లనుండి బయటకు రాకపోవడమే మంచింది. 
 

School Holidays

డిల్లీలోనూ స్కూళ్లకు సెలవులు : 

దేశ రాజధాని డిల్లీని వాయు కాలుష్యం భయపెడుతోంది. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభమై చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో డిల్లీలో గాలి కాలుష్యం పెరిగింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టింది. అంతేకాదు ఈ కాలుష్యం నుండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

ఈ వాయు కాలుష్యం బారిన చిన్నారులు పడకుండా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. డిల్లీతో పాటు హర్యానా ప్రభుత్వం కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఇక ప్రభుత్వ అధికారులకు కూడా వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించారు. ప్రైవేట్ సంస్థలు కూడా ఇలా ఉద్యోగులు ఇళ్లనుండే పనిచేసుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వం సూచించింది.  
 
 

Latest Videos

click me!