ఇండియాలో అత్యంత ఖరీదైన స్కూటర్లు ఇవే. ఎందుకంటే ఇవి కొన్ని కార్ల కంటే కూడా ఎక్కువ ధర పలుకుతున్నాయి. సుమారు రూ.3 లక్షల నుంచి మొదలై రూ. 15 లక్షల వరకు ధర ఉన్న ఈ స్కూటర్లు ఇండియాలో అత్యంత ఖరీదైనవిగా నమోదయ్యాయి. వీటిల్లో BMW,VESPA,Keeway, టీవీఎస్ కంపెనీకి చెందిన స్కూటర్లు ఉన్నాయి. వాటి అసలు ధరలు, ఫీచర్లు తెలుసుకుందాం రండి.
TVS X
వరల్డ్ ఫేమస్ అయిన TVS కంపెనీ నుంచి వచ్చిన చక్కటి ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ TVS X. ఇది 14 bhp గరిష్ట శక్తిని వినియోగించి పనిచేస్తుంది. 40 Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 7 kw మోటార్ తో పనిచేస్తుంది. ఇండియాలో దీని ధర ఎక్స్ షోరూమ్ లో రూ.2.49 లక్షలు. ఇది కేవలం 2.6 సెకన్లలోనే 40 కి.మీ. స్పీడ్ ను అందుకుంటుంది. గరిష్టంగా ఇది గంటకు 105 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 140 కి.మీ. వరకు హాయిగా ప్రయాణించొచ్చు.
Keeway Sixties 300i
కీవే సిక్ట్సీస్ 300i చక్కటి ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ప్రారంభ ధర వచ్చేసి రూ.3.30 లక్షలు. ఇది 278.2 సీసీ ఇంజిన్ ని కలిగి ఉంది. ఇది 18.4 bhp శక్తితో పనిచేస్తుంది. 23.5 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ 0-40 కి.మీ. వేగం అందుకోవడానికి దీనికి 2.59 సెకన్లు మాత్రమే పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మాక్సిమం 120 కి.మీ. స్పీడ్ తో ప్రయాణించగలదు.
VESPA 946 Dragon
వెస్పా 946 డ్రాగన్ స్కూటర్ ని ఇటలీలో తయారు చేస్తారు. దీని ప్రత్యకత ఏంటంటే ఈ స్కూటర్ హ్యాండ్ మేడ్. అంటే మెషీన్ల సాయం లేకుండా కేవలం మనుషులు తమ స్వహస్తాలతో తయారు చేస్తారు. ఈ స్కూటర్ పై అమెరికన్ స్టైల్ లెటర్స్ ఉంటాయి. ప్రతి మోడల్ పై ఇవి ఉండటం మీరు గమనించవచ్చు. ముఖ్యంగా వెస్పా 946 డ్రాగన్ పై డ్రాగన్ బొమ్మ చాలా ఎట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఈ స్కూటర్ ఇండియలో రూ.14.27 లక్షలకు లభిస్తుంది. ఇది 155 సీసీ సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, ఎలక్ట్రానిక్ ఇంజెక్టెడ్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇది 90 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు.
BMW C 400 GT
BMW C 400 GT
BMW C 400 GT కూడా ఖరీదైన పెట్రోల్ స్కూటర్. ఇది ఒక్క లీటర్ కు సుమారు 24 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. ఇండియాలో ఈ స్కూటర్ ధర రూ.11.25 లక్షల వరకు ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర మాత్రమే. ఇందులో 350 సీసీ వాటర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 33 bhp పవర్ ని కలిగి ఉంది. అంతేకాకుండా 35 Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గంటకు 139 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది.
BMW CE 04
BMW CE 04 ఇండియాలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది ఒకటి. దీని ధర రూ.14.90 లక్షలు. ఇది 41 bhp గరిష్ట శక్తితో పని చేస్తుంది. అంతే కాకుండా 62 Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది పర్మనెంట్ మాగ్నెట్ లిక్విడ్ కూల్డ్ సింక్రోనస్ మోటార్ తో పని చేస్తుంది. ఈ స్కూటర్ కేవలం 2.6 సెకన్లలో 50 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇది మాక్సిమం 120 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 130 కి.మీ. వరకు ఆగకుండా పరుగులు తీస్తుంది.